DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రీడా విజేతల కార్ఖానాగా తయారు కావాలి, మంత్రి వెల్లంపల్లి  

రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణం, 

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 20, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం

నగర పరిధిలోని శాంతి నగర్ కాలనీలో రూ.2 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియంను రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ

కార్యక్రమం లో ఆర్ అండ్ బి మంత్రి ధర్మాన కృష్ణ దాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ఈ క్రీడా ప్రాంగణంలో షటిల్ బాడ్మింటన్ ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ నూతన కోర్టులలో ఆడుతూ కనువిందు చేశారు. ఆర్ అండ్ బి మంత్రి

ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయని, క్రీడాకారులను రింత ప్రోత్సహించాలన్నారు. సమసమాజ నిర్మాణానికి

క్రీడలు దోహదం అవుతాయని, శ్రీకాకుళంలో మంచి క్రీడా మౌళిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. త్వరలోనే శ్రీకాకుళంలో షటిల్ టోర్నమెంట్

నిర్వహించుకోవచ్చు అని తెలిపారు. 

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ ఆధునిక క్రీడా వసతులు కల్గిన క్రీడా ప్రాంగణం శ్రీకాకుళం లో ఏర్పాటు కావడం,

క్రీడా కారులకు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు.  à°¦à±€à°¨à°¿ నిర్మాణానికి పూర్వ కలెక్టర్ ధనంజయ రెడ్డి విస్తృత కృషి చేసారని, కొంత మేరకు  à°¨à°¿à°§à±à°²à± విడుదల

చేశారన్నారు

స్టేడియం నిర్మాణంలో కృషి చేసిన కార్యనిర్వాహక ఇంజినీర్లు పి.సుగుణాకర రావు, కె. భాస్కరరావు లను, సాంకేతిక సహకారం అందించిన సాయి కి

సత్కరించారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam