DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరూ  ఆరోగ్యంగా ఉండడమే పోషణ్ అభియాన్ 

ఆరోగ్యం, పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించాలి

అనకాపల్లి ఎంపి డా. బి. వి. సత్యవతి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) :

దేశంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే పోషణ్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశమని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి. వి. సత్యవతి పిలుపునిచ్చారు.

పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమానికి ఆమె

ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వృత్తిపరంగా వైద్యురాలు కావడంతో ఆరోగ్య రక్షణపై, పౌష్టికాహారం తీసుకునే విధానం పై అందరికీ అవగాహన కల్పించాలని అంగన్వాడి

కార్యకర్తలకు సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లు గా అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం పై అవగాహన కలిగించుకో వాలన్నారు. దేశంలో

ఉన్న 130 కోట్ల జనాభా లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే పోషణ్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. స్త్రీలు చదువుకొని విజ్ఞానవంతులు

 à°•à°¾à°µà°¾à°²à°¨à±à°¨à°¾à°°à±. గ్రామీణ, గిరిజన ప్రాంతాల మహిళలకు తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం గురించి  à°¤à±ƒà°£à°§à°¾à°¨à±à°¯à°¾à°²à±, ఆకుకూరలు,  à°ªà°³à±à°³à± వాటిలో à°—à°² పోష కాల గురించి తెలియ

జేయాలన్నారు.

జెసి 2 ఎన్. వి. సూర్యకళ మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి

వేయి రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు ఆసుపత్రి ప్రసవాలు, తల్లిపాలు పట్ల, రక్తహీనత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత,

పౌష్టికాహారం తీసుకునే విధానం గురించి అవగాహన కల్పించాలన్నారు
జిల్లా అడల్సెంట్ రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ వై సునంద మాట్లాడుతూ స్త్రీలు

పౌష్టికాహారాన్ని తప్పక తినే విధంగా వారికి నచ్చచెప్పాలని, పౌష్టికాహార తయారీలో మెళకువలు నేర్చుకోవాలని చెప్పారు. బొప్పాయి, గోధుమ, బెల్లం, చోడి, మునగాకు, చిన్న

చేపలు మొదలైన వాటి ఉపయోగం గూర్చి అందరూ తెలుసుకోవాలన్నారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు ఎన్. సీతామహాలక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు మూడు సంవత్సరాలు

నిండే వరకు సంపూర్ణ  à°†à°¹à°¾à°°à°‚ అందజేయాల్సి ఉంటుంది అన్నారు.  à°¸à±à°¤à±à°°à±€à°²à± ముఖ్యంగా గర్భిణులు రక్తహీనత బారిన పడకుండా కార్యకర్తలు తగిన జాగ్రత్తలు చెప్పాలన్నారు.

 à°µà°¾à°°à°¿à°²à±‹ ఉన్న భయాన్ని పోగొట్టాలన్నారు. బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహార వాడకం వలన కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. బాలామృతం, అమృత హస్తం, à°—à°¿à°°à°¿

గోరుముద్దలు, బాల సంజీవని, అక్షయపాత్ర, గిరి పోషణ, నగర పోషణ మొదలైన కార్యక్రమాల ద్వారా జిల్లాలో గర్భిణులు, బాలింతలు, బాలలు, కిశోర బాలికలకు అందజేస్తున్న

పౌష్టికాహార వివరాలను గూర్చి తెలియజేశారు.
అంతకు ముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనారోగ్య కారణాలతో గర్భం నిలవని గృహిణికి వైద్య

సలహాలు పౌష్టికాహార వాడకం ద్వారా తల్లి అయ్యే అవకాశం కల్పించడం, ఆరోగ్యం గా జీవించే లా సహకరించిన అంగన్వాడీ కార్యకర్త విజయ గాధను వారిరువురి చేత చెప్పించారు.
/> ఈ కార్యక్రమంలో మెప్మా పథక సంచాలకులు సరోజిని, స్త్రీ ఆరోగ్యం అదికారిణి డా. ఉమావతి, ఆడపిల్లల అభివృద్ధి అధికారిణి రాజేశ్వరి, డాక్టర్ వి. సోనీ, డాక్టర్ సీత, జిల్లా

బాల సంరక్షణ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam