DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గత పాలకుల వైఫల్యంతోనే ప్రజలకు ఇబ్బందులు

‘అనంత’ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌లు గ్రూపులు కట్టి అభివృద్ధిని విస్మరించారు

▪నీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుపై ఇకపై

ప్రత్యేక దృష్టి

▪త్వరలో రోడ్ల మరమ్మతు పనులు

▪అనంత సుందరీకరణకు ప్రజల సహకారం అవసరం

▪అక్రమార్కులపై కమిషనర్‌ చర్యలు అభినందనీయం

▪అవినీతి

రహిత పాలనకు అందరూ నడుంబిగిద్దాం

▪అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, సెప్టెంబర్

07, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం నగర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. శనివారం నగరంలోని ఐదో

రోడ్డు, రాజేంద్ర మునిసిపల్‌ హైస్కూల్‌ సమీపంలో ఏపీఎంపీడీ పథకం à°•à°¿à°‚à°¦ ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులను కమిషనర్‌ ప్రశాంతితో కలిసి ఆయన ప్రారంభించారు. à°ˆ సందర్భంగా

ఎమ్మెల్యే మాట్లాడుతూ à°—à°¤ పాలకుల వైఫల్యం వల్ల నగరంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. టీడీపీ హయాంలో ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌లు మూడు గ్రూపులుగా

విడిపోయిన నగర అభివృద్ధిని విస్మరించారన్నారు. ఏపీఎండీపీ పనులు నత్తనడకన సాగాయన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్లన్నీ ఛిద్రం అవడంతో ప్రజలు ఇబ్బందులు

పడాల్సి వస్తోందన్నారు. త్వరలోనే రోడ్ల మరమ్మతులు చేస్తామని, టెండర్‌ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పీఏబీఆర్‌ నుంచి తాను ఎంపీగా ఉన్న సమయంలో అనంతపురం

నగరానికి నీరు తెచ్చినట్లు చెప్పారు. కానీ కొన్ని లోపాల కారణంగా నీరు అందించలేకపోయారన్నారు. కొన్ని రోజులుగా మోటార్లు కాలిపోవడం ఇతరత్రా కారణాలతో ప్రజలకు

అసౌకర్యం కలిగిన మాట వాస్తవమేనన్నారు. అందువల్లే నీరు కలుషితంగా సరఫరా అయ్యాయని, ఇది తాత్కాలికం మాత్రమేనన్నారు. పైప్‌లైన్‌ పనులు రెండేళ్లలో పూర్తి కావాల్సి

ఉన్నా ఇప్పటికీ కొనసాగుతున్నాయని, త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. పది రోజుల్లో నగరమంతా పారిశుద్ధ్య చర్యలు చేపడతామని అన్నారు. ప్రస్తుతం ట్యాంకులు

నిర్మించిన ప్రాంతాల్లో ఆక్రమణలకు గురికాకుండా పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో ఇప్పటికే ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించి స్వాధీనం

చేసుకుంటామన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తామన్నారు. నగరంలో కొందరు అనర్హులు పింఛన్లు పొందుతున్నారని, విచారణ చేసి తొలగిస్తామని

చెప్పారు. పింఛన్ల విషయంలో కొందరు అక్రమాలకు పాల్పడ్డారని, అలాంటి అవినీతి అధికారులపై కమిషనర్‌ ప్రశాంతి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అవినీతి రహిత

పాలనకు, అనంత నగరం అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం ఉందన్నారు. అప్పుడే అనంతను సుందర నగరంగా తీర్చిదిద్దగలమన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన

హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam