DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశాంతంగా  గణేష్ నిమజ్జనానికి కృషి చేద్దాం : ఎస్పీ 

హిందూపురంలో కమిటీలతో ఎస్పీ సమావేశం

నిమజ్జనం ఊరేగింపు ,  à°­à°¦à±à°°à°¤à°¾ ఏర్పాట్లపై సమీక్ష.. 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). . .

అనంతపురం,

సెప్టెంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): వినాయక ఉత్సవాల్లో ఆఖరు ఘట్టమైన గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు

పిలుపునిచ్చారు. గణేష్ వేడుకల నేపథ్యంలో ఆయన  à°®à°‚గళవారం ఆయన హిందూపురంలో  à°¶à°¾à°‚తి కమిటీ, సమన్వయ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అనంతరం కదిరికి వెళ్లి

అక్కడి పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లుపై సమీక్ష చేశారు. కట్టుదిట్టమైన భద్రతతో సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కదిరి పట్టణంలో

ఊరేగింపులు సాగే రహదారులు, నిమజ్జనం ప్రాంతాన్ని పరిశీలించి సూచనలు చేశారు.  à°¹à°¿à°‚దూపురం శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ప్రతీ మంటపంలో క్యూఆర్ కోడ్

కల్గిన స్టిక్కర్ అతికించుకోవాలన్నారు. దీని వల్ల మంటపాల్లో ప్రతిష్టించిన ప్రతిమల మరియు ఉత్సవ కమిటీల వివరాలుతో పాటు ఊరేగింపుగా వెళ్లిన సందర్భాలలో లొకేషన్

తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టవచ్చన్నారు. అయిష్టత కల్గిన వ్యక్తులకు అనవసరంగా రంగులు చల్లి అల్లర్లు, గొడవలకు కారణం కారాదన్నారు. పోలీసులు సూచించిన

మార్గాల్లోనే ఊరేగింపులు సాగాలన్నారు. సమస్యలు సృష్టించే అల్లరి మూకలు, రౌడీలు, ట్రబుల్ మాంగర్లను ముందుగా పిలిపించి హెచ్చరించాలన్నారు. నిమజ్జనం ప్రాంతంలో

బ్యారికేడింగ్ , లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయించాలన్నారు. గణేష్ ప్రతిమల నిమజ్జనానికి చిన్నారులు, వృద్ధులను తీసికెళ్లరాదన్నారు. నిమజ్జనం కోసం ప్రతిమలను

తరలించే వాహనాలు వేగంగా నడపటం... ఓవర్ టేక్ చేయడం చేయరాదన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ

అధికారులు సమన్వయంతో ఉరేగింపులు, నిమజ్జనం కార్యక్రమాలు సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. ఈ రెండు చోట్ల కార్యక్రమాలలో పెనుకొండ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషా, కదిరి

డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ , శాంతి కమిటీల సభ్యులు, పుర ప్రముఖులు, స్థానిక పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam