DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలకొండ జ్యువెలరీ లో దోపిడీ చేసింది విశాఖ వాసులే  

పోలీసుల అదుపులో నిందితులు- నగలు స్వాధీనం  
 
సి సి టీవీల సహాయంతో చోరులను గుర్తించాం. 

- జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి  

(DNS రిపోర్ట్ : ఎస్ వి

ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 26, 2019 (డిఎన్‌ఎస్‌): à°ˆ నెల 22 à°¨ శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని నాయుడు జ్యూయలర్స్ లో జరిగిన దోపిడీకి

పాల్పడింది విశాఖవాసులేనని జిల్లా ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ఆగష్టు 22 à°¨ మధ్యాహ్నం 03.30à°—à°‚.à°²

సమయంలో  à°ªà±‹à°¸à±à°Ÿà°¾à°«à±€à°¸à± రోడ్డులోని à°ˆ దుకాణం లో 30 సెట్ల వెండి కాళ్ల పట్టీలు (1500 గ్రాములు, వీటి విలువ రూ.50వేలు ) చోరీ కాబడ్డాయని తెలిపారు. చోరీలో పాల్పడ్డ నిందితులను

అరెస్ట్ చేసి, చోరీ కాబడిన వెండిపట్టీలను రికవరీ చేసినట్లు వివరించారు. ఇలాంటి దొంగతనం జిల్లాలో ఇంతకూ ముందు ఎన్నడూ జరగలేదని, కొత్త తరహాలో చోరీ చేసారని

చెప్పారు. 

చోరీ జరిగిన వైనం : . . . 

ముందుగా ఒక మహిళ షాపులోకి వెళ్లి నగలు చూస్తుండగా, మరో ఇద్దరు షాపు యజమానితో వెండి, బంగారు వస్తువులను చూపమని తెలిపి

తెలివిగా వారు తెచ్చుకున్న బ్యాగులలో 30 సెట్ల వెండి పట్టీలను చోరీ చేయడం జరిగిందని వివరించారు. వీరంతా విశాఖపట్నంలోని మద్దిలపాలెం, సీతమ్మధార, అల్లిపురం,

అల్లినగరం, సింహాచలం ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. గతంలో వీరు రాజాం, విజయనగరం జిల్లాలో కూడా పలు చోరీలకు పాల్పడ్డినట్లు యస్.పి ఈ

సందర్భంగా చెప్పారు. 

ఈ నేరస్తులను సి.సి కెమెరాల సహాయంతో చోరీ చేసిన ప్రదేశం నుండి వారు తెచ్చుకునే వాహనం వెళ్లిన జాడలను గుర్తించి చాకచక్యంతో తమ సిబ్బంది

ఈ నెల 26న ఉదయం 10.00గం.ల ప్రాంతంలో నిందితులను పట్టుకోవడం జరిగిందని, వారి నుండి చోరీకి గురైన వెండి పట్టీలను పూర్తీగా రికవరీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కేసులో

నిందితులయిన శ్రావణ త్రివేణి ( 42సం.లు ) గంట్ల ఆదిలక్ష్మీ ( 23 సం.లు ),తగరంపూడి రాము  ( 45 సం.లు ), షేక్ భాను( 55 సం.లు ), చింతల అశోక్  ( 25 సం.లు ), టెక్కలి సర్వేష్ ( 33 సం.లు )లను కోర్టుకు

హాజరుపరచడం జరుగుతుందన్నారు. అలాగే వీరు తెచ్చుకున్న వాహనాన్ని కూడా సీజ్ చేసామని చెప్పారు. నిందితులను పట్టుకున్న పాలకొండ సబ్ ఇన్ స్పెక్టర్ యస్.బాలరాజు, హెడ్

కానిస్టేబుల్ బి,రమేశ్, కానిస్టేబుల్స్ పి.శ్రీరాములు, యస్.శ్రీనివాసరావు, యు.సూరిబాబులను యస్.పి అభినందించారు.   
అరగంటలో కేసును చేధించిన సిబ్బంది : ఈ నెల 22 రాత్రి

9.30గం.ల ప్రాంతంలో పాలకొండలో గల వెంకటగౌరీ ధియేటర్ లో చోరీకి గురికాబడ్డ నగదును కేవలం అరగంట వ్యవధిలోనే కేసును తమ సిబ్బంది చేధించడం జరిగిందని జిల్లా

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తెలిపారు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకట గౌరీ ధియేటర్లో రాత్రి 9.30గం.లకు క్యాష్ కౌంటర్ లో రూ.58,360/-ల నగదును

ఉంచి వెళ్లారని, ఆగష్ట్ 23 ఉదయం 07.30à°—à°‚.లకు వచ్చేసరికి క్యాష్ కౌంటర్లో  à°¨à°—దు లేకపోవడంతో థియేటర్ పార్టనర్ అయిన చెలికాన మహేశ్ కుమార్ పాలకొండ పోలీసు స్టేషన్ లో

ఫిర్యాదు చేసారని తెలిపారు. పోలీసులు చోరీ జరిగిన పరిసరాలను పరిశీలించగా ఇనుప గ్రిల్ ను పగులగొట్టి క్యాష్ కౌంటర్లోని నగదును చోరీచేసినట్లు గుర్తించడం

జరిగిందని  à°…న్నారు. అక్కడ లభించిన వేలిముద్రల సహాయంతో పాత రికార్డులను పరిశీలించగా విజయనగరం జిల్లా గురుగుబెల్లి మండలం సీమనాయుడువలస గ్రామానికి చెందిన

పసుపురెడ్డి అప్పడు ( 50సం.లు ) వేలిముద్రలుగా గుర్తించి, తక్షణమే కేసును చేధించారని చెప్పారు. నిందితుడి నుండి రూ.49,860/-లు రికవరీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. కేవలం

ఫిర్యాదు అందిన అర్ధ à°—à°‚à°Ÿ వ్యవధిలోనే  à°•à±‡à°¸à±à°¨à± చేధించిన పాలకొండ సబ్ ఇన్ స్పెక్టర్ యస్.బాలరాజు, హెడ్ కానిస్టేబుల్ బి,రమేశ్, కానిస్టేబుల్స్ పి.శ్రీరాములు,

యస్.శ్రీనివాసరావు, యు.సూరిబాబులను యస్.పి అభినందిస్తూనే, వీరికి నగదు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam