DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశ్వ నాధుని దర్శన సేవలో  విశ్వ విజేత సింధు...

ఓటమి అనేది విజయానికి ముందు వచ్చే సూచన.. 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, ఆగస్టు  30, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రపంచ బ్యాడ్మింటన్ విజేత à°—à°¾

నిలిచి క్రీడా ప్రపంచ అభిమానుల అభినందనలు అందుకున్న పివి సింధు "విశ్వ" నాధుడైన తిరుమల శ్రీనివాసుని అనుగ్రహానికి వచ్చారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి

విఐపి బ్రేక్ దర్శన సమయంలో శ్రీ వేంకటేశ్వరుని దర్శించారు. విశ్వ విజేతగా నిలిచి భారత దేశ ఖ్యాతిని క్రీడా ప్రపంచానికి చాటి చెప్పిన సింధును ఆలయ అర్చకులు,

అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. పివి సింధు తిరుమలకు రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు, చిన్నారులు వచ్చి, ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. à°ˆ

సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఓటమి అనేది అతి పెద్ద విజయానికి ముందు వచ్చే సూచన అని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఒక విషయం లో ఓటమి పాలైతే జీవితం ముగిసినట్టు కాదని,

లక్ష్య సాధన ఛేదించే వరకూ పోరాటం చేస్తూనే ఉండాలన్నారు. ఆమె వెంట తల్లిదండ్రులు, భారత క్రికెట్ సంఘం పూర్వ సభ్యుడు, ఇండియన్ బాడ్మింటన్ లీగ్ పోటీల్లో ముంబై

మాస్టర్స్ సహా భాగస్వామి ( ఫ్రాంచైజ్) చాముండేశ్వరి నాధ్  à°•à±‚à°¡à°¾ స్వామి దర్శనానికి వచ్చారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam