DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ఏర్పాట్లు ఘనంగా ఉండాలి 

సంయుక్త  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± శివశంకర్

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  11 , 2019 (డిఎన్‌ఎస్‌): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల

ఏర్పాట్లు అదిరిపోయే విధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న పోలీసు

బ్యారక్స్ లో పోలీసు అధికారులు, జిల్లా అధికారులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏర్పాట్లలో ఏ విధమైన లోపాలు ఉండకూడదని

అధికారులకు ఆదేశించారు. వర్షం వస్తే నీరు కారకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని తహసీల్దార్ ఉమామహేశ్వరరావుకు చెప్పారు. సీటింగ్ అరేంజ్ మెంట్

పక్కాగా ఉండాలన్నారు. ఏంకరింగ్ చేసే వారికి ప్రభుత్వ పథకాల పై ముందుగానే తెలియాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై శకటాలు ఎన్ని చేశారు, చేయాల్సినవి ఎన్ని ఉన్నాయో

చూడాలని డ్వామా పిడి ని ఆదేశించారు. వేదికను  à°ªà±‚లతో అలంకరించాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు.  à°¸à°¾à°‚స్కృతిక కార్యక్రమాలు ఆటంకం లేకుండా చూడాలని డిఇఓ కు

చెప్పారు. విద్యార్థులు వేచి ఉండేందుకు టెంట్లు వేయాలన్నారు. సౌండింగ్ సిస్టం చూసుకోవాలని సమాచార శాఖ డిఇ మహేష్ ను ఆదేశించారు. వేడుకలకు స్వాతంత్య్ర

సమరయోధులను పిలవాలని చెప్పారు.  à°…ధికారులకు అప్పగించిన పనులు లోపాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. అనంతరం ప్రవేశ ద్వారంను పరిశీలించి ఇరువైపులా ఫ్లెక్సీలు

ఏర్పాటు చేసి పూలతో అలంకరించాలని చెప్పారు. వేదిక కు ఇరువైపులా శాశ్వతంగా ఉండే విధంగా రేకులతో టాప్ వేయాలని పోలీసు అధికారులు జెసి దృష్టికి తీసుకురాగా ఆ

విధంగా ఏర్పాటు చేయాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ అంతా పరిశీలించి వర్షం నీరు నిల్వ లేకుండా చూడాలని జివిఎంసి ఇంజనీరింగ్ అధికారులకు చెప్పారు.

ఈ సమావేశంలో ఎడిసిపి ఎస్. శ్రీనివాసరావు, ఎడిసిపి ఎ. వెంకటరమణ, ఎడిసిపి ఎ. సుబ్రహ్మణ్యం, జిల్లా అధికారులు డిర్డిఏ పిడి రామ్మోహనరావు, డ్వామా పీడీ సందీప్, జోన్-1 ఎసిపి

సిహెచ్ పాపారావు,డిఇఓ లింగేశ్వర్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam