DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ద్రోణంరాజు అంటే. .. సత్యనారాయరాణేనా ? శ్రీనివాస్ కాదా ?

విశాఖ వాసులకు శ్రీనివాస్ అలవాటు కాలేదా ?..  

హోర్డింగ్ ల్లోనూ, సభల్లోనూ సత్యనారాయణ పేరే. .

సత్యనారాయణ పేరు వ్రాసి, నాలిక కరుచుకుని...

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS , Bureau, DNS). . ..

విశాఖపట్నం, సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖ పరిధిలో జరిగే సభల్లో ద్రోణంరాజు శ్రీనివాస్ అతిధిగా హాజరైన సభల్లో అయన పేరుకు మారుగా ద్రోణంరాజు

సత్యనారాయణకి స్వాగతం, అని పలకడమే  à°•à°¾à°•,  à°¸à±à°µà°¾à°—à°¤ ద్వారా బోర్డుల్లోనూ ద్రోణంరాజు సత్యనారాయణ పేరే కనపడుతోంది. ఇటీవల జరిగిన క్రీడా సంబరాల్లో à°ˆ పేరిట బోర్డులు

కూడా ముద్రించేసారు, సానియా హోర్డింగ్ పై వివాదం రావడంతో ఈ విషయాన్నీ కూడా నిర్వాహకులు లేటుగా గుర్తించారు. దీంతో ఆ బోర్డులను ఛిద్రం చేయడం జరిగినట్టు

తెలుస్తోంది.  

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణంరాజు అనగానే వెంటనే ఎవరికైనా తట్టే పేరు సత్యనారాయణేనా. .  à°…ంటే అవుననే అంటున్నారు ప్రజలు.,

కొన్ని

దశాబ్దాల కాలం  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర రాజకీయాల్లో చక్రం త్రిప్పిన అయన అన్ని రంగాల ప్రజలకూ సుపరిచితులు. అయితే అయన వారసునిగా రాజకీయా ప్రవేశం చేసిన కుమారుడు ద్రోణంరాజు

శ్రీనివాస్. ఈయన కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కావడం, పైగా అనుభవ రాహిత్యం,. రాజకీయ ప్రణాళికలు వేసి, అందరి దృష్టినీ ఆకర్షించడం లో విఫలం అయ్యారనే చెప్పాలి. అయితే

కాంగ్రెస్ పార్టీ లో సుదీర్ఘ కాలం సభ్యునిగా ఉన్నా, ఈయన ఎమ్మెల్యే గా ఎన్నికైనా కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అయ్యారు. కాలం మారడంతో వైఎస్సార్ కాంగ్రెస్

అధికారం లోకి రావడం తో ఈయనకు విశాఖ మెట్రో అభివృద్ధి సంస్థ మొదటి చైర్మన్ గా అవకాశం వచ్చింది. అయితే ఈ హోదాలో ఈయన పలు అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో

పాల్గొంటున్నారు. ఈ సభల్లో ముఖ్య అతిధి ద్రోణంరాజు అంటూ వెంటనే సత్యనారాయణ అనే పేరు వీళ్లకు తెలియకుండానే అప్రమత్తంగా వచ్చేస్తోంది. ఇదే తంతు సభల్లోనూ, ప్రెస్

మీట్ ల్లోనూ కూడా ఎదురవుతోంది. 

అయితే ద్రోణంరాజు పేరు అంతగా ప్రజల్లో నాటుకు పోయింది అంటే అయన ఈ ప్రాంతానికి చేసిన కృషిని ప్రజలు అంత గుర్తు

పెట్టుకున్నట్టు లెక్క. పైగా కుమారుడు పాల్గొనే సభలో తండ్రిని స్ఫురణకు తీసుకు రావడం శుభ పరిణామమే. శ్రీనివాస్ పేరు అలవాటు అవ్వాలంటే చాలా శ్రమించాల్సిన అవసరం

ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam