DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ పాలనా పరాకాష్టకు చేరింది . . .:చంద్రబాబు 

100 రోజుల్లోనే ప్రజలకు అసహ్యం వేసింది

 

ఓటమి పాలైన ప్రజాభిమానం పొందాం :

తూగో జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

 à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రం లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పరాకాష్టకు చేరిందని,  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°· నేత

చంద్రబాబు నాయుడు అభిప్రాయం పడ్డారు. రెండు రోజుల తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన అయన గురువారం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. 100 రోజుల్లోనే

ప్రభుత్వంపై ప్రజలకు అసహ్యం వేసిందన్నారు. ఎన్నికల ఓటమి చెందినప్పటికి పార్టీపై మీకున్న అభిమానం మరువలేనిదని, ఆరు నెలలు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకున్నాం ఆ

తరువాతే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకున్నాం అన్నారు. కానీ ఆ స్థాయిని వైసిపి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు.. కార్యకర్తలపై దాడులు, విధ్వంసానికి

పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్తులను, కుటుఃబసభ్యులను పోగొట్టుకున్నా మనోధైర్యంతో నిలబడే సత్తా ఉన్న కార్యకర్తలు టిడిపికే సొంతం అన్నారు.

ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పని చేసానని, ఎప్పుడు ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలబడింది కార్యకర్తలు

మంత్రమేనని, 100 రోజులపాలనలో 8 హత్యలు 499 దాడులు, విధ్వంసానికి పాల్పడ్డారన్నారు, ప్రజలు బుధ్ధి చెప్పేరోజు ఆసన్నమైంది.. ఈ జిల్లా నుంచే కార్యకర్తలతో మమేకం అవుతాను,

రాష్ట్రం అంతటా పర్యటిస్తాను..

గోదావరి జిల్లా అంటేనే స్వఛ్చత, శాంతికి. ఆప్యాయతకు నిదర్శనం అని, కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు.. పేదల కడుపు నింపే

అన్న క్యాంటీన్ల మూసివేశారని మండిపడ్డారు. ఆందోళన చేస్తే వైసిపి వాళ్లే దాడి చేసి మా పార్టి నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. దీనిపై స్పందించేందుకు అధికారులు

కూడా సిద్ధంగా లేక పోవడం బాధాకరం అన్నారు. కేసులపై ఆందోళన చేస్తే వారిపైనా కేసులు పెడుతున్నారు, ప్రజాస్వామ్యం పాలనలోనే ఉన్నామా అనే అనుమానం

కలుగుతోందన్నారు.  à°ˆ సమావేశం లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam