DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముఖ్యమంత్రి ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా

పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ

సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల మరియు సింగుపురం ప్రాంతాలను ముఖ్యమంత్రి సందర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. 6వ తేదీ

ఉదయం 10.00గం.లకు పలాసకు చేరుకుంటారని, అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని, అనంతరం కాశీబుగ్గ రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో

పాల్గొంటారని అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా తలపెట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమానికి అక్కడే శ్రీకారం చుడతారని కలెక్టర్ చెప్పారు.

మధ్యాహ్నం 02.00గం.లకు ఎచ్చెర్ల చేరుకొని అక్కడ ట్రిపుల్ ఐటిలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారని, అలాగే నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్ మరియు

హాస్టల్ బ్లాక్ లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. మధ్యాహ్నం 03.30గం.లకు సింగుపురం వద్ద నూతనంగా

నిర్మించిన అక్షయపాత్ర ఫౌండేషన్ సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు

తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
        à°ˆ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ à°Ž.భార్గవ్ తేజ్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, ఉప రవాణా కమీషనర్ à°¡à°¾.

వి.సుందర్, బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, మత్స్యశాఖ ఉపసంచాలకులు డా. వి.వి.కృష్ణమూర్తి, రిమ్స్ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.

కె.కృష్ణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. యం.చెంచయ్య, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి బి.జె.డి. ప్రసన్నకుమార్, ఏ.పి.ఇ.పి.డి.సి.యల్ పర్యవేక్షక ఇంజినీర్

యన్.రమేశ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ బి.రవి, ఆం.ప్ర.రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు, ఆర్.టి.సి డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్

మేనేజర్ యన్. శ్రీనివాస రావు,  à°ªà°¿.ఆర్.à°“ బి.యల్.పి.రావు, సమాచార శాఖ సహాయ సంచాలకులు బి.పూర్ణచంద్రరావు, à°¡à°¿.పి.ఆర్.à°“ యల్.రమేశ్, ఉపకార్యనిర్వాహక సమాచార ఇంజినీర్

సిహెచ్.వి.రాంప్రసాద్, ఇతర జిల్లా అధికారులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam