DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్నేహశీలి, కార్మికనేత మీసాల హఠాన్మరణం

పాత్రికేయ రంగంలోనూ ప్రావీణ్యత  

కలం తోనూ కథనమే : పిటిఐ రాజా 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) :

కార్మికోద్యమనేత, స్నేహశీలి, మీసాల సత్యనారాయణ (69) బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో గుండెపోటుతో హఠ్మానరణం చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజమహేంద్రవరంలో పాత్రికేయునిగా పనిచేసిన మీసాల సత్యనారాయణ భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) జిల్లా కార్యదర్శిగా సుమారు 20 సంవత్సరాలపాటు పనిచేశారు. ప్రస్తుతం

ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శిగా కార్మికోద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఎఐటియుసి అనుబంధ కార్మిక సంఘాల నిర్మాణంలో మీసాల ప్రముఖ

పాత్ర పోషించారు. కార్మిక చట్టాలను ఆవపోషణ పట్టిన మీసాల నూతన కార్మిక సంఘాలకు సంబంధించి రిజిష్ట్రేషన్లు చేయించే విధానంపై పూర్తి అవగాహన కల్గివున్నారు. ఈయనది

ప్రకాశం జిల్లా సంతరావూరు గ్రామం. విద్యాభ్యాసం కొంతవరకూ జన్మించిన ఊరిలోనే జరిగింది. అయితే మీసాల సత్యనారాయణ తండ్రి మీసాల నరసింహరావు, తల్లి లక్ష్మిమ్మలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లా వేలేరుపాడుకు వ్యవసాయం నిమిత్తం తరలివెళ్లారు. ఖమ్మం జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తో అనుబంధం à°†

కుటుంబానికి ఏర్పడింది. కామ్రేడ్‌ మీసాల సత్యనారాయణకు à°’à°• చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరిలో రెండో తమ్ముడు హరి ధవళేశ్వరంలో కిరాణ దుకాణం నడుపుతున్నారు.

చిన్న తమ్ముడు శివరామప్రసాద్‌ గతంలో జర్నలిస్ట్‌à°—à°¾ రాజమహేంద్రవరంలో పనిచేశారు. ఉద్యమ నేపథ్యం కల్గిన కుటుంబంలో పెరిగిన మీసాల సత్యనారాయణ అక్కడి పార్టీ

ఆదేశాలకు అనుగుణంగా రాజమహేంద్రవరం వచ్చారు. రాజమహేంద్రవరం నగరానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ ఉద్యమ బాటలోనే కొనసాగారు. 

కలం తోనూ కథనమే : పిటిఐ

రాజా 

ఉద్యమ నేపధ్యం కల్గిన మీసాలకు తనతో రెండు దశాబ్దాల అనుబంధం ఉందని, ఆయన అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని  à°•à°²à±à°—ించిందని సీనియర్ పాత్రికేయులు పెంటపాటి

రాజా ఆవేదన వ్యక్తం చేసారు. మీసాల సమస్యల పరిష్కారానికి ప్రత్యక్ష ఉద్యమం లోకి రాక ముందు కాలంలోనూ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ

సానుభూతిని వ్యక్తం చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam