DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వనోత్సవం లో అధికారులు తక్కువ. వైకాపా నేతలే ఎక్కువ. . .

ప్రభుత్వ ప్రోగ్రాం లో వేదికపై పార్టీ నేతల హంగామా . . .

ముగ్గురే అధికారులు, మిగిలిన వారంతా పార్టీ నేతలే. . . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . 

.విశాఖపట్నం,

ఆగస్టు  31, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారుల కంటే à°ªà±à°°à±‹à°Ÿà±‹à°•à°¾à°²à± లో లేని అధికార పార్టీ నేతల ప్రాముఖ్యతలే ఎక్కువైపోయింది. రాష్ట్ర ప్రభుత్వ

అటవీ శాఖా ఆధ్వర్యవం లో విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం లో జరిగిన వనోత్సవం పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం

à°—à°¾ మారిపోయింది. సభ వేదికపై సుమారు 30 మంది ఆసీనులు కాగా కేవలం ఐదుగురు ప్రోటోకాల్ ప్రజా ప్రతినిధులు  à°®à±à°—్గురే ప్రభుత్వ అధికారులు ఉండగా. . మిగిలిన సీట్లలో అధికార (

వైఎస్ ఆర్ కాంగ్రెస్ ) పార్టీ నేతలో ఆసీనులయ్యారు. వీరిలో నగర కమిటీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ ఒక్కరే కొంచెం చెప్పుకోదగ్గ పార్టీ నేతలు కాగా, మిగిలిన

వారిలో వార్డు స్థాయి సభ్యులు ఎక్కువగా ఉన్నారు.

   à°ªà±à°°à±‹à°Ÿà±‹à°•à±‹à°²à± లో ఉన్న నేతలు : రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విఎం ఆర్డీ ఏ చైర్మన్

ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ (అనకాపల్లి), తిప్పల నాగిరెడ్డి (గాజువాక), గొల్ల బాబురావు (పాయకరావు పేట) కాగా జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్.

శివశంకర్, జిల్లా అటవీ శాఖా అధికారి రాహుల్ పాండే, సహా మరొక అధికారితో పాటు ట్రైనీ కలెక్టర్ ప్రతిష్ఠా మాత్రమే ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మంత్రి తో పాటే ఈ మొత్తం

పార్టీ నేతలు వేదికపైకి రావడంతో నిర్వాహకులు ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. 

వేదికపై ఆశీనులైన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు :

వంశీకృష్ణ శ్రీనివాస్ (నగర అధ్యక్షులు), గరికిన గౌరీ ( నగర మహిళా అధ్యక్షురాలు), చంద్రమౌళి, రొంగలి జగన్నాధం, బోణి శివరామకృష్ణ లు మాత్రమే చెప్పుకోదగ్గ నేతలు.

మిగిలినవారు అనుచరులే కావడం గమనార్హం.     

ఐఏఎస్ స్థానం ఒక మహిళా నేత ప్రక్కనా?

అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే వేదికపై యువతకు స్ఫూర్తిదాయకమైన ట్రైనీ (

యువ ) ఐఏఎస్ ప్రక్కనే పార్టీ కార్యకర్తకు స్థానం కలించడం బాధాకరం. ప్రభుత్వ ఆధ్వర్యవం లో జరగవలసిన వనోత్సవం వైఎస్సార్ పార్టీ కార్యక్రమం గా

మారిపోయినట్టయింది.  à°¸à°­à°²à±‹ పాల్గొన్న వారికీ వేదిక పై ఉన్నవారు ఎవరో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam