DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జిల్లాను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా వృద్ధి చేస్తాం : అవంతి

రూ. 210 లక్షలతో క్రీడా వికాస కేంద్రం ప్రారంభం  

పర్యాటక, క్రీడల శాఖా మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్

అనంతపురం). . .

అనంతపురం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): అనంతపురం జిల్లాను ఆధ్యాత్మికంగానూ,  à°ªà°°à±à°¯à°¾à°Ÿà°• పరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,

యువజన మరియు క్రీడల సంక్షేమ శాఖా మాత్యులు ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఉదయం పెనుకొండలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎం.

శంకర నారాయణ  తో కలిసి 210 లక్షలతో నిర్మించిన వైయస్సార్ క్రీడా వికాస కేంద్రాన్ని,మడకశిరలో కోటి రూపాయల ఖర్చుతో నిర్మించిన యాత్రికుల సౌకర్యాల కేంద్రాన్ని, సేవా

గడ్ దగ్గర పర్యాటకులకు వసతి కల్పించడానికి 250 లక్షలతో నిర్మించిన వసతి గృహాలు, వంటగది తో క్యాంటీన్ తదితరములకు చెందిన శిలాఫలకాలను ప్రారంభించారు. అనంతరం ఇండోర్

స్టేడియం ను మంత్రులు ప్రారంభించారు. 
క్రీడా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కోర్టులు, అథ్లెటిక్ ట్రాక్ లను మంత్రులుపరిశీలించారు. 
అక్కడే ఏర్పాటు చేసిన సభలో

మంత్రి అవంతిశ్రీనివాస్ మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రాముఖ్యత కల్గిన పెనుకొండ లో క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించడం తన అదృష్టమని మంత్రి తెలిపారు.

జిల్లాలో4స్టేడియంలున్నాయని ,మడకశిర, రాయదుర్గం, ఉరవకొండ, సి.కె.పల్లి,కనగాణపల్లె, కొత్తచెరువు ప్రాంతాల్లో క్రీడా వికాస కేంద్రాలు నిర్మాణం లో ఉన్నాయన్నారు.

స్థానిక ఎమ్మెల్యే లు క్రీడలు, పర్యాటక అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా జాతీయ

క్రీడలలోరాష్ట్రంతరపున  à°¬à°‚గారు, వెండి, కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులకు ఐదు, మూడు,రెండు లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం

అందించిందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మణిక్యాలుగా ఉన్న క్రీడాకారులను గుర్తించి ప్రోత్సాహమందిస్తామన్నారు.జిల్లా కలెక్టర్ ప్రతిభ కలిగిన

క్రీడాకారుల జాబితాను ప్రభుత్వం నకు పంపిస్తే ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా, అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అనంతపురం

జిల్లా చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు.పెనుకొండ కోట, గగన్ మహల్, లేపాక్షి, హైమావతి,లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, తిమ్మమ్మ మర్రిమాను, సేవాఘడ్,

రామలింగేశ్వర స్వామి ఆలయం, మురిడీ ,నేమకల్లు,కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయాలు,పుట్టపర్తి తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ అనంతపురం, పుట్టపర్తి లను రెండు

పర్యాటక సర్క్యూట్ లుగా విభజించి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. ఆ ప్రతిపాదనలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వనిధులతో అమలు

చేస్తామన్నారు. ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి  à°ªà°¦à°µà±à°²à± కల్పించారన్నారు. 
/> అసెంబ్లీ  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ 14 రోజుల్లో 19 బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేదలకు అందే పథకాలకు ప్రాముఖ్యత ఇచ్చి అమ్మ à°’à°¡à°¿ ద్వారా 15 వేల సాయం ,మూడువేల రూపాయలకు

పింఛన్ పెంపు, స్థానికంగా పరిశ్రమల్లో 70 శాతం మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు.  à°…వినీతికి వ్యతిరేకంగా, పారదర్శకంగా పాలన

అందిస్తున్నారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ , ఆరోగ్య శ్రీ, మద్యపాన నిషేధం  à°¦à±à°µà°¾à°°à°¾ ప్రజారంజకంగా ముఖ్య మంత్రి పరిపాలన సాగిస్తుంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం

వైఫల్యం చెందారని విమర్శించడం శోచనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రతిపక్ష నాయకుని కి మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లాను క్రీడ , పర్యాటక

పరంగా అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం గగన్ మహల్, పెనుకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఇచ్చే విధంగా ట్అభివృద్ధి చేసేందుకు

ముందుకు వస్తున్న ఇస్కాన్ సంస్థ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అందుకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించిన అనుమతులన్నీ త్వరితగతిన

ఇస్తామన్నారు. బెంగళూరు శాఖ ప్రతినిధి మధు పండిత్ దాస్ బృందం 12 ఎకరాల లో రెండవ తిరుమల గా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రికి తెలిపారు. కోటలో ఆలయ అభివృద్ధికి

ప్రభుత్వ పరంగా పూర్తి సహకారాన్ని అందిస్తామని మంత్రి వారికి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు

చేస్తోందనివెనుకబడిన తరగతుల శాఖా మంత్రి ఎం.శంకర నారాయణ తెలిపారు.వాటితో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాల

వారితో పోటీ పడే విధంగా జిల్లాలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులకు శిక్షణ ఇస్తామన్నారు. లేపాక్షి ,పెనుగొండ, హైమావతి, కసాపురం తదితర ప్రాంతాలను పర్యాటక

ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరంగా

ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశమని తెలిపారు. శారీరకంగా ,దృఢంగా ఉండాలంటే  à°šà°¿à°¨à±à°¨à°ªà±à°ªà°Ÿà°¿à°¨à±à°‚à°šà°¿  à°•à±à°°à±€à°¡à°²à°ªà±ˆ మనసు లగ్నం చేయాలన్నారు. క్రీడలలో బాగా రాణించి

శారీరకంగా ,దృడంగా ఉంటే పోలీసు ,సైనిక విభాగాలలో ఉద్యోగాలు సాధించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర

ముఖ్యమంత్రి జనరంజక పాలన అందిస్తున్నారని నవరత్నాలలో పేర్కొన్న   అంశాలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు .జిల్లాకు మరిన్ని ఫ్యాక్టరీలు తీసుకురావాలని

మంత్రిని కోరారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రక రకాల ఒత్తిడులను అధిగమించాలంటే క్రీడలు చాలా అవసరమని తెలిపారు. క్రీడల ద్వారా ఆత్మవిశ్వాసం,

సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నారు .జిల్లాలోని విద్యార్థినీ, విద్యార్థులను ఎంపిక చేసి స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా శిక్షణ ఇప్పించాలన్నారు.

ఇలాంటి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ

పెనుగొండ, రాయదుర్గం జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్నాయన్నారు. జిల్లాలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారని వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ఇలాంటి క్రీడా

వికాస కేంద్రాలు దోహద పడతాయని అన్నారు .క్రీడాకారులు ,విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ,ప్రోత్సాహం అందిస్తే అద్భుత విజయాలు సాధిస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి

ఉద్దేశమన్నారు. ఒక కోటి రూపాయలతో మడకశిరలో టూరిజం హోటల్ ప్రారంభించారని, కర్ణాటక సరిహద్దుగా ఉన్న రత్నగిరి మడకశిర కోటలు ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలుగా

గుర్తింపు కలిగి ఉందని, మడకశిర కోటకు రోప్ వే ఏర్పాటు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతపురం శాసన సభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు

ఆరోగ్యంగా ఉండాలని 6ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.ఈ ప్రాంత విద్యార్థులు,

క్రీడాకారులు ఇండోర్ స్టేడియం ని ఉపయోగించు కోవాలని అన్నారు .వారసత్వ సంపద కలిగిన జిల్లాలో పర్యాటక పరంగా తీర్చిదిద్దాలని కోరుతున్నానన్నారు.
/> కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజానికి ఆటలు అవసరమన్నారు .ఆటలు ఆడేవారి మానసిక పరిస్థితులు

బాగుంటాయన్నారు.ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం  à°šà±‡à°¯à°¾à°²à°¨à±à°¨à°¾à°°à±.క్రీడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పెనుగొండ నియోజకవర్గ పరిసర

ప్రాంతాల్లో 365 ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయని, పెనుగొండ దర్గా ,కోట ,కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, తిమ్మమ్మ మర్రిమాను, తాడిపత్రి చింతల వెంకటరమణ స్వామి, బెలూం

గుహలు ,రాయదుర్గంలోని శ్రీనివాస ఆలయం ,నెట్టికంటి , మురిడి. ఆంజనేయస్వామి ఆలయాలు ,ఆలూరు దర్గా లాంటి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు జిల్లాలో ఉన్నాయి అన్నారు .వాటికి

పర్యాటక పరంగా ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా వసతులు కల్పించాలని మంత్రికి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్

సిద్ధారెడ్డి, టూరిజం శాఖ ఈ డి వై సత్యనారాయణ ,రీజినల్ డైరెక్టర్ ఈశ్వరయ్య, జిల్లా పర్యాటక అధికారిణిి విజయలక్ష్మి ,హౌసింగ్ పీడీ చంద్రమౌళీశ్వర రెడ్డి ,గఆన్సెట్

 à°¸à°¿.à°ˆ. à°“.త్రినాధ రావు, ఆర్డిఓ శ్రీనివాస్, క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ జగన్నాథ రెడ్డి, వివిధ శాఖలకు   చెందిన అధికారులు అధికారులు ప్రజాప్రతినిధులు

విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam