DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ రవాణా అభివృద్ధి లో వైజాగ్ పోర్ట్ పాత్ర భేష్ 

ఎగుమతులు, దిగుమతుల సేవలు అద్భుతం 

 à°¤à±†à°²à°‚గాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . .

విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత

దేశ రవాణా అభివృద్ధి లో విశాఖపట్నం పోర్ట్ పాత్ర కీలకం అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అభిప్రాయం పడ్డారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ను ఆయన

 à°—ురువారం  à°¸à°‚దర్శించారు. ఆయనకు విశాఖపట్నం పోర్టు ట్రస్టు అధికారులు ఘన స్వాగతం పలికారు. à°ˆ సందర్భంగా పోర్ట్ లో జరుగుతున్న ఎగుమతులు దిగుమతుల కు సంబంధించిన

వివరాలను పోర్ట్ అధికారులు మంత్రికి వివరించారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కు వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న యూరియా గురించి మంత్రి పోర్టు అధికారులను

అడిగి తెలుసుకున్నారు. యూరియా దిగుమతి చేసుకోవడం అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలించడం దానికి పట్టే సమయం వంటి అంశాలను మంత్రి పోర్టు అధికారులను అడిగారు

సంధించిన వివరాలు అన్నింటిని పోర్ట్ అధికారులు మంత్రికి వివరించారు. పోర్టులో జరుగుతున్న కార్యకలాపాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా పోర్ట్

అధికారులు సాదరంగా స్వాగతించడం పై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీఎంఈ హరికృష్ణ, ట్రాఫిక్ మేనేజర్ రత్న శేఖర్, పోర్టు డెప్యూటీ చీఫ్ లా ఆఫీసర్

కృష్ణ బాపిరాజు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam