DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బి.సి గురుకులం లో కలెక్టర్ నివాస్ ఆకస్మిక తనిఖీ 

నిర్వహణలో నిర్లక్ష్యం పై  à°ªà°¿à°¨à±à°¸à°¿à°ªà°²à± కు షోకాజ్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌):

పాతపట్నంలోగల బాలయోగి ఏపి బిసి గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ జె నివాస్ గురు వారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. గురుకులం నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ

ప్రిన్సిపాల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు.  à°‡à°‚దులో భాగంగా గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి వివరాలను ఆరా తీసారు. విద్యార్ధుల సౌకర్యం,

విద్యాబోధన, ఆహార పదార్ధాల నాణ్యత, తాగునీరు, మరుగుదొడ్ల పరిస్ధితి, పరిసరాలు, పరిశుభ్రతను తనిఖీ చేసారు. విద్యార్ధులను, ఉపాధ్యాయులను అన్ని వివరాలు అడిగి

తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు తయారు ఆహార పదార్ధాలను విద్యార్ధులతో కలసి మధ్యాహ్నం భోజనం చేసారు. భోజనం సంతృప్తికరంగా ఉందని విద్యార్ధులు

తెలిపారు. విద్యార్ధులు బాగా చదువుకోవాలని కలెక్టర్ కోరారు. చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా చూడరాదని ఆయన సూచించారు. సమస్యలు తలెత్తితే ఉపాధ్యాయులకు లేదా

అధికారులకు తెలియజేయాలని తెలిపారు. మానసిక రుగ్మతలకు గురి కారాదని, ఆత్మస్ధైర్యం పెంచుకోవాలని, సమస్యలను పరిష్కరించుకునే ఆలోచనలు చేయాలని హితవు పలికారు.

ఆత్మస్ధైర్యం, గుండె ధైర్యం ఉన్నప్పుడే ఉన్నత చదువులతోపాటు ఉన్నత ఆశయాలను సాధించగలమని కలెక్టర్ అన్నారు. అనేక మంది పెద్దలు సమస్యలను అధిగమించి ఉన్నత

స్ధానాలకు చేరారని ఆయన పేర్కొన్నారు. 
చిన్నారులకు ఇంటిలోను, పాఠశాలలోనూ ఎదురయ్యే సమస్యలకు కుంగిపోరాదని పిలుపునిచ్చారు. చదువు, క్రీడల పట్ల దృష్టి సారించాలని

పిలుపునిచ్చారు. క్రీడల వలన శారీరక పటిష్టతతోపాటు మానసిక వికాసం కలుగుతుందని అన్నారు. విద్యార్ధులలో సమస్య పరిష్కార మార్గాలను సూచించాలని, విద్యలో అవకాశాలపట్ల

అవగాహన పెంపొందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. విద్య, క్రీడలు, ఉన్నత అవకాశాల పట్ల అవగాహన వలన మానసికంగా కృంగిపోకుండా ఆశావాహ ధృక్పదంతో ఉంటారని తద్వారా

ఉన్నత చదువులు, అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ప్రామాణిక విద్యతోపాటు, గుణాత్మక విద్యను అందించాలని ఆదేశించారు. నైతిక విలువలు నేర్పాలని

ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాలు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam