DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మూడు రోజుల ఆంధ్ర పర్యటనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య 

హాజరుకానున్న కేంద్ర మంత్రులు, గవర్నర్

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  24, 2019 (డిఎన్‌ఎస్‌) : శనివారం నుంచి మూడు

రోజులపాటు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటనలో గవర్నర్​ బిశ్వభూషణ్​ పలువురు

కేంద్రమంత్రులు పాల్గొనున్నారు. ప్రముఖుల రాకతో రాష్ట్రంలో కేంద్ర బలగాలతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం  à°šà±†à°¨à±à°¨à±ˆ విమాశ్రయం నుంచి

ప్రత్యేక ఎయిర్​ఫోర్స్​ హెలికాప్టర్​ లో ఉపరాష్ట్రపతి నెల్లూరుకు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం వెంకటాచలం రైల్వేస్టేషన్​ నుంచి ప్రత్యేక రైలులో

కృష్ణపట్నం- ఓబులవారిపల్లి రైల్వే లైన్​ను పరిశీలిస్తారు. తదుపరి కడప జిల్లా చెర్లోపల్లి రైల్వేస్టేషన్ పరిశీలనా అనంతరం 5.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 7

గంటలకు వెంకటాచలం వెళ్లనున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్​లో ఆ రాత్రి ఉపరాష్ట్రపతి బస చేస్తారు. ఆదివారం ఉదయం ట్రస్ట్​లోని వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు.

రోడ్డు మార్గాన గూడూరు రైల్వే స్టేషన్​ చేరుకుని...విజయవాడ- గూడూరు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభిస్తారు.

ఆదివారం  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ 12.15 గంటలకు నెల్లూరు

కస్తూర్భా కళాక్షేత్రంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సాయంత్రం 3.50 గంటలకు వీపీఆర్​ ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు

చేసిన అభినందన సభ అనంతరం స్వర్ణ భారత్​ ట్రస్ట్​కు చేరుకుని అక్కడే బస చేస్తారు.

ఆదివారం à°‰à°¦à°¯à°‚ 11.30 గంటలకు కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం వద్ద మిథాని

అల్యూమినియం పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్​లో విజయవాడకు బయల్దేరుతారు. 

ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర రక్షణ శాఖ

మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి అన్ని

ఏర్పాట్లు చేశామని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాస్​ వెల్లడించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam