DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశ్నిస్తే బెదిరిస్తారా ? లేకుంటే జైల్లోకి నెట్టేస్తారా ? : ధార్మిక సంఘాలు

మంత్రులే నేరుగా ప్రకటిస్తే ఆపేదెవరు ?

విశాఖపట్నం, మే  : ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా ? ప్రశ్నిస్తే ముందుగా బెదిరిస్తారు, లొంగకుంటే జైల్లోకి

నెట్టేస్తామని హెచ్చరిస్తారు, ఇదే ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో  à°¨à°¡à±à°¸à±à°¤à±à°¨à±à°¨ వైఖరి అని ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇటీవల దేశాన్ని కుదిపేస్తున్న కీలక

అంశాల్లో తిరుమల ఆలయం లో జరుగుతున్నా అనాచారాలపై ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలే. అధికార పార్టీ నేతలు, స్థాయి మరిచి తిరుమల లో అధికారం

చెలాయిస్తుంటే అడ్డుకోవడమే రమణ దీక్షితులు చేసిన మహాపాపం లా ఉంది అని మండిపడుతున్నాయి. అయన తమ కుటుంబాలు ఎన్నో ఏళ్ల నుంచి సేవ చేస్తున్న ఆలయంలో జరిగిన

తప్పిదాలనే తప్పు పట్టారు తప్ప, రాజకీయంగా తెలుగు దేశం పార్టీని, నేతలని గానీ, వీళ్ళ హయం లో జరిగిన భూ దందాలు గానీ, భౌతిక దాడుల గురించి గానీ, ఇతర హేయమైన చర్యల

గురించి గానీ విమర్శలు చేయలేదు. ఆలయం లో విధుల్లో ఉండగా ప్రశ్నిస్తే అది విధి నిర్వహణ లో తప్పిదం అవుతుంది, నాడే ఈ విషయాలపై నాటి అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం

జరిగిఉంటుంది. అయితే à°† విషయాన్ని తొక్కిపెట్టి, ఈయన పై ఘోరమైన నేరం చేసినట్టు à°—à°¾ చిత్రీకరించి, ఆయన  à°à°¦à±‹ హత్య చేసినంత à°—à°¾ మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలంతా

విరుచుకు పడుతున్నారని మండిపడ్డారు.  à°°à°®à°£ దీక్షితులు చేసిన ఆరోపణలే వాస్తవమై, తెలుగుదేశం పార్టీ నేతలు దోషులుగా తేలితే   ఈయనకు జరిగిన పరువు నష్టం ఎవడు

తీరుస్తాడు. పైగా దొడ్డి మార్గం లో మంత్రయిన సోమిరెడ్డి చంద్రమోహన్ ఏకంగా ఎవడు రమణ దీక్షితులు, బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు వస్తాయంటూ విపరీత

వ్యాఖ్యానించడం పైగా దీనికి పార్టీ నుంచి ఎటువంటి ఖండన లేకపోవడం తో అర్చకులంటే తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం గౌరవం ఉందొ తెలుస్తోందని ఆవేదన వ్యక్తం

చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలని పార్టీ నేతలు ఖండించలేదు అంటే పార్టీ తీర్మానం కూడా ఇదే అయి ఉండాలి. అదే జరిగితే రమణ దీక్షితులని నాలుగు రోజులు కాదు నాలుగు

వారాలు బో . . లో వేసి చిత్రహింసలు పెట్టి, ఎవరో చేసిన నేరానికి ఇతన్ని శిక్షించినా ఆశ్చర్య పోనక్కరలేదు అని విచారం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ ద్వారా సమగ్ర

విచారణ జరిపించి నిజాలు బయటకు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 


 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam