DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లా స్ధాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ : సిద్ధార్ధ్ జైన్

అనుమతులు మంజూరుకు సింగిల్ విండో విధానం

ఏపీ పరిశ్రమల కమీషనర్ సిద్ధార్ధ్ జైన్

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ).

.

శ్రీకాకుళం, ఆగస్టు 29, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¿à°²à±à°²à°¾ స్ధాయిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు.

శ్రీకాకుళంలో గురు వారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పారిశ్రామిక వేత్తలకు జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియా

ప్రతినిధులతో మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ రాష్ట్ర స్ధాయిలో పెద్ద ఎత్తున చేస్తున్నామని, ఇకపై జిల్లాస్ధాయిలో ప్రవేశ పెడుతున్నామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్

బిజినెస్  à°²à±‹ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పోటీలలో పాల్గొంటున్నామని ఆయన తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు సులభతరంగా అనుమతులు మంజూరుకు ప్రతి అంశాన్ని సింగిల్

విండో విధానంలో పొందుపరుస్తున్నామని అన్నారు. ఇండస్ట్రియల్ పార్కులలో ఏపిఐఐసి ద్వారా వేసిన లే అవుట్ స్థలాలకు పారిశ్రామిక వేత్తలు సింగిల్ విండో విధానంలో

దరఖాస్తు చేసుకోవాలని కోరారు. విద్యుత్ కనెక్షన్, ల్యాండ్ కన్వర్షన్(నాలా) తదితర అంశాలను సింగిల్ విండోలోకి తీసుకువచ్చామని పేర్కొంటూ వాటి దరఖాస్తులను

సింగిల్ విండో విధానంలో సమర్పించాలని తెలిపారు. ఖాయిలా పడిన పరిశ్రమల విధానంలో రిజర్వు బ్యాంకు ప్రత్యేకమైన విధానాలకు మార్గదర్శకాలు జారీ చేసిందని కమీషనర్

తెలిపారు. ఒక పరిశ్రమ ఖాయిలా పడినా, నష్టాల్లో ఉన్నా జిల్లా స్ధాయిలోనే ముందుగా అన్ని అంశాలను పరిశీలించాలని ఆయన స్పష్టం చేసారు. సంస్ధకు సంబంధించిన అంశాలను

పరిశీలించి జిల్లా స్ధాయి కమిటిలో ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్చించాలని ఆయన అన్నారు. జిల్లా స్ధాయిలో అన్ని అంశాలను పరిశీలించకుండా నేరుగా ఓవర్ సీస్

(తుది) చర్యలకు పంపించరాదని ఆయన అన్నారు. అటువంటి సంస్ధలపై బ్యాంకులు చర్యలు చేపడితే రాష్ట్ర స్ధాయి హైపవర్ కమిటీ వద్దకు బ్యాంకు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరక్టర్

(సి.ఎం.డి)ను పిలవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. స్టార్ట్ అప్ కంపెనీకి బ్యాంకు క్రెడిట్ పాయింట్లు ఉండవని అటువంటి సంస్ధలకు రుణాల మంజూరులో నిర్ధిష్టమైన

విధానం పాటించాలని అన్నారు. సిబిల్ స్కోరింగుపై తగు చర్యలు చేపడతామని ఆయన వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam