DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆచార్య సన్నిధి కి పాంచరాత్రాగమ పెన్నిధి మోర్తా     

స్వామి చెంతకు సింహగిరి సేవకులు మోర్తా సీతారామచార్య 

శిష్యరికంలో వందలాది మంది ఆగమ నిష్ణాతులు 

వందలాదిగా యాజ్ఞికాలు, ఆలయ

ప్రతిష్టలు, 

చందనోత్సవం అంటే మోర్తాయే. . ..  

8 ఏళ్ళ వయసులోనే కల్యాణాలు : ఉపమాక అర్చకులు

పీఠాధిపతులకూ సూచనలు :

వైష్ణవ సమాజానికి పెద్ద దిక్కు :

శ్రీ వైష్ణవ సంఘాలు

అందరికీ ఆచార్యులు :  à°¯à°¾à°œà±à°žà°¿à°•à°ªà±€à° à°‚ 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )..

విశాఖపట్నం, ఆగస్టు  13, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆగమ శాస్త్రానికే ఆలంబన.

శ్రీపాంచరాత్ర పయోనిధి, శ్రీమాన్ మోర్త సీతారామభట్టాచార్య తో ప్రత్యక్ష సంబంధం లేని శ్రీ వైష్ణవ ఆలయం తెలుగు రాష్ట్రాల్లో లేదు అంటే అతిశయోక్తి కాదు. సింహాచల

క్షేత్రం లో వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి కరుణ కటాక్షాలు సంపూర్ణంగా పొందిన శ్రీ పాంచరాత్ర ఆగమ మహా మహోపాధ్యాయ మోర్త సీతారామాచార్యులు సోమవారం

పరమ పదానికి చేరుకున్నారు. ఆచార్యాత్వానికి అద్దము పెట్టె విధంగా వందలాది మందిని ప్రత్యక్షంగా, పరోక్షంగా శిష్యులుగా తయారుచేసిన మహనీయులు. సనాతన ధర్మానికి

ఆలంబనగా, ఆసరాగా, తానూ ఉన్నాను అని అన్నివేళలా అంబడుతూ లో ఉండే మహనీయులు. వేద విద్యార్థిగా సింహాచల వరాహుని చెంత చేరిన సీతారాములు తడనుకాలంలో అదే ఆలయంలో అర్చక

భాద్యతలను చేపట్టి కొన్నిదశాబ్దాల కాలం స్వామి సేవలో తరించారు. శ్రీవైష్ణ సంప్రదాయ పరులకు సింహాచలం పేరు చెప్పగానే వెంటనే స్ఫురణకు వచ్చేపేరు మోర్త

సీతారామాచార్యులు. వారు భక్తులైనా, పీఠాధిపతులైనా.   

చందనోత్సవం అంటే మోర్తాయే. : . ..  

 à°à°¡à°¾à°¦à°¿ కొకసారి మాత్రమే లభించే శ్రీ లక్ష్మి వరాహుని నిజరూప దర్శనం

లో జరిగే ప్రతి దైవిక కార్యక్రమంలోనూ మోర్తా ప్రత్యక్ష సంబంధం ఉంది. వరాహ నృసింహ స్వామీ గురించిన వైశిష్ట్యం చెప్పాలి అంటే కేవలం మోర్తాయే అనేంతగా

భక్తులందరికీ అనుబంధం పేరుకుపోయింది. మాట తీరు లో గాంభీర్యం వినగానే సింహాద్రి నాధుడే ఆయన్ను ఆవహించాడా అనేంతగా తన్మయంలోకి వెళ్లిపోవడం తప్ప మారు

ప్రశ్నించే అవకాశం ఉండదు. చందనోత్సవం వైభవం లో స్వామి చందాన ఆరాగా తీత నుంచి, తొలగింపు, అనంతర సుప్రభాత, అర్చనాది సేవల తదుపరి సాయియంత్రం జరిగే సహస్ర ఘటాభిషేకం

వరకూ అన్ని వైదిక కార్యక్రమాల్లో మోర్తావారి సంప్రదింపులు కచ్చితంగా ఉండేవి. గంగధార నుంచి గర్భాలయం వరకూ తీసుకువచ్చే పూర్ణకలశ ను కొన్ని దశాబ్దాల పాటు

మోర్తావారే సేవించడం అంటే ఆయనకు స్వామి ఇచ్చిన అనుగ్రహమే అని చెప్పాలి.  . 

పీఠాధిపతులకూ సూచనలు :

శ్రీ పాంచరాత్ర పయోనిధీ మోర్త సీతారామాచార్యులు

సలహాలు, సూచనలు సామాన్యులకు కాక వేదపరిరక్షణ చేసే పీఠాధిపతులు, యోగులు సైతం పొందేవారు అంటే వీరి పాండిత్యం ఏపాటిదో తెలుస్తోంది. చాలా ఆలయాల్లో ప్రతిష్టలు, బహు

కుండాత్మక యాగాలు వాయిదాపడానికి కారణం వీరి సమయం లభించక పోవడమే అంటే వీరి కోసం భక్తులు ఎంతగా పరితపించేవారో తెలుస్తోంది. 

అందరికీ ఆచార్యులు :

 à°¯à°¾à°œà±à°žà°¿à°•à°ªà±€à° à°‚ 

శ్రీవైష్ణవ ఆగమం లోను, శ్రీ వైష్ణవ దేవాలయ నిర్వహణలోనూ వేలాది మందికి మార్గదర్శకం చేసి అందరికీ ఆఛార్యత్వ భాద్యతలను స్వీకరించిన మహనీయులు

మోర్త సీతారామాచార్యులు అని యాజ్ఞిక పీఠం నిర్వాహకులు పిటిజి కిషోర్ స్వామి అభిప్రాయం పడ్డారు.  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°·à°‚à°—à°¾ వందలాది మంది శిష్యులను ఆగమ విధానంలో

నిష్ణాతులుగా తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లోనే కాకా, ఇతర ప్రాంల్లోనూ ఆలయాల నిర్వహణ భాద్యతలను అందించిన వైదిక ఆచార్యులు. వీరి ద్వారా ఆగమ విద్య నేర్చుకున్న

వేలాది మంది పరోక్షంగా వీరికి శిష్యులుగా మారారని తెలిపారు.   
   à°µà°¾à°°à°¿ జీవనం ద్వారా,  à°¸à°¿à°‚హాచల క్షేత్రం లో పురోహితులుగా భాద్యతలను అద్వితీయంగా నిర్వహించి

అందరితోనూ గురువుగారు అని శిష్య, ప్రశిష్యులా తోనో, వారి కుటుంబ సబీగ్హ్యులతోనే కాక యావత్ భక్త జనం తోనూ ఇదే పిలుపు ద్వారా ప్రపంచానికి సుపరిచితులన్నారు. 
/>  à°¸à°¿à°‚హాచలం కొండపై 108 కుండాలతో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం నిర్వహించినప్పుడు, à°† యాగంలో తనకు à°’à°• ముఖ్యమైన బాధ్యతను అప్పగించినప్పుడు ఆచార్యుల వారిని చాలా

దగ్గరగా సేవించుకునే భాగ్యం కలిగిందాని గుర్తు చేసుకున్నారు. 
ఆ సందర్భంలో చాలా ఆగమ విషయాలను, రహస్యాలను వారితో చర్చించడం జరిగింది. కొన్ని వారి నుండి

తెలుసుకోవడం కూడా జరిగింది. మాలాంటి ఎందరో యజ్ఞాచార్యులకు, గురువులకు, ఆగమ పండితులకు, ఆగమ విద్యార్థులకు ప్రేరణగా నిలిచే  à°¸à±€à°¤à°¾à°°à°¾à°®à°¾à°šà°¾à°°à±à°¯ స్వామి అస్తమయం

ధార్మిక లోకానికే తీరని లోటు!

8 ఏళ్ళ వయసులోనే కల్యాణాలు : ఉపమాక అర్చకులు. . 

శ్రీవైష్ణవ ఆలయాల్లో ఆగమ విధానంలో మోర్త వారు పాంచరాత్ర ఆగమానికి

పట్టుకొమ్మ అని,  à°µà°¾à°°à± మహోన్నతులు అని ఉపమాక  à°µà±‡à°‚కటేశ్వర స్వామి వారి దేవస్థానం, ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. వీరు 8 ఏళ్ళ వయస్సులోనే ( సుమారు 60-65

 à°¸à°‚వత్సరాలు క్రితం)  à°‰à°ªà°®à°¾à°• వేంకటేశ్వరుని ఆలయం లో స్వమి కళ్యాణం చేయించిన ఘనపాటి మోర్తా వారు అని గుర్తు చేసుకున్నారు. 
  15 సంవత్సరాల క్రితం మరొకమారు ఉపమాక

గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో యాజ్ఞీకునిగా వచ్చి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు.  à°¸à±à°®à°¾à°°à± 12 సంవత్సరాలు క్రితం  à°¸à°¿à°‚హాద్రి

అప్పన్న రధంతో వచ్చినప్పుడు ఉపమాక గ్రామంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి   ఆలయ ప్రాంగణంలో సింహాద్రి  à°…ప్పన్న  à°•à°³à±à°¯à°¾à°£à°‚ నిర్వహించడం నిజంగా అధ్బుతం. వీరి

తాతగారు గొట్టుముక్కల అయ్యల్లాచార్యులు వ్రాసిన పాంచరాత్ర ఆగమ గ్రంధాలతో పాటు, అనేక తాళ పత్ర గ్రంధాలను ఆధునీకరించుటకు గాను మోర్తా వారికి అందించినట్టు

గుర్తు చేసుకున్నారు. 

వైష్ణవ సమాజానికి పెద్ద దిక్కు : శ్రీ వైష్ణవ సంఘాలు  . . 

శ్రీ వైష్ణవ సమాజానికి పెద్ద దిక్కుగాను, ఆగమ సలహాదారుగాను, లౌకిక

విషయాల్లోనూ పెద్ద తరహాగా నిలిచినా మోర్తా సీతారామాచార్యులు నిష్క్రమణ తో తీరని లోటు అని శ్రీవైష్ణ సంఘాల ప్రతినిధులు తెలియచేస్తున్నారు. సుమారు మూడు తరాల

ప్రతినిధులతో  à°ªà±à°°à°¤à±à°¯à°•à±à°· సన్నిహిత సంబంధాలు కల్గిన వారు అతి అరుదుగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల శ్రీవైష్ణవ దేవాలయాలకు ప్రధాన

ఆగమ సలహదారు గా, వైదిక శ్రష్ట గా మోర్తా సలహాలు పొందిన తర్వాతే ఏ ఆలయం లోనైనా ఉత్సవాలు, వేడుకలు, ప్రతిష్టలు, ఇతరత్రా యజ్ఞ హోమాదికలు జరుగుతున్నాయని విజయనగరంలోని

శ్రీ సరస్వతి ఆలయ అర్చకులు తాతబాబు తన అనుభూతులను తెలియచేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam