DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకుందని... బీజేపీది వాపే , బలమనుకుంటే భ్రమే. . .

ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకుందని...

బీజేపీది వాపే , బలమనుకుంటే భ్రమే. . . 

కనీసం వార్డులో గెలవలేని పార్టీ సీఎం కుర్చీకి ఎసరు

?

విశాఖపట్నం. మే :  à°¬à±€à°œà±‡à°ªà±€ ... అనగానే ఠక్కున గుర్తొచ్చే వివరణ బొత్తిగా జనం లేని పార్టీ. ఇది 2014 వరకూ.  à°…యితే à°ˆ పార్టీకి జీవం పోసింది మాత్రం తెలుగుదేశం పార్టీ

అనడం లో ఏమాత్రం సందేహం లేదు. 2014 లో కూటమి లో భాగం à°—à°¾ తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఏర్పడిన తర్వాత ఆంధ్ర లో  à°ˆ పార్టీకి జీవం వచ్చిందనడం మాత్రం వాస్తవం. 
ఇప్పడి

వరకూ విశాఖ చరిత్ర లో బీజేపీ à°•à°¿ à°’à°• ఎమ్మెల్యే  à°¸à±€à°Ÿà± గెలవడమే క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిచినంత à°—à°¾ భావించారు. అలాంటిది ఒక్క సారిగా విశాఖ నగరం లో పార్టీకి వాళ్ళే

ఊహించలేని మెజారిటీ తో ఒక ఎంపీ సీటు, ఒక ఎం ఎల్ ఏ సీటు తో పాటు ఉత్తరాంధ్రా జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ సీటు లభించడం అంటే ప్రపంచాన్నే గెలిచినట్టు గా మొత్తం పార్టీ

క్యాడర్ బ్రహ్మోత్సవాలే చేసుకుంది. అయితే ఈ విజయం కేవలం బీజేపీ వల్లే సాధ్యం అయ్యిందా అనేది ఏ రోజు ఆలోచించుకోకపోవడం వాళ్ళ స్వయంకృతాపరాధం. అసలు బీజేపీ కి నగర

పరిధి లో గానీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంత క్యాడర్ ఉందొ వ్రేళ్లమీద లెక్క పెట్టవచ్చు. బీజేపీ లో ఉన్న నేతల కుటుంబ సభ్యులే వీళ్లకు ఓటు వేస్తారో లేదో తెలియని

పరిస్థితి. 

ఎమ్మెల్యే గా పూర్తిగా వైఫల్యం చెందిన వ్యక్తిని విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా కె. హరిబాబు ను ఎన్నికల బరి లో నుంచో బెట్టడం అంటేనే బీజేపీ సత్తా

ఏంటో తెలుస్తోంది. అభ్యర్థి గా నిలబడిన హరిబాబే కాదు, ఆయనకి టికెట్ ఇఛ్చిన బీజేపీ పార్టీకే నమ్మకాలు లేని స్థితిలో, తెలుగుదేశం పార్టీ మొత్తం ఈయనకి అండగా నిలబడి

ప్రచారం చేసి, ఏడూ అసెంబ్లీయే నియోజక వర్గాల్లోని ప్రజలను భయపెట్టో, బ్రతిమాలో ఓటు వేయించి అత్యధిక మెజారిటీ తో గెలిపించారు అంటే  à°…తి శయోక్తి కాదు. అలాంటిది

ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ గౌరవ అధ్యక్షురాలిపై నే అత్యధిక మెజారిటీ తో గెలిపించిన తెలుగుదేశం పై రాళ్లు విసరడం అంటే తిన్నింటి వాసాలు

లెక్కపెట్టడమే.

ఇక ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సే à°—à°¾ నిలబడిన పివిఎన్ మాధవ్, కనీసం ఎప్పుడూ à°’à°• వార్డు స్థాయి లో  à°•à±‚à°¡à°¾ గెలిచినా

దాఖలాలే లేవు అనే కంటే నిలబడే సత్తా లేదు అనడం సమంజసం గా ఉంటుంది. అలాంటిది ఉత్తరాంధ్రా మూడు జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గానికి ఎమ్మెల్సీ గా గెలవడం అంటే

ఒక్క గెంతుతో చంద్రమండలానికి ఎక్కెడం లాంటిదే అవుతుంది. 

దాదాపు నాలుగేళ్ల సంసారం పూర్తి చేసిన తర్వాత విడిపోతే భార్య భర్తలు కూడా ఇలా రోడ్డున పడి

కొట్టుకున్నట్టుగా ఎక్కడా లేదు. కానీ తెలుగుదేశం - బీజేపీ లు విడిపోయిన తర్వాత ప్రజా సమస్యలు గాలికొదిలేసి, రోడ్డున పడి వాగ్యుద్దాలు చేసే స్థాయికి

చేరుకున్నారు. ఒకరు సభ పెడితే ఇంకొకరు తిట్టడం, వీరు సభ పెడితే వారు తిట్టడం. స్థాయి మరిచి వ్యాఖ్యలు చెయ్యడం పార్టీల్లో విపరీతం అవుతున్న పట్టింపు లేదు. ఇది నగర

బీజేపీ లో తీవ్ర స్థాయికి చేరింది. ఇటీవల బీజేవైఎం జాతీయ సభ్యుని పై బీజేపీ వైఖరి కూడా పూర్తి విరుద్ధం గా ఉండడం తో రోడ్డున పడి సాక్షాత్ నగర అధ్యక్షులే

వాగ్యుద్దానికి దిగడం నేరుగా టీవీల్లో ప్రసారం అయ్యింది. 

ఒక్క సారిగా మూడు ప్రజా ప్రతినిధి పదవులు రావడం తో అది తమ పార్టీ సత్తాయే అనుకోవడం బీజేపీ కి వాపు

లాంటిదే. ఇక అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీకి ఎన్ని చోట్ల కనీసం డిపాజిట్లు వస్తాయో అంచనాలు కూడా వేయలేని పరిస్థితి. అలాంటిది ఏకంగా రాష్ట్రం లో అత్యధిక

ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అనుకోవడం నిజంగా వాపే అవుతుంది. నగరం లో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులనే వెతికి తెచ్చుకోవాల్సిన

పరిస్థితి వీరే కొనితెచ్చుకున్నట్టుగా ఉంది. అయితే అది బలం అనుకునే స్థాయి లో ఉన్న నగర బీజేపీ, అది వాపు అని తెలుసుకునే సమయానికి పుణ్యకాలం గడిచిపోవచ్చు.
/> తెలుగు దేశం తో విడిపోవడం తమ దురదృష్టం అని సాక్షాత్తు హోమ్ శాఖా మంత్రి రాజనాధ్ సింగ్ భావించారు అంటే బీజేపీ జాతీయ నేతల అభిప్రాయం తెలుస్తోంది. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam