DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో ఎమ్మెల్యే లేఖతో దర్శనానికి లక్ష వసూలు 

దళారిలుగా మారిన ప్రజా ప్రతినిధి స్టాఫ్ 

సిఫార్సు లేఖతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారీలు  

భక్తుల ఫిర్యాదు తో రంగం లోకి

విజిలెన్స్ 

ఆ ప్రజా ప్రతినిధి కరుణాకర రెడ్డే నా?

తిరుమల లో ముదురుతున్నసిఫార్సు లేఖల కుంభకోణాలు. . ..  

(రిపోర్ట్ : NSV రమణ, స్టాఫ్ రిపోర్టర్, DNS, తిరుపతి ). .

.

తిరుపతి, ఆగస్టు  26, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీనివాసుని దర్శనానికి జరుగుతున్నా కుంభకోణాల్లో ప్రస్తుతం నేరుగా ప్రజా ప్రతినిధుల సిబ్బందే à°°à°‚à°—à°‚ లోకి

దిగుతున్నారు. ఆదివారం తిరుమలలో వెలుగు చూసిన ఘటనలో ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం చేయించేందుకు లక్ష రూపాయాల కు పైగా వసూలు చేసినట్టు

సమాచారం. 

లభించిన సమాచారం ప్రకారం బెంగుళూరు, చెన్నైలకు చేందిన 18 మంది భక్తులు శ్రీనివాసుని దర్శనం కోసం తిరుమల ku రావడం జరిగింది. ప్రత్యేక దర్శనం కోసం

చూస్తున్న వీరికి  à°ªà±à°°à°œà°¾ ప్రతినిధి దగ్గర పనిచేస్తున్న ప్రసాద్ అనే వ్యక్తి తారస పడ్డాడు. ఏకంగా అందరికీ దర్శనం చేయిస్తానని ముందుగా à°’à°• ధర మాట్లాడుతుకున్నాడు.

అయితే వీళ్ళ ఉత్సాహం చూసిన ప్రసాద్ దర్శన ధరను అమాంతం పెంచేసాడు. అయితే దర్శనం లభిస్తుంది అనే ఆశతో వీళ్ళు కూడా నోరెత్తలేకపోయారు. అనంతరం టిటిడి సిబ్బందికి

ఫిర్యాదు చేయడం జరిగింది.  

స్థానిక ప్రజా ప్రతినిధి (తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అని అనుమానం ) ఇచ్చిన సిఫార్సు లేఖల తో సాక్షాత్తు టిటిడి చైర్మన్

కార్యాలయంలోనే టికెట్లు పొందడం జరిగింది. మొత్తం మూడు సిఫార్సు లేఖల పై  18 మందిని దర్శనానికి పంపి ఒక్క వ్యక్తి దగ్గర రూ. 5500 వసూలు చేయడం జరిగింది. ఇంకా రేటు

పెంచేయడంతో విసిగి poyina భక్తులు నేరుగా à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

దళారీగా మారిన సూత్ర దారి, పాత్రధారి ప్రసాద్ ను విడిచిపెట్టి

అమాయకులను ఇందులో ఇరికించే ప్రయత్నం లో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. 

సిఫార్సు లేఖలతో జరుగుతున్నా దోపిడీ కి తిరుమల శ్రీనివాసుడి విస్తుపోయే

పరిస్థితిని ప్రజా ప్రతినిధులు, వాళ్ళ సిబ్బంది కల్పించారు. దర్శన వ్యాపారం ను అదుపు చెయ్యవలసిన  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిబ్బంది కూడా వీళ్ళకు ఇతోధిక సహాయం చేస్తున్నట్టు

తెలుస్తోంది. కల్పించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తేడా లేదు, అన్ని పార్టీల వాళ్ళు ఇలాగే చేస్తుండడం తో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిబ్బంది ఆఖరికి  à°ˆ సిఫార్సు లేఖలను రద్దు

చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam