DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి – ఉపముఖ్యమంత్రి శ్రీవాణి

ఉగాది నాటికి ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు : మంత్రి  à°§à°°à±à°®à°¾à°¨. . .  

గిరిజన ప్రాంతంలో విద్యకు ప్రాధాన్యత: కలెక్టర్ నివాస్ .. .

విద్యార్ధుల నైపుణ్యాలను

పెంపొందించాలి: ఎమ్మెల్సి మాధవ్ . ..

DNS రిపోర్ట్: SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) . . . 

శ్రీకాకుళం, సెప్టెంబరు 11 ,2019 (DNS Online ): గిరిజన సంక్షేమంపై రాష్ట్ర

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

శ్రీవాణి, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ బుధ వారం సీతంపేట ఐటిడిఏ సమావేశ మందిరంలో జరిగిన 76వ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ పాలక మండలి

సమావేశంలో పాల్గొన్నారు. ఐటిడిఏ ప్రాంగణంలోకి చేరుకున్న మంత్రులకు జిల్లా కలెక్టర్ జె నివాస్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.ఎం.సాయికాంత్ వర్మ, గిరిజనలు పెద్ద

ఎత్తున ఘనస్వాగతం పలికారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. మంత్రులు, శాసన సభ్యులు అడవి తల్లి విగ్రహానికి పూలమాలలంకరణ చేసారు. అనంతరం జరిగిన పాలక

మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఉప ముఖ్య మంత్రి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు చెప్పిన సమస్యలను ముఖ్య మంత్రి  à°¦à±ƒà°·à±à°Ÿà°¿à°•à°¿ తీసుకువెళ్లామని చెప్పారు.

గిరిజన వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న కుక్, కమాటీల నియామకానికి ముఖ్య మంత్రి ఆదేశాలు జారీ చేసారని ఆమె పేర్కొన్నారు. గిరిజన పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీ ల

సమస్యను పరిశీలిస్తున్నామని తెలిపారు. నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న గిరిజన పంచాయతీలను షెడ్యూల్ ఏరియాలో చేర్చుటకు గిరిజన సలహా మండలిలో చర్చించి తీర్మాణాన్ని

కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. ఐటిడిఏ ప్రాంతంలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఏకలవ్య పాఠశాలల్లో

అర్హులనే నియమించాలని ఆదేశించారు. డెప్యూటషన్ లో ఉన్న ఉపాధ్యాయులను వెనుకకు పంపించాలని అన్నారు. గిరిజన బాలికలకు ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయాలని సభ్యుల

కోరికకు స్పందిస్తూ సి.ఎం దృష్టిలో పెడతామన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయుటకు దృష్టి సారించిందని అన్నారు. వై ఎస్.ఆర్ పెళ్లి కానుక అర్హత కలిగిన

వారికి వాలంటీర్లు ద్వారా అందించాలని ఆదేశించారు. వసతి గృహాల్లో చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, సమయానుసారం పరీక్షలు నిర్వహించాలని

ఆదేశించాలి. గిరిజన వసతి గృహాలలో మహిళలను మాత్రమే సంక్షేమ అధికారులుగా నియమించాలని పేర్కొన్నారు. మహిళలు లభ్యంగా లేనపుడు 50 ఏళ్లు దాటిన పురుషులను నియమించవచ్చని

తెలిపారు. జవహర్ నవోదయ పాఠశాలల ఏర్పాటు, హెల్త్ వాలంటీర్ల అంశాన్ని సీఎం దృష్టిలో పెడతామని పేర్కొన్నారు. విద్యా సంస్థలు, వసతి గృహాలను తరచూ తనిఖీ చేయాలని,

సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో మంజూరైన పనులను పరిశీలించుటకు ప్రస్తుతం కొన్ని పనులను నిలుపుదల చేయడం జరిగిందని,

పరిశీలన అనంతరం మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. పోడు వ్యవసాయానికి ఉపాధి హామీ

అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్రంలోనే మొదటిసారిగా వాటర్ గ్రిడ్ మంజూరు జరిగిందని ఉప ముఖ్య మంత్రి అన్నారు. గిరిజన

ప్రాంతాల్లో పనిచేయుటకు ముందుకు వచ్చే వైద్యులకు ప్రోత్సాహకాలు అందించుటకు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. ప్రజాప్రతినిధులు చెప్పిన సమస్యలు పరిష్కారానికి

కృషి చేస్తామని అన్నారు. రూ. 4988 కోట్లు గిరిజన సబ్ ప్లాన్ కు కేటాయింపు చేసామని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అన్నారు. ప్రభుత్వం అమ్మ ఓడి కార్యక్రమం

ప్రవేశ పెట్టి చిన్నారులను బడికి పంపే తల్లులకు రూ.15 వేలు అందించే కార్యక్రమం జనవరిలో ప్రారంభం అవుతుందని అన్నారు. ఉన్నత చదువుకు పూర్తి పీజు రీయింబర్స్మెంట్

తోపాటు విద్యార్ధులకు నిర్వహణ ఖర్చులకు రూ.20 వేలు అందించుటకు ముఖ్య మంత్రి నిర్ణయించారని పుష్ప శ్రీవాణి చెప్పారు. అక్టోబరు నుండి రైతు భరోసా పథకం క్రింద

రైతులకు రూ.12,500 అందిస్తున్నామని అన్నారు. గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న కమ్యూనిటి హెల్త్ వర్కర్ లకు రూ.400 నుండి రూ.4 వేలకు గౌరవ వేతనాన్ని పెంపుదల చేసామని అన్నారు.

వాలంటీర్లు ఇంటికే ప్రభుత్వ పథకాలు అందిస్తారని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేని గ్రామాలకు 5 సంవత్సరాలలో రహదారులు నిర్మిస్తామని అన్నారు. ట్రైబల్

సబ్ ప్లాన్ పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. పాడేరులో వైద్య కళాశాలను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఐటిడిఏ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

ఏర్పాటుకు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. గిరిజన ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లో పాఠశాలల రూపురేఖలు మార్పు చేయుటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని

చెప్పారు. పాఠశాలల్లో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని అన్నారు.

ఉగాది నాటికి ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు : మంత్రి  à°§à°°à±à°®à°¾à°¨. . .  
   à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు, భవనాల శాఖ

మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక ప్రాధాన్యత అంశాలను చేపడుతోందని అన్నారు. గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని ప్రభుత్వం

కేంద్రీకరించిందని చెప్పారు. గిరిజన ప్రాంతంలో అన్ని ఆవాసాలకు రహదారులకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఉగాది నాటికి ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్థలాలు మంజూరుకు

చర్యలు చేపట్టామని అన్నారు.

గిరిజన ప్రాంతంలో విద్యకు ప్రాధాన్యత: కలెక్టర్ నివాస్ .. .
ఐటిడిఏ ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ గిరిజనుల

సమస్యల పరిష్కారానికి పాలక మండలి సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్నామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ

పరిధిలో విద్యా సంస్థల్లో 21929 మంది విద్యాభ్యాసం చేస్తున్నారని, గత పదవ తరగతిలో 91.36 శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని అన్నారు. రూ.1.50 కోట్ల ను పోస్ట్ మెట్రిక్, రూ.3.90

కోట్లను ప్రీ మెట్రిక్  à°‰à°ªà°•à°¾à°° వేతనాలుగా చెల్లించడం జరిగిందని వివరించారు. జగ్జీవన్ జ్యోతి పథకం క్రింద 26,252 మందికి 200 యూనిట్స్ కంటే తక్కువ వినియోగదారులకు ఉచిత

విద్యుత్ కల్పిస్తున్నామని అన్నారు. సూపర్ 60 బ్యాచ్ ఏర్పాటు చేసి ఐఐటిల్లో ప్రవేశానికి శిక్షణ కార్యక్రమం ప్రారంభించామని, సమృద్ధి సీతంపేట క్రింద ఉపాధి కల్పన

చర్యలు ప్రారంభించామని అన్నారు. ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించి 205 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. సీతంపేటలో 30 ఎకరాల్లో గిరిజనులకు పారిశ్రామిక పార్కు

ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో 29 గ్రామాలకు రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, 41 పాఠశాలలకు రూ.5.89 కోట్లతో ప్రహారీ గోడలు

నిర్మిస్తున్నామని చెప్పారు. గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. పాలకొండలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రభుత్వం మంజూరు చేసిందని,

సీతంపేట, కొత్తూరు సిహెచ్ సిల స్ధాయి మెరుగుకు చర్యలు చేపడతామని అన్నారు. నాన్ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన గ్రామాలను షెడ్యూలు ఏరియాలో చేర్చాలని కేంద్ర

ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదనలు సమర్పించామని వివరించారు. ఏకలవ్య పాఠశాలల్లో అర్హత కలిగిన గిరిజనులు లభ్యం కానప్పుడే ఇతరులకు అవకాశం కల్పించడం జరిగిందని

అన్నారు. అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సమస్య లేదని, స్థలం సమస్య ఉన్న చోట్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్పారు.

విద్యార్ధుల నైపుణ్యాలను

పెంపొందించాలి: ఎమ్మెల్సి మాధవ్ . ..
 à°¶à°¾à°¸à°¨ మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విద్యపై మరింత దృష్టి పెట్టాలని కోరారు. గిరిజన విద్యార్ధుల

నైపుణ్యాలను పెంపొందించాలని అందుకుగాను ఉపాధ్యాయులలో ప్రమాణాలు మెరుగు పడాలని సూచించారు. వసతి గృహాలు, గిరిజన గ్రామాల్లో గల నీటి పథకాలను సమయానుసారం

శుభ్రపరచాలని ఆయన అన్నారు. ఆహారంలో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. జవహర్ నవోదయ పాఠశాలలను నెలకొల్పుటకు ప్రభుత్వాన్ని కోరాలని తద్వారా అవకాశం

ఉంటుందని అన్నారు. జూనియర్ కళాశాలల్లో పోస్ట్స్ భర్తీ జరగాలని తద్వారా స్ధానికంగా మంచి విద్యను పొందగలరని చెప్పారు. జిసీసీ శ్రీకాకుళం జిల్లాపై దృష్టి

పెట్టాలని అన్నారు. ఐటీడీఏలో జిసిసి స్టాల్ ఏర్పాటు చేయాలని, ఆగ్రో ప్రాసెస్సింగ్ యూనిట్స్ పెట్టాలని సూచించారు.

పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి

మాట్లాడుతూ వసతి గృహాలలో కుక్ లు, కమాటీల పోస్టులను భర్తీ చేయాలన్నారు. గత 30 ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో గల పంచాయతీలను షెడ్యూల్ ఏరియాలో కలపక పోవడంతో గిరిజనులు

ఉద్యోగాల్లో నష్టపోతున్నారని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ఏకలవ్య పాఠశాలల్లో గిరిజనేతరులను నియమించారని, ప్రస్తుత నోటిఫికేషన్ లో అన్ని పోస్టుల భర్తీకి

నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. గ్రామాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు తెలిపే ఏర్పాట్లు చేయాలని కోరారు. నాంది కార్యక్రమంలో పౌష్టికాహారం అందిస్తున్నారని

దానిని పూర్తిగా గిరిజన స్వయం సహాయక బృందాల ద్వారా చేపట్టుటకు చర్యలు చేపట్టాలని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ డిడి, డిప్యూటీ డిఇఓల అధికారాల మధ్య సమన్వయం లేదని

ఆమె పేర్కొన్నారు. సీఆర్టీ ల భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని, వాటిపై చర్యలు చేపట్టాలని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి పనులను గ్రామీణ నీటి సరఫరా

విభాగానికి అప్పగించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు అడిగిన పనులకు కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఉమ్మరవల్లి వంటి రహదారులు ఆవశ్యం ఉందని ఎంతో కాలంగా

కోరుతున్నప్పటికి ఆ పనులను చేపట్టలేదని అన్నారు. పొల్ల, అచ్చిబాతో పాటు మరో 2 ఆర్ అండ్ బి రహదారులను వెంటనే పూర్తి చేయుటకు ఆర్ అండ్ బి మంత్రి దృష్టి సారించాలని

కోరారు. గిరిజన నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి సేవలు వినియోగించుకోవాలని సూచించారు. గిరిజన యువత గతంలో చేపట్టిన కాంట్రాక్టు పనుల బకాయిలు చెల్లించు ఏర్పాట్లు

చేయాలని ఆమె అన్నారు. పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ సమన్వయంతో పనులు చేయాలని అన్నారు. ఆసుపత్రుల్లో జరిగిన నియామకాలను పరిశీలించాలని ఆమె కోరారు. వీరఘట్టాం

మండల కేంద్రం ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని కోరారు.
 
మందసలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే సీదిరి 
పలాస శాసన సభ్యులు డా.సీదిరి అప్పలరాజు

మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో గిరిజన జనాభా అధికంగా ఉందని అచ్చట సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మందసలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.

నియోజకవర్గంలో సాంకేతిక విద్యా సంస్థ ఏర్పాటు చేయాలని అన్నారు. షెడ్యూల్ ఏరియాలో లేని గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక జి.ఓ ద్వారా గిరిజనులకె అవకాశాలు

కల్పించాలని సూచించారు. నియోజకవర్గంలో14 రహదారులు మంజూరు చేశారని కృతక్షతలు తెలిపారు. పలాసలో గిరిజన భవన్ నిర్మాణానికి అర ఎకరా కేటాయించాలని కోరారు. గౌడు గురండి

గ్రామం కోతకు గురి అవుతుందని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, లేదా గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని కోరారు. అంబటి కంబారం - తుంబ గ్రామాల మధ్య

బ్రిడ్జి నిర్మించాలని తద్వారా అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం లభిస్తుందని అన్నారు.
 à°ªà°¾à°¤à°ªà°Ÿà±à°¨à°‚ శాసన సభ్యులు రెడ్డి శాంతి మాట్లాడుతూ గిరిజన బాలికలకు

ప్రత్యేకంగా నర్సింగ్ వంటి కోర్స్ లను ప్రారంభించడం ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. నియోజకవర్గంలో 40 రహదారి పనులకు నిధులు మంజూరు చేయాలని, ఉపాధి హామీ పథకంలో

పోడు వ్యవసాయంకు సహకరించాలని కోరారు. అంగన్వాడీ భవనాలు ప్రమాదకరంగా ఉందని వాటి స్ధానంలో నూతన భవనాలను నిర్మించాలని చెప్పారు.
 à°°à°¾à°œà°¾à°‚ శాసన సభ్యులు కంబాల

జోగులు మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో గిరిజన గ్రామాల్లో రహదారులు, ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరారు.
 à°—ిరిజన సహకార సంస్ధ (జిసిసి) మేనేజింగ్ డైరక్టర్

టి.బాబూ రావు నాయుడు గిరిజన ప్రాంతాల్లో డీలర్లు అందరూ గిరిజనులే అన్నారు. జిసిసి టెండర్లలో కొంత మంది కలయిక వలన లోపాలు ఏర్పడి నట్లు గుర్తించామని వాటిని

సరిదిద్దుటకు చర్యలు చేపట్టామని తెలిపారు. జిసిసి ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయుటకు చర్యలు చేపడతున్నట్లు ఆయన చెప్పారు.
 à°à°Ÿà°¿à°¡à°¿à° ప్రాజెక్టు అధికారి

సి.ఎం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో 1239 గ్రామాల్లో 30 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం ద్వారా అన్ని గ్రామాలకు రహదారులు కల్పించిన మొట్టమొదటి

ఐటిడిఏగా సీతంపేట అవతరిస్తుందని అందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. గతంలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన రహదారులకు రూ.24 కోట్ల మేర బకాయిలు చెల్లించాలని

వాటిని విడుదల చేయాలని కోరారు.
 à°¸à±€à°¤à°‚పేట లో జిసిసి ద్వారా అనాస, పసుపు ఉత్పత్తులకు విలువ ఆధారిత జోడించి బ్రాండింగ్ ద్వారా మార్కెట్ చేయుటకు యూనిట్ ను

నెలకొల్పుతుందని చెప్పారు. చిన్న పిల్లల చాకోలేట్ యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు జిసిసి వద్ద ఉన్నాయని చెప్పారు.

గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక

ఇంజినీర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో అన్ని ఆవాసాలకు రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించుటకు రూ.32.50 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేసామన్నారు.

జిల్లాలో రూ.3672 కోట్లతో  à°µà°¾à°Ÿà°°à± గ్రిడ్ కు ప్రతిపాదనలు సమర్పించామని ఇందులో పాతపట్నం నియోజకవర్గానికి రూ.480 కోట్లు, పాలకొండ నియోజకవర్గంకు రూ.207 కోట్లు, రాజాం

నియోజకవర్గంకు రూ.320 కోట్లు ప్రతిపాదనలలో ఉన్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా పాలకొండలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేసినందుకు పాలక మండలి సమావేశంలో

ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానించారు.

పాలక మండలలి సమావేశానికి విచ్చేసిన మంత్రులు ఐ.టి.డి.ఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన

వివిధ స్టాల్స్ ను సందర్శించారు. రూ.160 లక్షల నాబార్డు నిధులతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవన నిర్మాణానికి, రూ.3224.03 లక్షల ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో

చేపడుతున్న గిరిజన ఉప ప్రణాళిక ప్రాంతంలో రహదారులు,పాఠశాలలకు ప్రహరీ గోడలు,సి.సి.కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. రూ.80 లక్షల నిధులతో గిరిజన సహకార సంస్ధ

డివిజినల్ మేనేజరు కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్సు సముదాయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. గిరిజన లబ్దిదారులుకు వివిధ పథకాల క్రింద ఆటోలను, చెక్కులను పంపిణీ

చేసారు.

పాలక మండలి సమావేశంలో సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, డివిజనల్ అటవీ అధికారి సందీప్, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కమల, జిల్లా విద్యా శాఖ అధికారి

కె.చంద్ర కళ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ హెచ్.కూర్మారావు, ఐసిడిఎస్

జయదేవి, జిల్లా సహకార అధికారి కె.వెంకటరావు, పశుసంవర్దకశాఖ సంయుక్త సంచాలకులు ఏ.ఈశ్వర రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు ఆర్.వి.వర ప్రసాద రావు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam