DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పోర్ట్స్ కాంప్లెక్స్ శంఖు స్థాపన లో అధికారులపై అతిధుల అలకలు

అతిధుల అలకలు, అధికారులపై మంత్రి ఆగ్రహం

మాట్లాడకుండానే వెళ్ళిపోయినా మంత్రి , వైమార్డీఏ చైర్మన్ 

శిలా పలకంలో ద్రోణంరాజు పేరు లేకపోవడంలో అలకలు

పర్వం 

అసలు ద్రోణంరాజు ని ఆహ్వానించారో లేదో తెలియాలి . . .

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )

విశాఖపట్నం, ఆగస్టు  08, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్రీడా ప్రాధికార సంస్థ అభివృద్ధి పనులు  à°¸à°®à°°à±à°§à°µà°‚తంగా నిర్వహించడంలో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టవచ్చినట్టు కనపడుతోంది.

దీనికి నిదర్శనమే విశాఖపట్నం లోని గురువారం జరిగిన హాకీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శంఖుస్థాపన లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తూతూ మంత్రంగా ముగించి మంత్రి,

ఇతర విఐపిలు కనీసం నోరు విప్పకుండా అలిగి వెళ్లిపోయారు. సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రాధికార సంస్థ  à°¨à°¿à°°à±à°®à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨ అంతర్జాతీయ క్రీడా శిక్షణ

కేంద్రం శంఖుస్థాపన కార్యక్రమంలో పర్యాటక శాఖా, క్రీడల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తో పాటు విశాఖ మెట్రో అర్బన్ దేవలోప్మెంట్ అధారిటీ  à°šà±ˆà°°à±à°®à°¨à±

ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. అయితే శీలా పలకం పై  à°®à°‚త్రి పేరు మాత్రమే ఉండడం తో ద్రోణంరాజు పేరు వ్రాయక పోవడాన్ని అధికారులను ప్రశ్నించారు. 
దీనికి

బదులిస్తూ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి జూన్ గేలోట్  à°¨à± ప్రశ్నించగా, తెలుగు రాదు, తనకు తెలియదు అని చెప్పడంతో విస్తుపోయిన ద్రోణంరాజు శ్రీనివాస్

 à°…లిగి వెనుదిరిగి వెళ్లిపోయారు, దీంతో మంత్రి సహా, ఇతర విఐపిలు కూడా వెంటనే వెళ్లిపోయారు. 

ఈ కార్యక్రమానికి అసలు వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు

శ్రీనివాస్ ను ఆహ్వానించడం జరిగిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. లేదా మంత్రి బలవంతం పై ద్రోణంరాజు ను ఆఖరి నిమిషం లో పిలిచారా అనే విషయం తెలియాలి. ఒకవేళ ఇదే

జరిగి ఉంటె అతిధులకు à°ˆ విషయాన్ని వివరించవలసి భాద్యత జిల్లా స్పోర్ట్స్ అధికారి పై ఉంది. 

గౌరవం లేనప్పుడు ఆహ్వానం ఎందుకు :

క్రీడా ప్రాధికార సంస్థ

నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం లో తనకు తగిన ప్రాధాన్యత లేనప్పుడు తనని ఎందుకు ఆహ్వానించినట్టు అని వి à°Žà°‚ ఆర్ డీఏ చైర్మన్  à°¦à±à°°à±‹à°£à°‚రాజు

శ్రీనివాస్ తన సన్నిహితుల వద్ద చర్చించినట్టు సమాచారం. అత్యంత ప్రాధాన్యత కల్గిన జ్ఞాపిక పై తన పేరు లేనప్పుడు తనని ఈ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించినట్టో

తెలియడం లేదని భావించినట్టు తెలుస్తోంది.  

మాట్లాడడానికి ఇష్టపడని మంత్రి : 

తన రాజకీయ సహచరునికి జరిగిన అవమానం చూసి సహించలేక జిల్లా క్రీడాధికారి

తీరుపై మండిపడిన మంత్రి సహా ఇతర విఐపీలు వెనుదిరగడం తో సిబ్బంది కంగారు పడ్డారు. అప్పడి వరకూ మంత్రి మాట్లాడతారు అని ఎదురుచూసిన అధికారులు, క్రీడాకారులు,

సిబ్బంది à°•à°¿ నిరాశే ఎదురయ్యింది. అధికారుల తీరు ఇలాగే ఉంటె క్రీడాకారుల అభివృద్ధి ఎలా గురుతుంది అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. 

శిలాఫలకం పై

ఉన్న పేర్లు : క్రీడలు, పర్యాటక  శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్,  జిల్లా ఇంచార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ, బూడి ముత్యాల నాయుడు, ఎంపీ విజయ్ సాయి రెడ్డి,

ఎంపీ సుబ్బరామిరెడ్డి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ, అధికారులు కె. ప్రవీణ్ కుమార్, కె. భాస్కర్, జిల్లా కలెక్టర్ వి వినయ్ చాంద్ పేర్లు మాత్రమే ముద్రించి ఉన్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam