DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి నాటికి కోడి రామమూర్తి స్టేడియం పూర్తి : మంత్రి ముత్తంశెట్టి

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 16, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం పట్టణంలోగల  à°•à±‹à°¡à°¿ రామమూర్తి స్టేడియంను  2020

జనవరి1à°µ తేదీ నాటికి పూర్తి చేస్తామని  à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక, యువజన, క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న మిని

స్టేడియంలు పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. రణస్థలం మండలం కొండములగాంలో రూ.2 కోట్లతో నిర్మించిన క్రీడా వికాస కేంద్రాన్ని రాష్ట్ర రహదారులు, భవనాల

శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో రాష్ట్ర పర్యాటక, యువజన, క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రాధికార సంస్ధ నిధులను

విడుదల చేయగా రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఈ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించింది. రాష్ట్రంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో

నిర్మించిన మొట్టమొదటి క్రీడా వికాస కేంద్రం. ప్రారంభించిన అనంతరం ఇద్దరు మంత్రులు బాడ్మింటిన్ క్రీడను ఆడి కోర్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర

పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను శ్రీకాకుళం  à°œà°¿à°²à±à°²à°¾ అందించిందన్నారు. జిల్లాలో క్రీడల

అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు అనేక ప్రాచీన దేవాలయాలు, భౌద్ద స్ధలాలు ఉన్నాయన్నారు. వాటిని

అభివృద్ధి చేయుటకు చర్యలు తీసుకుంటామని, టూరిస్ట్ సర్క్యూట్ ను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రణస్ధలం క్రీడా వికాస కేంద్రానికి వై యస్ ఆర్ పేరు

పెట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ చదవాలని అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 75 శాతం ఉద్యోగాలు

స్థానికులకు కల్పించాలని చట్టం తీసుకువచ్చామని అన్నారు. రెండు నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఇప్పటికే వాలంటీర్ల

వ్యవస్థలో ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని సీఎం ధ్యేయమని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. ముఖ్యమంత్రి కూడా క్రీడాకారుడేనని

ఆయన చెప్పారు. ప్రతీ ఒక్కరూ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి కృష్ణ దాస్ మాట్లాడుతూ క్రీడలు

ఆరోగ్యానికి మూలమన్నారు. క్రీడలు వలన చదువులో తక్కువ మార్కులు వచ్చినా అనేక ఉద్యోగాలు వచ్చాయని మంత్రి తెలిపారు. క్రీడాకారులకు సమాజంలో గొప్ప గౌరవం ఉంటుందని,

ప్రపంచంలో క్రీడాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని మంత్రి అన్నారు. క్రీడలకు బడ్జెట్ పెంపుదల చేయాలని తద్వారా సమాజం ఆరోగ్యవంతంగా తయారు అవుతుందని

అన్నారు. బడ్జెట్ పెంచడం వలన క్రీడా సౌకర్యాలు మెరుగుపరచడం వలన ఎక్కువ మంది క్రీడలు, వ్యాయామంలో పాల్గొంటారని చెప్పారు. సి ఎం కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్

టోర్నమెంట్ శ్రీకాకుళంలో 20,21,22 తేదీల్లో జరుగుతుందని అన్నారు. అవకాశం ఉంటే రణస్ధంలో ఒక మ్యాచ్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి మంచి ఆలోచనలు

కలిగిన వ్యక్తి అని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించుటకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు.

విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర రావు

మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడా వికాస కేంద్రాన్ని చక్కగా నిర్వహించే బాధ్యత తీసుకోవాలని

పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. అమ్మఒడి, ఫీజ్ రీయింబర్స్మెంట్ ను ప్రభుత్వం అమలు చేస్తూ అందరికి విద్య లక్ష్యానికి

కృషి చేస్తుందని చెప్పారు. ట్రిపుల్ ఐటి జిల్లాలో ఏర్పాటు చేసి ప్రామాణికమైన సాంకేతిక విద్యను అందిస్తుందని అన్నారు. జిల్లాలో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయని,

పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. తోటపల్లి కాలువ పూర్తి స్థాయిలో పనులు జరుగుటకు కృషి చేయాలని అన్నారు.

శాసన మండలి సభ్యులు పి.రఘువర్మ మాట్లాడుతూ యువత

క్రీడావికాసానికి చక్కని వేదిక అన్నారు.

శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. క్రీడల అభివృద్ధిలో

భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పొన్నాడ గుట్టను, ఎస్.ఎం.పురం చెరువును పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని కోరారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్

మాట్లాడుతూ క్రీడల్లో గర్వపడే జిల్లా మనది అన్నారు. కోడి రామమూర్తి, కరణం మల్లీశ్వరి వంటి క్రీడాకారులు మన జిల్లా వాసులని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ

కారణంగా ఆర్మీ లో ఎక్కువ మంది మన జిల్లా వారు ఉన్నారని చెప్పారు. క్రీడా వికాస కేంద్రానికి రన్నింగ్ ట్రాక్, వాలీబాల్ కోర్ట్ లు, జిమ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు

చేయాలని కోరారు.

ఈ సందర్భంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యనిర్వాహక ఇంజనీరు కె. తిమ్మారెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు బిఎస్ ఎస్ ఆర్ కె సాయిబాబు, సహాయ

ఇంజనీరు à°Ÿà°¿. కోదండ రావు,  à°•à°¾à°‚ట్రాక్టరు సూరిబాబు, తర్జాతీయ బాడ్మింటన్ క్రీడాకారునికి  à°®à°‚త్రులు సన్మానించారు. క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా

నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు,రెవెన్యూ డివిజనల్

అధికారి à°Žà°‚.వి.రమణ,  à°¸à±†à°Ÿà± శ్రీ సిఇఓ వివిఆర్ ఎస్ మూర్తి, క్రీడల అభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు,జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందర రావు, వ్యాయమ

ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam