DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి నిర్మూలనపై చైతన్యం పై సౌకత్ అలీ సేవలు భేష్

సామాజిక కార్యకర్త సౌకత్ అలీ à°•à°¿ అభినందనలు 

అనంతపురం ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). . .

అనంతపురం,

సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): పెనుకొండ వాస్తవ్యులు, సామాజిక కార్యకర్త అయిన సౌకత్ అలీ పదవీ విరమణ చేశాక దశాబ్దకాలంగా అవినీతి నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం

తీసుకొస్తుండటం ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అభిప్రాయపడ్డారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో సామాజిక కార్యకర్త,

అవినీతి నిరోధక సామాజిక అవగాహన సంస్థ వ్యవస్థాపకుడు సౌకత్ అలీని శాలువాకప్పి సత్కరించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... అవినీతి నిర్మూలనలో ప్రజల పాత్ర

కీలకమన్నారు. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి లంచం అడిగే వారిపై ఫిర్యాదు చేయాలని... ఈదిశగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సౌకత్ అలీ సేవలు ప్రశంసనీయమన్నారు. సౌకత్

అలీ కానిస్టేబుల్ à°—à°¾ పని చేసి 2009 సంవత్సరంలో  à°ªà°¦à°µà±€ విరమణ చేశాడన్నారు. విశ్రాంత సమయంలో ప్రజా సేవ చేయడం అభినందనీయమన్నారు. ఈయన సామాజిక సేవలు గుర్తించి నాలుగు

సార్లు రివార్డులు అందజేశారని కొనియాడారు. ఈసన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె చౌడేశ్వరి, విశ్రాంత పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పరంధాముడు,

కార్యదర్శి భీమప్ప, కోశాధికారి ఆంజినేయులు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam