DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రీడాకారులు ఎవరో తెలియకుండానే విశాఖ లో క్రీడోత్సవాలు 

క్రీడా మంత్రి అవంతి పాల్గొన్న సభలో అష్టావక్రమ్ 

విశాఖ క్రీడోత్సవాల్లో బయట పడ్డ అధికారుల అద్భుత ప్రతిభ . . .

ఫోటో సానియా మీర్జా à°¡à°¿  à°ªà±‡à°°à± పి à°Ÿà°¿ ఉష

ది. 

వివాదంగా మారిన స్వాగత హోర్డింగ్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) . . .

విశాఖపట్నం, ఆగస్టు  29, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°µà°¿à°¶à°¾à°– లో జరిగిన జాతీయ క్రీడోత్సవాల్లో

అద్భుత అధికారుల ప్రతిభ  à°¬à°¯à°Ÿ పడింది. గురువారం విశాఖ సాగర తీరం లో జరిగిన జాతీయ క్రీడోత్సవాల్లో స్వాగత బోర్డులు చూడగానే అందరిని

వెక్కిరించాయి. 

వీళ్ళండీ మన అధికారులు. . . . .

పిటి ఉష కు, సానియా మీర్జా కు తేడా తెలియదు అనే విషయాన్నీ విశాఖ అధికారులు ప్రకటించేసుకున్నారు. దీనికి

నిదర్శనమే విశాఖ లో జరిగిన క్రీడా సంబరాలు. 

విశాఖలో జరిగిన ఫిట్ ఇండియా ప్రోగ్రాం లో విశాఖపట్నం అధికారులు సరిగ్గా ఫిట్ అవ్వలేదు అనే విషయం బహిర్గతం

అయ్యింది. స్వాగత బోర్డులు పెట్టిన అధికారులకు వాటిపై ఎవరి ఫోటో ముద్రించారో, ఆ బ్యానర్ పై ఎవరి గురించి వ్రాసారో కూడా తెలియక పోవడం గమనార్హం. విశాఖపట్నం లో

జరిగిన ఫిట్ ఇండియా మూమెంట్ లో భాగంగా సాగర తీరం లో 2 కె రన్ నిర్వహించారు. అనంతరం ఎయు కన్వేషన్ హలో క్రీడా సంబరాలు జరిపారు. 

ఫోటో ఒకరిది . . పేరు మరొకరిది

:.

ఈ హాలు వద్ద ఏర్పాటు చేసిన స్వాగత బోర్డులో సానియా మీర్జా ఫోటో ను ముద్రించి, ఫోటో పైన టెన్నిస్ అని వ్రాసారు, ఫోటో క్రింద పేరు పిటి ఉష వ్రాసి, పద్మ భూషణ్, పద్మ

శ్రీ, అర్జున అవార్డు అని వ్రాసారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. పిటి ఉష కు పద్మ భూషణ్ లభించలేదు. పైగా ఆమె పరుగుల రాణి ( అథ్లెటిక్స్ క్రీడకు చెందిన వారు). రెండు

విభిన్న క్రీడా రంగాలకు చెంది ఇద్దరినీ కలిపి వీళ్ళకి తోచిన విధంగా à°¸à±à°µà°¾à°—à°¤ బోర్డులు తయారు చేసేసారు. à°ˆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా

నిర్వహించింది.

పైగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే లు, జిల్లా కలెక్టర్ వినయచంద్, ఇతర

క్రీడా దిగ్గజాలు, జిల్లాలోని వివిధ క్రీడా సంఘాల అధ్యక్షా, కార్యదర్శులు, క్రీడా కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బోర్డులు చూసిన క్రీడా సంఘాల ప్రతినిధులు,

క్రీడాకారులు ముక్కున వేలు చేసుకున్నారు. ప్రశ్నించిన వారికీ సమాధానం చెప్పే నాధుడే లేదు. పైగా విషయం తెలిసిన తర్వాత అయినా à°†  à°¬à±‹à°°à±à°¡à±à°²à± అక్కడి నుంచి

తొలగించవలసి ఉండగా, à°† ప్రయత్నం కూడా జరగలేదు. 

అసలు క్రీడల గురించి తెలియని వారికి ఈ నిర్వహణ భాద్యతలు ఎందుకు అప్పగించినట్టు. పైగా, ఏర్పాట్లను పరిశీలించిన

జిల్లా అధికారులకు కూడా సానియా మీర్జా à°•à°¿ పిటి ఉష à°•à°¿ తేడా తెలియదు అంటే à°ˆ జిల్లాలో పరిపాలన ఏ విధంగా సాగుతోందో బహిర్గతమవుతోంది. 

పిటి ఉష ప్రముఖ అథ్లెటిక్స్

క్రీడాకారిణి, క్రీడా  à°ªà±à°°à°ªà°‚చంలోనే అత్యున్నత కీర్తిని గడించారు.  2000 లోనే క్రీడా à°°à°‚à°—à°‚ నుంచి నిష్క్రమించారు, అప్పడికి ఆమెకు పద్మ శ్రీ, అర్జున పురస్కారాలు

లభించాయి. ఆ తర్వాత మూడేళ్లకు ( 2003 లో) సానియా మీర్జా టెన్నిస్ క్రీడారంగంలోకి ప్రవేశించింది. ఈమెకు అర్జున, పద్మ శ్రీ పురస్కారాలతో పాటు పద్మ భూషణ్ పురస్కారం కూడా

లభించింది. 

ఇద్దరూ రెండు విభిన్న క్రీడా రంగాలకు చెందిన వారు ఒక దశకం లోకూడా తేడా ఉంది. అయితే ఈ విషయాలు తెలుసుకోకుండానే విశాఖ అధికారులు తమకి తోచిన

పేర్లు, ఫోటో లను స్వాగత బోర్డులపై లిఖించి చేతులు దులిపేసుకున్నారు. చేసే పనిమీద వీళ్ళకి à°Žà°‚à°¤ శ్రద్ధ ఉందొ విశాఖ వాసులకు వీళ్ళే ప్రకటించేసారు.   

కోసం

మెరుపు : . ..

ఈ స్వాగత బోర్డులు చూసుకుంటూనే రాష్ట్ర క్రీడలు, పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, విశాఖ పశ్చిమ

ఎమ్మెల్యే పి జి వి ఆర్ నాయుడు (ఇతను జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కూడాను) , ఇతర ఎమ్మెల్యే లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార సమన్వయ కర్తలు, అంతర్జాతీయ క్రీడా

పురస్కారాల విజేతలు, క్రీడా కారులతో పాటు, జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్, ఇతర అధికారులు కూడా సభ ప్రాంగణం లోకి వెళ్లడం, కనీసం దీనిపై ద్రుష్టి పెట్టక పోవడం కోసం

మెరుపు. ఇక్కడికి హాజరైన వారిలో చాల మంది క్రీడా à°² రిజర్వేషన్ ద్వారానే ఉద్యోగాలు పొందడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam