DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మచారి కి దోష పరిహారానికై ఉపాకర్మ తప్పని సరి 

తెలియక చేసిన దోషాలకు ని వృత్తే à°ˆ యజ్ఞ క్రియ 

శ్రావణపూర్ణిమ - నూతన యజ్ఞోపవీత ధారణ  

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ) . . .

విశాఖపట్నం, ఆగస్టు  14, 2019 (డిఎన్‌ఎస్‌) :

శ్రావణ పూర్ణిమ అనగానే ఏంటో ప్రాముఖ్యత కల్గినది. వాటిల్లో ప్రధానమైనది ఉపాకర్మ. యజ్ఞోపవీత అర్హత ఉన్న బ్రహ్మచారులు అందరూ తప్పని సరిగా ఆచరించవలసిన క్రియ. జాతా

సౌచ, మృతా సౌచాలను తెలిసో, తెలియకో పాటించని కారణంగా కలిగే దోషాలకు పరిహారం కోసం నిర్వహించేది ఉపాకర్మ. ఉపనయనం పూర్తి చేసుకుని, వివాహం కానీ యువకులు ఈ క్రియను

తప్పని సరిగా పాటించాలి. ఇది కేవలం బ్రాహ్మణా సామాజిక వర్గం మాత్రమే పాటించేది కాదు, యజ్ఞోపవీత 
ధరించే అర్హత  à°•à°²à±à°—à°¿à°¨ ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఆచరించాలి.

తద్వారా ఉత్తమ జీవన గమనానికి బలం చేకూరుతుంది. సంవత్సరం లో అత్యంత ప్రాధాన్య మైనది శ్రావణ మాసం. ఈ నెలలో పౌర్ణమి రోజున అన్ని సంప్రదాయాల వారూ నూతన యజ్ఞోపవీత ధారణ

చేయడం జరుగుతుంది. అయితే ఉపా కర్మ చేసే వారు   ఒక్కో వేదం సంప్రదాయాన్ని పాటించేవారు ఆయా రోజుల్లో పాటించవలసి ఉంటుంది. వీలు కానీ పక్షంలో శ్రావణ పౌర్ణమి రోజున

ఆచరించడం ఆనవాయితీ. దీనిలో నూతన యజ్ఞోపవీత ధారణ, à°‹à°·à°¿ తర్పణం, దేవా తర్పణాదులు సమర్పించాలి. 

1. ఉపాకర్మ ఎందుకు ?

★నిత్య కర్మానుష్ఠానము (త్రికాల సంధ్యా

వందనం, అగ్నికార్యం, తర్పణం) జంధ్యం ధరించిన ప్రతివారు చేయ వల్సిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవి చేయలేకపోయినప్పుడు  à°† సంవత్సరంలో జరిగిన దోషాల

ప్రాయశ్చితార్థం  à°¤à°ªà±à°ªà°• à°ˆ ఉపాకర్మను ఆచరించాలి. మరియు శౌచం పాటించక వచ్చిన దోషాలను, మైల ఉన్నవారిని తాకడంవలన వచ్చే దోషాలను కూడా ఉపాకర్మ ద్వారా

తొలగించుకోవచ్చు.

2. ఏ వేదం వారు ఎప్పుడు ఆచరిస్తారు?   
ఋగ్వేదం పాటించేవారు శ్రవణానక్షత్రం  (శ్రావణ మాసం) రోజున,  à°¯à°œà±à°°à±à°µà±‡à°¦à°‚ - శ్రావణ పౌర్ణమి నాడు, సామవేదం -

హస్తానక్షత్రము నాడు ఆచరించాలి. 

4. *శ్రావణమాసం లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించక పోతే నిత్యకర్మానుష్ఠానమునకు పనికి రాదా? 

అవును. ఖచ్చితంగా

పనికిరాదు. 

5. ఉపాకర్మ ఏవిధంగా చేస్తారు ? క్లుప్తంగా . . . 

ఋషిపూజ, తర్పణం, విరజాహోమం, యజ్ఞొపవీత ధారణం, బ్రహ్మయజ్ఞం. పంచగవ్య ప్రాశనతో శరీరశుద్ధి

మొదలగునవి.

ముఖ్యంగా ప్రజాపతి, సోముడు, అగ్ని, విశ్వేదేవతలు మొదలుగా గల 9 మంది ఋషులను దర్భలో ఆవాహనం చేసి పూజచేస్తారు.

జంధ్యం ధరించే ప్రతివారు తప్పక

ఈరోజు  à°ªà±à°°à±‹à°¹à°¿à°¤à±à°¨à°¿ లేదా ఆచార్యుని సన్నిధిలో శాస్త్రోక్తంగా  à°¨à±‚తనయజ్ఞోపవీతం ధరించాలి

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam