DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్యులు మానవతాధృక్ఫదంతో పనిచేయాలి – మంత్రి కృష్ణదాస్

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 23, 2019 (డిఎన్‌ఎస్‌):  à°µà±ˆà°¦à±à°¯à±à°²à± మానవతాదృక్పధంతో వైద్య సేవలు అందించాలని

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ తో

కలసి మంత్రి సమీక్షించారు. వైద్యులు ప్రాణదాతలని మంత్రి పేర్కొన్నారు. మానవతాదృక్పధంతో సేవలు అందించి ప్రజలకు చేరువకావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి

వైద్యాన్ని అందించుటకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో ఎటువంటి చిన్న తప్పిదం జరగకుండా చూడాలని, ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని

పేర్కొన్నారు. కావాలని తప్పులు చేయుటకు ప్రయత్నించరాదని ఆయన స్పష్టం చేసారు. సి హెచ్ సీలలో రక్త నిల్వ పరికరాలు కొనుగోలు చేయుటకు ఆసుపత్రి అభివృద్ధి నిధులను

ఖర్చు చేయాలని సూచించారు. సేవలు అందించడంలో ఇబ్బందులు ఉన్నా, రాజకీయ జోక్యం ఉన్నా తెలియజేయాలని ఆయన కోరారు. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉద్యోగ నిర్వహణ చేయాలని,

ప్రజలలో గౌరవం పెంచుకోవాలని అన్నారు. నరసన్నపేట ఆసుపత్రి నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ లోపాలను కాంట్రాక్టర్ సరిదిద్దాలని, అందుకు చర్యలు

చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో డిప్యుటేషన్లను రద్ధు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవలసిన చిన్న

చిట్కాలను పోస్టర్లు, ఫ్లెక్సీల రూపంలో కొన్ని ప్రధాన ప్రదేశాల్లో ఏర్పాటు చేయుటకు ఆలోచించాలని సూచించారు.
          జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ

జిల్లాలో ఆసుపత్రుల పనితీరు మెరుగుపరచుటకు చర్యలు చేపట్టామన్నారు. మాతాశిశు మరణాలను అధ్యయనం చేయుటకు ఒక కమిటీని ఏర్పాటు చేసామని చెప్పారు. గత ఏడాది కాలంలో 31 మంది

తల్లులు మృత్యువాత పడ్డారని వాటిని పరిశీలించామని చెప్పారు. అందులో 11 మందికి రక్తం తక్కువగా ఉండటం, సకాలంలో రక్తపు యూనిట్లు అందుబాటులో లేకపోవడం వలన మరణించారని

వివరించారు. కేసులను అధికంగా రిఫర్ చేస్తున్నారని, వాటిని తగ్గించుటకు చర్యలు చేపట్టామని అన్నారు. ప్రతి సి.హెచ్.సిలో రక్తపు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటుకు

ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. రక్తం నిల్వ చేయుటకు అవసరమగు పరికరాలు కొనుగోళు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. విధులకు గైర్హాజరు అయ్యే వైద్యులను ఉద్యోగం

నుండి తీసివేయాలని ఆదేశించారు. వైద్యులు అందుబాటులో ఉండాలని, పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సమయపాలన పాటించాలని అన్నారు.

         

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి à°¡à°¾.à°Žà°‚.చెంచయ్య మాట్లాడుతూజిల్లాలో వివిధ కేడర్లలో  706 ఖాళీలు ఉన్నాయని వాటిలో 465 ఖాళీలు కాంట్రాక్టు విధానంలో ఉన్నాయని చెప్పారు.

కొత్తగా ఏర్పడిన పి.హెచ్.సిలకు సిబ్బందిని మంజూరు చేయాల్సి ఉందని తెలిపారు. ఆరోగ్య ఉపకేంద్రం నుండి టెలీ కన్సల్టేషన్ విధానం ప్రారంభించుటకు రూ.448.65 కోట్లతో

ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. కవిటి మండలం మాణిక్యపురం, ఇచ్ఛాపురం మండలం ఈదుపురం, వజ్రపు కొత్తూరు మండలం వెంకటాపురం పి.హెచ్.సిలు కొత్తగా మంజూరు అయ్యాయని

వాటికి భవనాలు నిర్మించుటకు పునఃఅంచనాలు తయారు చేయాలని తెలిపారు. లావేరు పి.హెచ్.సికి కొత్త భవనం అవసరం ఉందని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ ద్వారా

ఎ.ఎన్.ఎం పోస్టులు పూర్తిగా భర్తీ కాగలవని చెప్పారు.
          జిల్లా ఆసుపత్రులు సమన్వయ అధికారి à°¡à°¾.బి.సూర్యారావు మాట్లాడుతూ పలాస, నరసన్నపేట తదితర ఆసుపత్రుల్లో

సివిల్ సర్జన్, డిప్యూటి సివిల్ సర్జన్ పోస్టులు భర్తీ కావలసి ఉందన్నారు.
          డిప్యూటి à°¡à°¿.à°Žà°‚.హెచ్.à°“ à°¡à°¾.నరేష్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో à°‡ ఔషధిలో ఔషధాలకు

ఇండెంట్ పెట్టిన మేరకు మంజూరు కావడం లేదన్నారు. గిరిజన ప్రాంతంలో రోగులకు రూ.40 కు భోజనం అందించుటకు ఏజన్సీలు ముందుకు రావడం లేదని తెలిపారు.
          à°ˆ సమావేశంలో

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) సూపరింటిండెంట్ డా.కె.కృష్ణమూర్తి, వైద్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, వై.వి.కామేశ్వర ప్రసాద్, జిల్లా మలేరియా అధికారి

వీర్రాజు, సి.హెచ్.సిల సూపరింటెండెంట్లు, ప్రాగ్రామ్ అధికారులు, ఏపిఎంఐడిసి కార్యనిర్వాహక ఇంజనీరు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam