DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోడీ, షా ల పిలుపు తో రామకోటయ్య తిరిగి బీజేపీ గూటికి

సీనియర్లు తిరిగి భాజపా పార్టీ లోకి రావాలి : కన్నా  

ప్రభుత్వ పదవికి చెరువు రామకోటయ్య రాజీనామా  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . .. 

విజయవాడ, ఆగస్టు  11, 2019

(డిఎన్‌ఎస్‌): దేశం శాంతి సౌభాగ్యం ప్రగతి వైపు నడవాలని ఆకాంక్షించి తిరిగి తన మాతృ సంస్థ అయిన భారతీయ జనతా పార్టీలోకి చేరినట్టు తెలిపారు.  
ఆదివారం విజయవాడలో

జరిగిన బీజేపీ రాష్ట్రపదాధికారుల సమావేశం సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలోకి తిరిగి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ

సలహాదారు పదవికి రాజీనామా చేసిన చెరువు రామ కోటయ్య తిరిగి తన మాతృ సంస్థ అయినా భారతీయ జనతా పార్టీలోకి చేరారు. హిందూ దేవాలయ అభివృద్ధి, అర్చక శ్రేయస్సు

కాంక్షించి బీజేపీ ని వీడి తెలుగుదేశం ఆహ్వానం మేరకు ప్రభుత్వ పదవిని చేపట్టడం జరిగిందన్నారు. అయితే నరేంద్ర మోడీ, అమిత్ షా ల పిలుపు మేరకు తిరిగి బీజేపీ లో

చేరుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అభ్యున్నతికి కృషి చేయనున్నట్టు తెలియచేసారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధానంగా విశాఖపట్నం లో భారతీయ జనతా పార్టీ

పేరు చెప్పగానే తక్షణం స్ఫురణకు వచ్చే పేరు చెరువు రామకోటయ్య.  à°—à°¤ కొంతకాలం వరకూ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ అధికార ప్రతినిధిగా అత్యద్భుతమైన వాగ్ధాటితో

అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం ఆయనది. ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ సుపరిచితులైన విషయం తెలిసిందే. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకై బీజేపీ

ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో మనస్థాపం చెంది పార్టీని వీడారు.   
  
పార్టీని వీడిన వారి తిరిగి రావాలి : కన్నా... .

రామకోటయ్య లాంటి నిబద్దత కల్గిన

సీనియర్లు తిరిగి మాతృ సంస్థల్లోకి రావడం తో పార్టీ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ తెలిపారు. గతంలో వివిద కారణాలతో పార్టీకి

దూరమైనా వారు తిరిగి మాతృ సంస్థల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.   
ఈ కార్యక్రమం లో రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ మరియు మాజీ మంత్రి పైడికొండల

మాణిక్యాలరావు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరారు .  à°ˆ సందర్భంగా పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మురళీధర్, రాష్ట్ర సమన్వయ కర్త సునీల్ దేవధర్, రాష్ట్ర

కార్యదర్శి కాశీరాజు లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam