DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్రామ సచివాలయ పరీక్షలకు శ్రీకాకుళం సిద్ధం:కలెక్టర్ నివాస్

మండల కేంద్రాల నుంచి ఉచిత రవాణా

ముందు రోజు వచ్చే వారికి ఉచిత బస ఏర్పాట్లు

కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ – హెల్ప్ డెస్క్ 

31న పరీక్షా

కేంద్రాలున్న విద్యాలయాలకు సెలవు :

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 30, 2019 (డిఎన్‌ఎస్‌) :జిల్లాలో గ్రామ

సచివాలయ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షల ఏర్పాట్లపై శుక్ర వారం ఏర్పాటు చేసిన మీడియా

ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లాలో 25 మండలాల్లో 73 రూట్ లుగా విభజించి 306 కేంద్రాలలో  à°ªà°°à±€à°•à±à°·à°²à± నిర్వహించుటకు ఏర్పాటు చేసామన్నారు. ఇందుకుగాను 3,377

మంది ఇన్విజిలేటర్లు, 1,014 మంది హాల్ సూపరింటిండెంట్లు, 336 మంది చీఫ్ సూపరింటిండెంట్లు, 53 మంది అదనపు చీఫ్ సూపరింటిండెంట్లు, 325 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 307 మంది

వెన్యూ ప్రత్యేక అధికారులు, 73 మంది రూట్ అధికారులు, 35 ఫ్లైయింగు స్క్వాడ్ లను ఏర్పాటు చేసామని ఆయన వివరించారు. 1,14,734 మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారని అందులో 70,698

మంది పురుషులు, 44,036 మంది మహిళలు, 332 మంది అంధత్వం కలిగిన దివ్యాంగులు, 1398 మంది ఆర్ధోపెడికల్ దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. 135 మంది దివ్యాంగులు సహాయకులు అవసమరని

తెలిపారని చెప్పారు.

      పరీక్షలకు హాజరు అయ్యే అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. అభ్యర్ధులు తమ పరీక్షా

కేంద్రాలు కనీసం గంట ముందుగా చేరుకోవాలని ఆయన సూచించారు. దూర ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు ముందు రోజు చేరుకొనుటకు ప్రయత్నించాలని

కలెక్టర్ సూచించారు. 31వ తేదీ సాయంత్రం 15 బస్సులను దూర ప్రాంతాలకు వెళ్ళే అభ్యర్ధుల సౌలభ్యార్ధం నడుపుతున్నామని చెప్పారు. రాజాం నుండి ఇచ్ఛాపురం వెళ్ళుటకు 31

సాయంత్రం 3 బస్సులను 5, 6 గంటల సమయంలో నడుపుతున్నామని, రాజాం నుండి కవిటి వెళ్ళుటకు 1 బస్సు, రేగిడి ఆమదాలవలస నుండి పలాస వెళ్ళుటకు 4 బస్సులను సాయంత్రం 5, 7 గంటలకు

నడుపుతున్నామని, వంగర నుండి శ్రీకాకుళం వచ్చుటకు 5 బస్సులను సాయంత్రం 5, 6, 7 గంటలకు బయలుదేరుతాయని చెప్పారు. పరీక్షలకు హాజరు అగుటకు 1వ తేదీ ఉదయం 213 బస్సులను ఏర్పాటు

చేస్తున్నామని, మండల కేంద్రాల నుండి లోపలకు ఉన్న కేంద్రాలకు చేరుకొనుటకు 17 మండల కేంద్రాల నుండి 118 బస్సులను ఉచితంగా ఏర్పాటు చేసామని వివరించారు. భవిష్యత్తు

నిర్ణయించే పరీక్ష అని అటువంటి పరీక్షల పట్ల అశ్రద్ద వహించకుండా అభ్యర్ధులు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్ధులకు ఎటువంటి అసౌకర్యం

లేకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. ముందు రోజు చేరుకునే అభ్యర్ధులకు ఇచ్ఛాపురంలో పురుషులకు మునిసిపల్ ఒడియా పాఠశాల, మహిళలకు

కెజిబివి పాఠశాలలోను., సోంపేటలో పురుషులకు శైలజా కళ్యాణమండపం, మహిళలకు కన్యకాపరమేశ్వరి కళ్యాణమండపం., పలాసలో మహిళలకు పురపాలక సంఘం భవనంలోను, మహిళలకు 5

కళ్యాణమండపాలు- శ్రద్ద, లైసా, కీర్తన, శివరామ, గణపతి కళ్యాణమండపాలను ఏర్పాటు చేసామని చెప్పారు. పరీక్షా కేంద్రాల రూట్ లను చూపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నామని

చెప్పారు.

      సీతంపేట మండలంలో 3 కేంద్రాలు, పాతపట్నం మండలంలో 18 కేంద్రాలు, పలాస మండలంలో 20 కేంద్రాలు, కంచిలి మండలంలో 8 కేంద్రాలు, కవిటి మండలంలో 5 కేంద్రాలు,

సోంపేట మండంలో 12 కేంద్రాలు, వజ్రపు కొత్తూరు మండలంలో 7 కేంద్రాలు, నందిగాం మండంలో 2 కేంద్రాలు, హిరమండంలో 5, పాలకొండ మండలంలో 22, సారవకోట మండలంలో 4, టెక్కలి మండలంలో 13,

కోటబొమ్మాళి మండలంలో 7, జలుమూరు మండలంలో 8, సరుబుజ్జిలి మండంలో 6, సంతకవిటి మండలంలో 11, రాజాం మండలంలో 12, ఆమదాలవలస మండలంలో 11, నరసన్నపేట మండంలో 19, పోలాకి మండలంలో 4, గార

మండంలో 9, శ్రీకాకుళం మండలంలో 68, రణస్ధలం మండలంలో 9, ఎచ్చెర్ల మండలంలో 11, ఇచ్ఛాపురం మండలంలో  10 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ప్రతి కేంద్రం వద్ద భద్రత, వైద్యశిబిరం ఏర్పాటు చేసామని కలెక్టర్ చెప్పారు. అభ్యర్ధులను పోలీసులు పూర్తిగా చెకింగు చేసిన అనంతరం పరీక్ష హాల్ లోకి అనుమతించడం

జరుగుతుందని అన్నారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుండి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుందని ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా ప్రవేశం లేదని ఆయన

స్పష్టం చేసారు. 1వ తేదీ ఉదయం 70,588 మంది, మధ్యాహ్నం పరీక్షకు 12,860 మంది హాజరు అవుతున్నారని వివరించారు. 3వ తేదీ ఉదయం 7,448 మంది, మద్యాహ్నం 3,714 మంది., 4వ తేదీ ఉదయం 1,302 మంది., మధ్యాహ్నం 912

మంది., 6వ తేదీ ఉదయం 1,417 మంది., మధ్యాహ్నం 416 మంది., 7వ తేదీ ఉదయం 6,515 మంది., మధ్నాహ్నం 111 మంది., 8వ తేదీ ఉదయం 2,429 మంది, మధ్యాహ్నం 7,021 మంది హాజరు అవుతున్నారని చెప్పారు. 1వ తేదీ మధ్యాహ్నం

శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలిలో గల 53 కేంద్రాలలో మాత్రమే జరుగుతాయని అన్నారు. మిగిలిన రోజుల్లో కేవలం శ్రీకాకుళంలో మాత్రమే పరీక్షలు జరుగుతాయని ఆయన

వివరించారు.

31న పరీక్షా కేంద్రాలుగల పాఠశాలలు, కళాశాలలకు స్ధానిక సెలవు :

  1à°µ తేదీన జరిగే పరీక్షలకు సామగ్రి సరఫరాను 31à°µ తేదీన సరఫరా చేయడం జరుగుతుందని

జిల్లా కలెక్టర్ అన్నారు. పరీక్షల ఏర్పాట్లను చేయుటకుగాను 31వ తేదీని పరీక్షలు జరిగే పాఠశాలలు, కళాశాలలకు స్ధానిక సెలవును మంజూరు చేసామని చెప్పారు. పరీక్షలు

జరిగే 3,4, 6,7 తేదీలలో స్ధానిక సెలవు మంజూరు చేయుటకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. 1,8 తేదీలు ఆదివారం కావడంతో ప్రభుత్వ సెలవు దినాలు

ఉంటాయని చెప్పారు.

కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ – హెల్ప్ డెస్క్

పరీక్షల నిర్వహణకు సంబంధించి కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో

ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ నివాస్ చెప్పారు. పరీక్షల నిర్వహణలో సంబంధిత అధికారుల నుండి సమాచారం సేకరించుటకు, అధికారులు, సిబ్బంది సందేహల నివృత్తికి

హెల్ప్ డెస్క్ లు ఉపకరిస్తాయని అన్నారు. కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ ఫోన్ నంబరు 08942 240557 కు ఫోన్ చేసి వివరాలు అందించవచ్చని తెలిపారు. హెల్ప్ డస్క్ ఉదయం 7 గంటల నుండి

రాత్రి 10 గంటల వరకు హెల్ప్ డెస్క్ పనిచేస్తుందని అన్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సీనియర్ సహాయకులు ఏ.రవికృష్ణ (ఫోన్ 9866017687), జి.మల్లేశ్వరమ్మ (9505217989)., మధ్యాహ్నం 2

గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సీనియర్ సహాయకులు జి.ఎస్.కిషోర్ కుమార్ (9949058951), టైపిస్టు ఐ.శ్రీనివాస రావు (9177058105) పనిచేస్తారని ఆయన తెలిపారు.

      మీడియా ప్రతినిధుల

సమావేశంలో జాయింట్ కలెక్టర్ à°¡à°¾.కె.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ – 2 పి.రజనీకాంతా రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జి.చక్రధర రావు, రెవిన్యూ

డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, ఆర్.టి.సి. రీజనల్ మేనేజరు ఎ. అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam