DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు : మంత్రి ధర్మాన

పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు అవకాశం కల్పించాలి 

సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకోవా

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 29, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తుందని రాష్ట్ర రహదారులు,

భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బ్లూ ఎర్త్ హోటల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల

పారిశ్రామిక వేత్తలకు అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వల చేసి మంత్రి ప్రారంభించారు. మంత్రి కృష్ణ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద

ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయుటకు ముఖ్యమంత్రి ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. రాయితీలు కల్పించి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం అనేక

కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చి ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసే

పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం చట్టం చేసిందని మంత్రి తెలిపారు. 
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు

రావాలని కోరారు. పరిశ్రమల స్ధాపనలోను, ఇతర విధానాలలో సమస్యలు ఉంటే తెలియజేయాలని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని మంత్రి అన్నారు.

          పరిశ్రమల

శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ మాట్లాడుతూ ఏపిఐఐసిలో వేసిన లే అవుట్ స్థలాలకు పారిశ్రామిక వేత్తలు సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యుత్

కనెక్షన్, ల్యాండ్ కన్వర్షన్(నాలా) తదితర అంశాలను సింగిల్ విండోలోకి తీసుకువచ్చామని పేర్కొంటూ వాటి దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో సమర్పించాలని

తెలిపారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 5 వేల ఎకరాల విస్తీర్ణంతో పరిశ్రమలకు ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. భూములను

పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. జిల్లాలో పెట్టుబడులు పెట్టుటకు ముందుకు రావాలని ఆయన కోరారు. మీరు ముందుకు à°°à°‚à°¡à°¿ -  à°®à±‡à°®à± సహకరిస్తాం అన్నారు. జిల్లాలో పరిశ్రమలు

పెద్ద ఎత్తున రావలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు త్వరితగతిన పారిశ్రామిక యూనిట్లకు అమలు చేయుటకు చర్యలు

తీసుకున్నామని స్పష్టం చేసారు. శ్రీకాకుళం జిల్లా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. భాగస్వామ్య సదస్సులో 16

ఒప్పందాలు జరుగగా 5 సంస్థలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని మిగిలిన సంస్ధలు త్వరితగతిన నెలకొల్పాలని కోరారు. జిల్లాలో ఎంఎస్ఎమ్ఇ పార్కులు ప్రతి నియోజకవర్గంలో

నెలకొల్పుటకు చర్యలు చేపట్టామని ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో స్థలాన్ని ఏపిఐఐసికి అప్పగించడం జరిగిందని, మరో మూడు నియోజకవర్గాలలో స్థలాన్ని ఎంపిక చేసామని

అన్నారు. సీతంపేట, పాలకొండ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టుటకు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సానుకూలంగా ఉందని,పెట్టుబడులు

పెట్టుటకు రావాలని పిలుపునిచ్చారు.

పారిశ్రామికల వేత్తల అభిప్రాయాలను తెలియజేయవలసినదిగా కోరినపుడు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లికి

చెందిన శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్న పరిశ్రమలకు విద్యుత్ రాయితీలు శాశ్వతంగా కల్పించాలని, ముడి సరుకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

మెరకముడిదాం మండలం గర్భాంకు చెందిన శ్రీ వెంకటేశ్వర మెటల్స్ సంస్ధ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా సులభంగా అనుమతి పత్రాలు

పొందామని తెలిపారు. జ్యూట్, జీడి పరిశ్రమ, గ్రానైట్, రైస్ మిల్లర్లు తదితర పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ ఫెర్రో ఎల్లోయిస్ పరిశ్రమకు రాయితీలు

కల్పించాలని, జ్యూట్ పరిశ్రమకు ప్రభుత్వం గుర్తించాలని, లేదంటే 4,5 సంవత్సరాల తరువాత ఏ.పిలో కనుమరుగు అవుతుందని ఆయన చెప్పారు. పాత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

అందించాలని కోరారు. చక్కెర పరిశ్రమను ఆదుకోవాలని సూచించారు.

రాజాం శాసన సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ రాజాం ప్రాంతం పరిశ్రమల స్ధాపనకు అనుకూలంగా

ఉందని, భూమి సైతం లభ్యంగా ఉందని అన్నారు.

పలాస శాసన సభ్యులు డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ పలాస ప్రాంతంలో 3 వందలకు పైగా జీడిమామిడి పరిశ్రమలు ఉన్నాయని

అయినప్పటికి పూర్తి స్దాయిలో ఉపాధి కలగడం లేదన్నారు. పలాసలో 30 ఎకరాల్లో à°Žà°‚.ఎస్.à°Žà°‚.à°‡ పార్కు ప్రారంభించే దశలో ఉందన్నారు. పలాసలో 2 ఎకరాల ఖాలీ స్ధలం  à°‰à°‚దని అచ్చట సెజ్

ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. à°† స్ధలం ప్రక్కనే 250 ఎకరాల స్ధలం ఉందని దానిలో కొంత మేర à°¡à°¿ –పట్టా భూమి ఉందని దానిలోను సెజ్ పెట్టవచ్చని చెప్పారు. పవర్ గ్రిడ్ కూడా

అందుబాటులో ఉందని విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదని, జాతీయ రహదారి, రైల్వే వ్యవస్ధ అందుబాటులో ఉందని ఆయన పేర్కొన్నారు. 
ఈ సందర్భగా రూపొందించిన కరపత్రాలను

మంత్రి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ (ఇపిడిసిఎల్) సి.ఎం.డి నాగలక్ష్మి, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, పరిశ్రమల శాఖ జాయింట్

కమీషనర్ రాజేంద్ర రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, ఇతర జిల్లా అధికారులు, వివిధ పరిశ్రమల

ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam