DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవితంలో ధనార్జన కంటే విద్యార్జనే ప్రదానం  

విద్యాదానమే లక్ష్యంతో కళాశాలలు ఏర్పాటు చేసాం.

ఇప్పడికే 2 లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దాం. 

విజ్ఞాన జ్యోతులను వెలిగించేది

గురువే

క్రీడలు, పర్యాటక  à°¶à°¾à°–మంత్రి à°Žà°‚. శ్రీనివాసరావు

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 05, 2019

(డిఎన్‌ఎస్‌): ప్రతి మనిషి జీవితంలో ధనార్జన కంటే విద్యార్జనే అత్యంత ప్రధాన మైనదని పర్యాటక క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు అన్నారు.

గురువారం అనకాపల్లి రావు గోపాలరావు ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ

సందర్బంగా అయన తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. విద్యా శక్తి ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో ఎన్నో డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి 2 లక్షల మంది

విద్యార్థులకు విద్యను అందించామన్నారు. గురువు మనిషిలో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తారని,  à°¤à°¨à°•à± గురువులు నేర్పించిన విద్యతో ఈనాడు తానీ స్థాయికి చేరగలిగే

అన్నారు. 

శ్రమయేవ జయతే అన్నట్లుగానే విద్య వికాసానికి మూలం అవుతుందన్నారు. విజయం అనేది శ్రమతోనే వస్తుందని, దానికి విద్య కూడా తోడైతే తాను అభివృద్ధి

చెందడమే కాకుండా ఇతరులను కూడా అభివృద్ధి పథంలో నడిపించ వచ్చని చెప్పారు. తాను విద్యాదానమే లక్ష్యంతో డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి 2 లక్షల మంది

విద్యార్థులకు విద్యను అందించానన్నారు . విజయానికి విద్యా శ్రమతోపాటు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలన్నారు. గురువు అంటే అన్ని విషయాలను కూలంకషంగా బోధించాలని, జ్ఞానం

ప్రసాదించాలని, దిశానిర్దేశం చేసిన వాడే గురువు అవుతాడు అన్నారు. ఈ రోజుల్లో ఉన్న బోధకుడు( టీచర్) నిబద్ధతతో పని చేసి విద్యార్థి అభివృద్ధిని కాంక్షించిననాడే

గురువుగా మారుతాడు అని చెప్పారు.

వి ఎం ఆర్ డి ఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు భరోసాగా అమ్మ ఒడి కార్యక్రమాన్ని

చేపట్టిందన్నారు పిల్లలను బడికి పంపితే తల్లులకు జనవరి 26 నుండి రూ 15,000 అందజేస్తారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో గురువులందరూ విద్యార్థులను ఉత్తమ

పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఆయన ఉపాధ్యాయుడు విద్యావేత్త తత్వవేత్త అని అటువంటి మహానుభావుని జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం మన అదృష్టం

అని చెప్పారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà°¤à°¿ సర్వేపల్లి రాధాకృష్ణ కు ప్రపంచ మేధావుల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆయన వేదాలను ఉపనిషత్

లను అనువదించారని తెలిపారు. తల్లిదండ్రులు సంస్కారాన్ని నేర్పి తే గురువు విలువలతో కూడిన విద్య నేర్పిస్తాడు అన్నారు. అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమరనాథ్

అధ్యక్షత వహించిన ఈ సభలో పార్లమెంటు సభ్యులు జి మాధవి బి సత్యవతి శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గొల్ల బాబురావు ప్రసంగించారు. అనంతరం మంత్రి జిల్లాలో ఉత్తమ

ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను సత్కరించి  à°œà±à°žà°¾à°ªà°¿à°•à°²à°¨à± బహుకరించారు. à°ˆ కార్యక్రమంలో జెసి 2 సూర్యకళ, జిల్లా విద్యాశాఖాధికారి, ఆర్డీవో సీతా రామారావు తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam