DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న భూతొ న భవిష్యత్ కార్యసిద్ధి వినాయక దర్శనం  

వైభవోపేతంగా చోడవరం స్వయంభూ వినాయక ఉత్సవాలు 

కార్యసిద్ధి కోసం ఆలయానికి వేలాదిగా భక్త జనం రాక 

DNS తో ఆలయ ప్రధాన అర్చకులు కొనమంచిలి గణేష్ 

(DNS

రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 02, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ జిల్లా చోడవరం పాత చెరువు వద్ద స్వయంభూగా వెలసిన

కార్యసిద్ధి వినాయకుని నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని  à°ˆ ఆలయ వైభవాన్ని, ప్రభావాన్ని ఆలయ ప్రధాన

అర్చకులు కొనమంచిలి గణేష్ DNS కు తెలిపారు. 
ఈ నవరాత్రి మహోత్సవాలు ఉత్సవాల్లో బాలగణపతి సేవ సమితి సభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత ప్రసాద వితరణ

చేస్తున్నట్టు తెలిపారు. 

స్మార్త ఆగమ సంప్రదాయం లో అర్చనలు నిర్వహిస్తున్న ఈ ఆలయంలో తమ కుటుంబం 1977 నుంచి సేవలు చేస్తున్నట్టు తెలిపారు. తదుపరి 2000 నుంచి

దేవాదాయ శాఖా పరిధిలోకి వెళ్ళిందని, ప్రస్తుతం ఆలయ ఈఓ à°—à°¾ ఎస్ వివి సత్యనారాయణ మూర్తి ఉన్నారన్నారు.  

ఆలయ ప్రాశస్త్యం : . . .

200 ఏళ్ళు గా అర్చనలు అందుకుంటున్న ఈ

స్వయంభూ కార్యసిద్ధి వినాయకుని సేవించేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి  à°•à±ƒà°·à±à°£ జిల్లా వరకూ వేలాదిగా భక్తులు నిత్యం ఆలయానికి వస్తుంటారు. ఒకసారి వచ్చి స్వామిని

తాము చేపట్టే కార్యక్రమం లో విజయం లభించాలని కోరుకుంటారని, తదుపరి పని విజయం సాధించిన తర్వాత మరోసారి స్వామి దర్శనానికి రావడం ఆనవాయితీ à°— వస్తోందన్నారు.  à°°à°¾à°œà°•à±€à°¯

నేతలు, పారిశ్రామిక వేత్తలు, à°ˆ స్వామిని దర్శించడం ఆనవాయితీ మారిందన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో స్వయంభూ గా వెలసిన వినాయక విగ్రహాల్లో అత్యంత ప్రఖ్యాతి

గాంచినవి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం లో వరసిద్ధి వినాయకుడు, రెండవది విశాఖ పట్నం జిల్లా చోడవరం లోని కార్యసిద్ధి వినాయకుడు గా చరిత్ర తెలియచేస్తోంది. వినాయక

చవితి ఉత్సవాల్లో తొమ్మిది రోజులపాటు అత్యత వైభవంగా నిర్వహించే వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, ప్రవచనాలు కూడా జరుగనున్నట్టు

తెలిపారు.

చోడవరానికి తూర్పు ముఖంలో వున్న పాత చెరువు గట్టున ఉన్న ఈ ఆలయాన్ని 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చరిత్ర తెలియచేస్తోంది.

గర్భగుడి ద్వారంపైనా తలపైభాగంలో చేప చిహ్నాలు ఉండడంతో దీనిని మత్స్యగణపతిగా కూడా పిలవడం జరుగుతోంది. ఈ ప్రాంతం లోనే గంగాజలంతో కూడిన శివలింగం బయల్పడటంలో

అక్కడే ఆలయ నిర్మాణం చేశారు. అనంతరం తురుష్కుల దాడిలో ఆలయంతో పాటు గౌరీశ్వరస్వామి లింగాకృతి సైతం చిన్నా భిన్నం కావడంతో కాశీ నుంచి రప్పించిన కొత్త లింగాన్ని

ప్రతిష్టించాలనుకున్నారు. స్వామి కలలో కనపడి స్వయంభూ విగ్రహానికి మాత్రమే పూజలు జరిపించవలసిందిగా ఆదేశించడం జరిగింది. 

ఆలయ మండపంలోని నాలుగు స్తంభాలు

నంది విగ్రహం సింహాచల దేవస్థానం శిల్పకళను పోలి వుండటం కూడా మత్స్య వంశీయులు à°ˆ ఆలయాన్ని నిర్మించినట్లు భావించడానికి మరో కారణం. 

స్వయంభూ వినాయక విశేషం

సుమారు 200 సంవత్సరాల నుంచి స్మార్త ఆగమ విధానం ద్వారా అర్చనలు అందుకుంటున్న  à°¸à±à°µà°¯à°‚భూ విఘ్నేశ్వరుని విగ్రహము నడుము పై భాగము మాత్రమే దర్శనమిస్తుంది. తొండం

చివరి భాగం పైకి కనిపించదు. à°ˆ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam