DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్పందన ఆర్జీలకు స్పష్టమైన జవాబివ్వాలి:కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): స్పందనలో వచ్చే ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి,

స్పష్టమైన సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల అధికారులతో కలెక్టర్ వీడియో

కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో అందిన ఆర్జీలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, పంపించే సమాధానం విధిగా చదవాలని ఆదేశించారు.

భూములకు సంబంధించిన సమస్యలకు సర్వేయర్ స్వయంగా పరిశీలించి రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని అన్నారు. భూమి సమస్యల పరిష్కారంతోనే ప్రజల్లో సంతృప్తి

చూడగలమని,ఆర్జీలు సమర్పించే ప్రతీ ఒక్కరికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. మండలాల్లో ఆర్జీదారులకు  à°¸à°®à°¾à°šà°¾à°°à°‚ను ఏవిధంగా పంపించారో తెలియజేయాలని

కలెక్టర్ ఆదేశించగా మండల అధికారులు చదివి వినిపించారు. మండల ప్రత్యేక అధికారులు ఆర్జీదారుకు పంపించే సమాధానం ముఖ్యంగా భూములకు సంబంధించిన సమాధానం విధిగా

చూడాలని అన్నారు.ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత ప్రత్యేక చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించాలని, జిల్లా కలెక్టర్

కార్యాలయంలోనూ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రొటీన్ పనిగా చేయరాదని ప్రత్యేక విధానంలో నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు.అక్టోబరులో ప్రతీ మండల

అధికారిని అమరావతికి పిలిచి స్పందన వివరాలు ప్రభుత్వం అడగనుందని, అందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన పరిష్కారం చూపి జిల్లా

ఆదర్శప్రాయంగా ఉండేటట్లు పని చేయాలని, గ్రామ సచివాలయాల నిర్వహణ, మౌళిక సదుపాయాలపై దృష్టి సారించి, సచివాలయాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు.ఇసుక పై కొత్త జీఓ

వచ్చిందని,ఇసుక కొరకు ఒక యాప్ తయారు చేయడం జరిగిందని తెలిపారు. దీనిని APMDC నిర్వహిస్తుందన్నారు.ప్రజలు వాహనం సంఖ్యతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని,

.స్థానికంగా ఇసుక మంజూరును తహసీల్దార్ చేయాలని సూచించారు.రాజాం, పలాస ప్రాంతాల నుండి ఇసుక కావాలని అడుగుతున్నారని, కావున వాటిని త్వరగా ఏర్పాట్లు

చేయాలన్నారు.వసతి గృహాలకు ఒక ఇంజినీర్ ను బాధ్యులుగా పెట్టామని, ఇంజినీర్లు వసతి గృహం మౌలిక సదుపాయాల కల్పనలో మరింత బాధ్యత తీసుకోవాలని తెలిపారు.వసతి గృహాలకు

సంబంధించిన పనులకు వారంలో అంచనాలు తయారు చేస్తారని, వెంటనే పనులు చేపడతారని తెలిపారు.ప్రత్యేక అధికారులు వసతి గృహాలను పరిశీలించాలని,.వసతి గృహ పరిశీలనకు

వెళ్ళేటప్పుడు ఇంజినీర్ ను కూడా తప్పకుండా తీసుకువెళ్లాలన్నారు.మార్పు స్పష్టంగా కనిపించాలని స్పష్టం చేసారు. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వే జరుగుతుందని, .

వాలంటీర్ల ద్వారా స్పందన రావాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను కోరారు.
   à°ˆ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ à°¡à°¾ కె. శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి

బలివాడ దయానిధి, జిల్లా పరిషత్ సిఇఓ జె. చక్రధర రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జెడ్పీ ఉప సిఇఓ ప్రభావతి, బిసి

కార్పొరేషన్ ఇ డి జి.రాజారావు, ఆర్.డబ్ల్యూ. ఎస్ ఎస్.ఇ టి.శ్రీనివాసరావు, ఆర్.డి.ఓ ఎం.వి.రమణ, డి.పి.ఓ వి.రవి కుమార్, డిప్యూటీ కలెక్టర్లు సీతారామయ్య, జె. జయదేవి, డిఎం హెచ్.ఓ

 à°¡à°¾ à°Žà°‚.చెంచయ్య, వ్యవసాయ శాఖ జెడి బి.జి.à°¡à°¿.ప్రసాద రావు, జిల్లా మలేరియా అధికారి వీర్రాజు, డిసిహెచ్ ఎస్ à°¡à°¾ బి.సూర్యారావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏపీడీలు పి.రాధ,

బి.లక్ష్మీపతి, ఆర్.వి.రామన్ తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam