DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్ట్ లకు ఇస్రో రూ. 16 లక్షల నగదు పురస్కారాలు 

పాత్రికేయులకు విక్రమ్ సారాభాయ్ అవార్డు  

రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకూ నజరానా  

సారాభాయ్ శత జయంతి వేడుకల్లో పురస్కారాలు  

(రిపోర్ట్ : సాయిరాం CVS ,

Bureau, DNS ). . . 

విశాఖపట్నం, ఆగస్టు  07, 2019 (డిఎన్‌ఎస్‌) : శాస్త్ర సాంకేతిక, ఖగోళ విజ్ఞానం లో అగ్ర దేశాలకు ధీటుగా విజయవంతమైన అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఇస్రో

పాత్రికేయులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొత్తం రూ. 16 లక్షల నగదు పురస్కారం అందించనుంది. 

భారతీయ సాంకేతిక పితామహులు విక్రమ్ సారాభాయ్ శతజయంతి ఉత్సవాల్లో

భాగంగా ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ) శాస్త్ర విజ్ఞాన రంగంలో కధనాలు, ఆర్టికల్స్ వ్రాసే పాత్రికేయులకు భారీ నజరానా ప్రకటించింది.  à°°à±†à°‚డు

విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.   

భారీ నజరానా:. . . 

రెండు విభాగాల్లో ఎంపిక చేసే à°ˆ పోటీల్లో మొదటి విభాగంలో రూ. 5 లక్షలు  à°¨à°—దు పురస్కారం చొప్పున

ఇద్దరికీ, రెండవ విభాగంలో మూడు బహుమతులు  (మొదటి బహుమతి à°—à°¾ రూ. 3 లక్షలు,  à°°à±†à°‚à°¡à°µ బహుమతి à°—à°¾  à°°à±‚. 2 లక్షలు, మూడవ బహుమతి à°—à°¾ రూ. 1 లక్ష )  à°…ందించనుంది.  

మొదటి విభాగం లో  : . .

.

మొదటి విభాగంలో రూ. 10 లక్షల నగదు పురస్కారం అందించబడుతుంది.  à°‡à°¦à±à°¦à°°à± పాత్రికేయులకు చెరో రూ. 5 లక్షల నగదు పురస్కారం తో పాటు ప్రతిభ పురస్కారం అందించనుంది.

ప్రింట్ మీడియా లో సేవలందిస్తున్న పాత్రికేయులు, లేదా ఫ్రీ లాన్స్ పాత్రికేయులు à°ˆ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. 

ప్రచురణలు శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన

అంశాలపై ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో ప్రక్రియ 2019 నుంచి 2020 సంవత్సరాల మధ్య ప్రచురించబడి ఉండాలి. భారత దేశంలో ప్రచురించబడే దిన పత్రికలూ, సైన్స్ మ్యాగజిన్ లు,

జర్నల్స్ లో ప్రచురించబడినవే à°ˆ పోటీలో పరిగణన లోకి తీసుకోబడతాయి.  

రెండవ విభాగం లో :. . . 

రెండవ విభాగంలో మూడు బహుమతులు అందించడం జరుగుతుంది. మొదటి

బహుమతిగా రూ.  3 లక్షలు, రెండవ బహుమతిగా రూ.  2 లక్షలు, మూడవ  à°¬à°¹à±à°®à°¤à°¿à°—à°¾ రూ.  1 లక్ష నగదు పురస్కారం అందించబడుతుంది.  

అర్హత :  à°ˆ విభాగం లో పోటీపడే ప్రచురణలు హిందీ,

ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల్లో 
ముద్రించబడే భారతీయ పత్రికలూ అయి ఉండాలి. ఆర్టికల్స్, ప్రత్యేక కధనాలు, విజయ కధనాలు, ప్రచురించబడి ఉండాలి.  

స్పేస్ సైన్స్,

టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో ఈ పురస్కారాన్ని ఎంపిక చేయనుంది. పాత్రికేయ రంగంలో సేవలందించే భారతీయులందరికీ ఈ పోటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం

కల్పిస్తోంది.  
విజేతలను ఆగస్టు 1 ,2020 న ప్రకటించ బడుతుంది అని ప్రకటించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam