DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రీడాకారుల ప్రతిభ వెలికి తీతకు రాష్ట్ర స్థాయి పోటీలు,  

సి.యం కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం 

శ్రీకాకుళం పర్యటన లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

13 జిల్లాల మహిళా, పురుష క్రీడాకారుల

ప్రాతినిధ్యం  

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 20, 2019 (డిఎన్‌ఎస్‌): క్రీడాకారుల ప్రతిభ వెలికి తీతకు

రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు ఇంఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం జిల్లా పర్యటనకు

వచ్చిన అయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 20, 21, 22 తేదీల్లో సి.యం కప్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. క్రీడలను

ప్రోత్సహించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ప్రతీ జిల్లాలో వివిధ క్రీడా టోర్నమెంట్ లు నిర్వహిస్తామన్నారు.  à°ªà±‹à°Ÿà±€à°²à±à°²à±‹ గెలుపు ఓటములు కాదని,

క్రీడా స్ఫూర్తి ముఖ్యం అని తెలిపారు.  à°ˆ పోటీలు 1992 లో మొదటిసారి స్ఫూర్తిమంతంగా సి à°Žà°‚ కప్ క్రీడలు నిర్వహించామని, తరువాత అంతటి స్పూర్తితో à°ˆ రోజు నిర్వహిస్తున్నాం

అన్నారు. 

రహదారులు, భవనాల శాఖ మంత్రి మరియు జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు కృష్ణ దాస్ మాట్లాడుతూ మొట్టమొదటి సి ఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్

శ్రీకాకుళంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. అనేక మంది పెద్ద పదవుల్లో

క్రీడాకారులు ఉన్నారని, క్రీడాకారులకు, క్రీడలకు అత్యంత ప్రాచుర్యం ఉందని వివరించారు. à°ˆ పోటీలు 
20, 21,22 తేదీల్లో దిగ్విజయంగా టోర్నమెంట్ ను

నిర్వహిస్తాం

కార్యక్రమం లో శ్రీకాకుళం  à°¶à°¾à°¸à°¨ సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, సూచించారు. వివిధ

జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు తమ సాంస్కృతి, సంప్రదాయాలను పంచుకోవాలని, స్థానికులు క్రీడాకారులకు మంచి అనుభవాలు గుర్తుండేటట్లు సహకరించాలి అని

సూచించారు. à°ˆ పోటీలను చూసేందుకు 
జిల్లా లోని పాఠశాలల విద్యార్థులను తీసుకువచ్చి పోటీలను చూపించాలి

కార్యక్రమంలో  à°µà°¿à°œà°¯à°¨à°—à°°à°‚ పార్లమెంట్ సభ్యులు బెల్లాన

చంద్రశేఖర రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, రాష్ట్ర వాలీబాల్ సంఘం కార్యదర్శి నారాయణ రాజు,  à°¶à°¾à°¸à°¨ మండలి సభ్యులు పి.రఘువర్మ ,శాసన సభ్యులు కంబాల జోగులు,శాసన సభ్యులు

సీదిరి అప్పలరాజు, డా బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కూన రాంజి, పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం

కార్యదర్శి పి.సుందర రావు., రెవెన్యూ డివిజనల్ అధికారులు à°Žà°‚.వి.రమణ, కుమార్., సెట్ శ్రీ సిఇఓ వి.వి.ఆర్ ఎస్ మూర్తి, డిఎస్ à°¡à°¿à°“ బి.శ్రీనివాసరావు,  à°°à±†à°¡à± క్రాస్ చైర్మన్

పి.జగన్మోహన రావు, శివాని ఇంజినీరింగ్ కళాశాల ఎం.డి దుప్పల వెంకట రావు, స్థానిక నాయకులు అంధవరపు వరం, ఎం.వి.పద్మావతి తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam