DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొక్కలతోనే మానవ మనుగడ – సభాపతి తమ్మినేని  

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 31, 2019 (డిఎన్‌ఎస్‌): మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ శాసన సభాపతి

తమ్మినేని సీతారాం అన్నారు. దుప్పలవలస ఎపి సాంఘీక సంక్షేమ శాఖ గురుకులం ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర

రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మొక్కలు నాటి వనమహోత్సవం కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం

మాట్లాడుతూ వన మహోత్సవంను కె.à°Žà°‚.మున్షి  à°ªà±à°°à°¾à°°à°‚భించారన్నారు. మొక్కలే జీవమని, మానవ మనుగడకు ప్రథామైన కారకమని అన్నారు. మానవుడు మొక్కల ప్రాధాన్యతను గుర్తించక

నరికి వేస్తున్నాడని తద్వారా కాలుష్యభూతం ఆవహిస్తోందన్నారు. కాలుష్యం అణుబాంబు కంటే ప్రమాదకరమైనదని ఆయన అభివర్ణించారు. గ్లోబల్ వార్మింగు రోజు రోజుకు పెరిగి

పోతుందని దాని పర్యవసనాలను ప్రతి రోజు చవిచూస్తున్నామని అన్నారు. ఇప్పటి నుండైనా పర్యావరణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలని లేదంటే భావి తరాలకు తీరని అన్యాయం

చేసినవారం కాగలమని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్క నాటితేనే పర్యావరణం కాపాడుకోగలం అన్నారు. మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరికీ ఒక అజెండా కావాలని

పేర్కొన్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం తక్కువగా ఉందని అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. పిచ్చుకలు, పశు పక్ష్యాదులు ఎక్కడ కనిపిస్తున్నాయని ఆయన

ప్రశ్నించారు. కాలుష్యం కారణంగా జీవరాశులు కనిపించకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మొక్కలు లేవు. జీవనాన్ని నాశనం చేసుకుంటున్నాం.చట్టాలను

నిర్వీర్యం చేసుకుంటున్నాం అన్నారు. మొక్కను నాటితే తల నరికి నట్లే అని భావించాలని చెప్పారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మొక్కల పెంపకం,

పచ్చదనం కాపాడటానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన సూచించారు. గ్లోబల్ వార్మింగు వినబడుతున్నాయి. అవి మృత్యు గంటికలు అన్నారు. రహదారుల విస్తరణ

సమయంలో మొక్కలు విధిగా నాటి పరిరక్షించుకోవాలని రహదారులు, భవనాల శాఖ మంత్రికి సూచించారు. ఒక మొక్క నాటితే భవిత ఇస్తుంది. పెద్దలు చెప్పారు మనిషిగా పుట్టే కంటే

మానై పుట్టాలని.మొక్క నీడను ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది. చివరికి కట్టెలు కూడా ఇస్తుందని అన్నారు. చట్టాలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంటూ మొక్కలను నాటి

పర్యావరణం, ప్రకృతిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కృష్ణ దాస్ మాట్లాడుతూ మొక్కల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ

గుర్తించాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, మొక్కల పెంపకాన్ని అలక్ష్యం చేస్తున్నామని అన్నారు. చిన్నారులకు మంచి అవగాహన కలిగించి, పుట్టిన

రోజున ఒక మొక్క నాటాలని తద్వారా నాటిన మొక్కలు బ్రతికే వరకు శ్రద్ద వహించాలని కోరారు. మొక్కలు పెద్ద ఎత్తున నాటి జిల్లాను నందన వనం చేయాలని

పిలుపునిచ్చారు.

శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు మొక్కల ప్రాధాన్యత ఎంతో ఉందన్నారు. అటవీ భూములను సైతం ఆక్రమించడం

జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడుకోవాలని, కొయ్యాం గ్రామంలో 68 ఎకరాల అటవీ భూమి ఆక్రమణలకు గురి అయ్యిందని, చర్యలు చేపట్టాలని కోరారు.

జిల్లా

కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు పెంపకం చాలా అవసరం అన్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం కలిగిన ప్రాంతం కేవలం 12 శాతం మాత్రమే  à°…న్నారు. రాష్ట్రంలో 22

శాతం అడవులు ఉన్నాయని, అటవీ ప్రాంతం కనీసం 33 శాతం ఉండాలని అప్పుడే వాతావరణ సమతూకం ఉంటుందన్నారు. తితిలిలో 15 లక్షల కొబ్బరి మొక్కలు కూలిపోయాయని వాటితో పాటు ఇతర

మొక్కలు కూలిపోయాయని అన్నారు. ఈ మొక్కల స్ధానంలో మరల మొక్కలు వేసి పచ్చదనం పెంపొందించుకోవాలని అన్నారు. జిల్లాలో 1.20 కోట్ల మొక్కలు పెంపకానికి లక్ష్యంగా

పెట్టుకున్నామని కలెక్టర్ అన్నారు. ఒక వ్యక్తి 5 వందల మొక్కలు పెంచుకుంటే ఉపాధి హామీ పథకం కింద నెలకు రూ.3 వేలు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తామని చెప్పారు. గ్రామ

పంచాయతీ స్థాయిలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, మొక్కలను పరిరక్షించుకోవాలని అన్నారు.

వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా విద్యార్ధులకు

నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులను అందజేసారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పిస్తూ చక్కటి

సాంస్కృతిక ప్రదర్శనలను డా.రఘుపాత్రుని శ్రీకాంత్, డా.తిమ్మరాజు నీరజ శిష్యబృందం ప్రదర్శించింది.

ఈ కార్యక్రమంలో డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం

రిజిస్ట్రార్ ప్రో.కె.రఘు బాబు, డివిజనల్ అటవీ అధికారి బి.ధనుంజయ రావు, రేంజ్ అధికారులు జె సింధూ, గోపాల నాయుడు, స్ధానికులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam