DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మలేరియా, డెంగ్యూ కేసులు తగ్గుముఖం : డా. చెంచయ్య

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 19, 2019 (డిఎన్‌ఎస్‌):

జిల్లాలో ప్రతీ ఏడాది మలేరియా, డెంగ్యు కేసులు తగ్గుముఖం పడుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య పేర్కొన్నారు. సోమవారం ప్రపంచ దోమ

దినోత్సవం సందర్భంగా ఆయన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2016 సం.రం నుండి మలేరియా, డెంగ్యూ కేసులు

తగ్గుతూ వస్తున్నాయని, ఇది శుభదాయకమని చెప్పారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులు దోమకాటువలనే వస్తుందని గుర్తుచేసారు. దోమల్లో రెండు రకాలు ఉంటాయని ఆడదోమలు మనుషుల

రక్తాన్ని పీల్చితే, మగ దోమలు పంటలకు నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. మొట్టమొదటగా 1897 సం. ఆగష్టు 20న సర్ రోనాల్డ్ రోస్ ఆడ దోమను కనుగొనడం జరిగిందన్నారు. అందుకు

గుర్తుగా ఆగష్టు 20న ప్రపంచ దోమల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు.

జిల్లాలో డెంగ్యూ 2016 సంవత్సరంలో 114 కేసులు నమోదు కాగా,  2017లో 57 కేసులు, 2018లో 87

 à°•à±‡à°¸à±à°²à± నమోదు, 2019లో ఇప్పటివరకు 3 కేసులను గుర్తించడం జరిగిందని చెప్పారు. అలాగే మలేరియాకు సంబంధించి 2016లో 693, 2017లో 592, 2018లో 264, 2019లో ఇప్పటివరకు 69 కేసులు నమోదయినట్లు

పేర్కొన్నారు.

మలేరియాకు సంబంధించి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలను జరిపి ఉచితంగా మందులను పంపిణీ

చేస్తున్నామని తెలిపారు. అలాగే డెంగ్యూ జిల్లాలో రిమ్స్ ఆసుపత్రిలో ఎలీసా టెస్ట్ ద్వారా పూర్తి నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని, ప్రైవేటు ఆసుపత్రులలో

స్క్రీనింగ్ టెస్టులు మాత్రమే జరుగుతాయని, స్క్రీనింగ్ టెస్టుల ద్వారా వ్యాధిని నిర్ధారించలేమని స్పష్టం చేసారు.

జిల్లాలో మలేరియా వ్యాధికి సంబంధించి 445

హైరిస్క్ గ్రామాలను గుర్తించామని, ఈ ఏడాది మే15 నుండి జూన్ 30 వరకు మొదటి విడతగా పిచికారీ చేయడం జరిగిందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న 67 ఆశ్రమ వసతి పాఠశాలల్లో

కూడా పిచికారీ చేసినట్లు చెప్పారు. రెండో విడతగా ఈ నెల 1 నుండి ప్రారంభించి ఇప్పటివరకు 138 గ్రామాల్లో పిచికారీ చేసామని తెలిపారు. లార్వా నుండి పుట్టే దోమలను

గంబూషియా చేపలు తినివేస్తాయని, అందువలన జిల్లాలో 2లక్షల గంబూషియా చేపలను విడిచిపెట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసామని, ఇప్పటివరకు 40వేల చేపలను కుసిమి, దోనుబాయి,

అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల నీటినిల్వలలో విడిచిపెట్టినట్లు చెప్పారు. ఇంతవరకు వర్షాకాలంలో మలేరియా సీజనల్ వ్యాధులు రాకుండా రెండు రోజులకు

ఒకసారి మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, ఏంటీ మలేరియా మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిల్వఉంచినట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాలు,

పంచాయతీరాజ్, మునిసిపాలిటీ తదితర శాఖల సహకారంతో లార్వా నియంత్రణ చర్యలు మరియు దోమల నియంత్రణ చర్యలను చేపడుతున్నామని స్పష్టం చేసారు. వీటితో పాటు గిరిజన

ప్రాంతాల్లో దోమతెరలను సరఫరా చేసి, వాటిని వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నామని,  à°‡à°µà°¿ మెడికేటెడ్ కావడం వలన దోమలు తెరపై వాలిన వెంటనే చనిపోవడం

జరుగుతుందని చెప్పారు.

డెంగ్యూ వ్యాధి ఏడిస్ దోమల వలన వస్తుందని, ఇవి ఇంటి పరిసరాల్లో చిన్న చిన్న నీటి నిల్వలలో పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వారానికి

ఒకసారి ఇంటి పరిసరాలను పరిశీలించి శుభ్రపరచుకోవాలని సూచించారు. ఏడిస్ దోమకాటు నుండి రక్షణ పొందుటకు రాత్రి వేళల్లో దోమతెరలు వినియోగించుకోవాలని, పగటివేళ

వస్త్రధారణ చేసుకోవాలని సూచించారు.

జిల్లా మలేరియా అధికారి వీర్రాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 2500 రకాల దోమలు ఉన్నాయని, అయితే వాటిలో మూడు రకాల దోమల వలన

మాత్రమే మనుషులకు అపాయం కలుగుతుందని చెప్పారు. ఎనాఫిలిస్ దోమ వలన మలేరియా వ్యాధి , ఏడిస్ దోమ వలన డెంగ్యూ, చికిన్ గున్యా, క్యూలెక్స్ దోమ వలన ఫైలేరియా, మెదడువాపు

వ్యాధి వస్తాయని అన్నారు. వీటిని నివారించేందుకు, నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చర్యలు చేపట్టడం జరుగుతుందని, మందులు కూడా

అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు.

ఈ సమావేశంలో డా. బగాది జగన్నాథం, డా. మెండ ప్రవీణ్, డా. కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam