DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతి ఒక్కరికి శారీరక ఆరోగ్యం అత్యావశ్యం: మంత్రి ధర్మాన

ఘనంగా ఫిట్ ఇండియా  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ 

క్రీడల్లో రాణించాలంటే ఫిట్ నెస్ తప్పని సరి. 

రాష్ట్ర రహదారులు,భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్టదాస్

(DNS

రిపోర్ట్ : S V ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 29, 2019 (డిఎన్‌ఎస్‌): జిల్లాలోని ప్రతీ ఒక్కరికి శారీరక ధారుడ్యం, ఆరోగ్యం

అత్యావశ్యకమని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురష్కరించుకొని స్థానిక ప్రభుత్వ

పురుషుల డిగ్రీ కళాశాలలోని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో ఫిట్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అని అన్నారు. ఆరోగ్యం ఉంటే దేనినైనా సాధించగలమని, అటువంటి ఆరోగ్యం క్రీడలు, వ్యాయామం వలనే సాధ్యమని స్పష్టం

చేసారు. క్రీడలు క్రమశిక్షణకు మారుపేరని,  à°…ంతేకాకుండా  à°•à±à°°à±€à°¡à°² వలన శారీరక ధారుడ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.  à°¶à°¾à°°à±€à°°à°• ఆరోగ్యం అనేది ప్రతీ

ఒక్కరికీ ఆత్యావశ్యమని, అందుకు వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి రోజూ కనీసం గంట సేపు అయిన వ్యాయామం చేస్తారని

మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసారు. అంతర్జాతీయ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకున్న పి.వి.సింధు క్రీడల్లో కష్టపడినందున ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా

నిలిచిందని అన్నారు. జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదని, వారికి తగిన శిక్షణ, ప్రోత్సాహాన్ని ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని చెప్పారు. మన జిల్లా

క్రీడాకారులు ఇదివరకే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారని అన్నారు. కరణం మల్లీశ్వరీ జాతీయ క్రీడాకారిణిగా పేరుతెచ్చుకుందని, కోడిరామ్మూర్తి

ప్రపంచ ప్రఖ్యాతిగాంచారని, వీటన్నింటికీ వారి రంగాల్లో కష్టపడి పనిచేయడం వలనే ఇది సాధ్యమైందని మంత్రి వివరించారు. కావున ప్రతీ ఒక్కరూ చిన్నప్పటి నుంచే

పట్టుదలతో సాధన చేయాలని, వారికి ఇష్టమైన ఏదో ఒక అంశాన్ని ఎంపిక చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మంత్రి అభిలషించారు. హాకీ మాంత్రికుడిగా పేరుతెచ్చుకున్న

మేజర్ ధ్యాన్ చంద్  à°ªà±‡à°°à°¿à°Ÿ ఢిల్లీలో స్డేడియం ఉందని అన్నారు. ఆయన క్రీడను చూసి అందరూ ఆశ్చర్యపోయేవారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు అధిక

ప్రాధాన్యతను ఇస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించిందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన వారికి

రూ.5 లక్షలు, రజిత పతకాలని రూ.4 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు ప్రకటించిందని మంత్రి చెప్పారు. అలాగే జూనియర్ , సబ్ జూనియర్ స్థాయిలో బంగారు పతకానికి రూ.1.25 లక్షలు,

రజిత పతకానికి రూ.75 వేలు, కాంస్య పతకానికి రూ.50 వేలు ప్రోత్సాహాన్ని ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి తెలిపారు. అనంతరం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా జాతీయ,

అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులకు దుశ్సాలువ, జ్ఞాపికతో సత్కరించారు. బాల్ బ్యాడ్మింటన్ లో వాకముల్లు ప్రశాంతికి రూ.2,500/- నగదు ప్రోత్సహకాన్ని మంత్రి

అందించారు. తదుపరి  à°¦à±‡à°¶ ప్రధాని నరేంద్ర మోది ప్రసంగాన్ని లైవ్ ద్వారా తిలకించారు.

జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జయంతిని

పురష్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని

ప్రారంభించిందని, అయిదు సంవత్సారాలు నిర్వహించే ఈ కార్యక్రమం ఒక్కో ఏడాది ఒక్కో థీమ్ తో ముందుకు వెళ్లడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. భారత్ కు ఒలింపిక్ లో

 à°¹à°¾à°•à±€ క్రీడలో బంగారు పతకాన్ని సాధించిన  à°µà±à°¯à°•à±à°¤à°¿ మేజర్ ధ్యాన్ చంద్ అని అన్నారు. క్రీడా నైపుణ్యం కలిగిన వ్యక్తి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ధ్యాన్ చంద్ అని

గుర్తుచేసారు. గతంలో కలరా, క్యాన్సర్ తదితర భయంకరమైన వ్యాధులకు గురి అయితే మరణించే వారని, నేడు జీవన శైలిలో మార్పులతో బిపి, షుగర్ వంటి వ్యాధులబారిన పడి

చనిపోతున్నారని తెలిపారు. వీటన్నింటికి కారణం శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడమే అని చెప్పారు. కావున ప్రతీ ఒక్కరూ వ్యాయామం చేయాలని సూచించారు. వాకింగ్,

సైక్లింగ్ వంటి చిన్న వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యం పొందవచ్చని సూచించారు. అకాల, అవాంఛనీయ మరణాల నుండి బయట పడవచ్చని తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి, అవగాహనతో

సమాజం ఆరోగ్య పథంలో పయనిస్తోందని, చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకొని ఒలింపిక్ లక్ష్యంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. ఫిట్ ఇండియా

కార్యక్రమంలో భాగంగా ప్రతీ నెల వాకింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్, సైక్లింగ్ తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.

à°ˆ

కార్యక్రమంలో శ్రీకాకుళం రెవిన్యూ డివిజనల్ అధికారి యం.వి.రమణ, నగరపాలక సంస్థ కమీషనర్ యం.గీత, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, సెట్ శ్రీ

ముఖ్యకార్యనిర్వహణ అధికారి వి.వి.ఆర్.ఎస్.మూర్తి, జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్, తహశీల్ధార్ ఐ.టి.కుమార్

తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam