DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంగీత సాధన కు వయసు అవరోధం కాదు: రాఘవాచార్యులు 

సంగీత కచేరీ కేవలం స్వామీ కోసమే అనే భావన తోనే సాగాలి 

పెద్దల బాణీని తప్పక తెలుగుకోవాలి : . . 

సంగీత కచేరీ కేవలం స్వామీ కోసమే.  . . : . . . .

విశాఖ

విద్యార్థులకు అభినవ  à°¤à±à°¯à°¾à°—య్య మెళకువలు     

ఎయు లో  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± బ్రదర్స్ శిక్షణా శిబిరం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). . . 

విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2019

(డిఎన్‌ఎస్‌) : సంగీత సాధన చెయ్యడానికి వయసు అవరోధం కాదు అని జాతీయ సంగీత నాటక ఆడకము పురస్కార గ్రహీత  à°¦à°°à±‚రు రాఘవాచార్యులు  à°¤à±†à°²à°¿à°¯à°šà±‡à°¸à°¾à°°à±. గురువారం ఆంధ్ర విశ్వ

కళాపరిషత్ లో జరిగిన 30 వ వార్షికోత్సవ సభ లో ఆయన కీలక శిక్షణా ప్రసంగం చేసారు. కర్ణాటక సంగీత ప్రపంచంలో హైదరాబాద్ సోదరులుగా ప్రఖ్యాతి గాంచిన ద్వయంలో పెద్దవారు

రాఘవాచార్యులు. అభినవ త్యాగయ్య కొనియాడబడుతున్న వీరు విశాఖ విద్యార్థిని విద్యార్థులకు సాధన చేసే విధానం, పలుకవలసిన విధానంతదితర అంశాలను

తెలియచేసారు. 

సంగీత కచేరీ కేవలం స్వామీ కోసమే.  . . : . . . .  

సంగీత కచేరీ కేవలం స్వామీ కోసమే అనే భావనతోనే చెయ్యాలి తప్ప, సొంతం కోసం అనే భావనే మదిలోకి

రాకూడదు అన్నారు. అప్పుడే స్వరంలో తన్మయత్వం బహిర్గతమవుతుందన్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే సంగీత కళానిధి త్యాగయ్య అని అని తెలియచేసారు.  à°¸à°‚గీత సాధనకు

నిబంధనలు ఉండవని, కేవలం లక్ష్య నిర్దేశమే ఉంటుందన్నారు. 

పెద్దల బాణీని తప్పక తెలుగుకోవాలి : . . .

సంగీత ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉన్నారని, ఎన్నో

నూతన స్వరాలకు శ్రీకారం చుట్టారన్నారు. వారందరి బాణీలను తప్పక తెలుసుకోవాలన్నారు. ఏ విధమైన స్వరం ఎలా పలుకుతుందో తెలుస్తుందన్నారు. శృతి తప్పకుండ,ఆ స్వరాన్ని

పలకడం వలన కొన్ని అనుభూతులు లభిస్తాయన్నారు. ఎందరో అజ్ఞాత వాగ్గేయకారులు చేసిన రచనలు ప్రస్తుతం  à°…ందుబాటులో లేకుండా పోయాయన్నారు. సంగీత సాధకులు కేవలం

అందుబాటులో ఉన్న కృతులను సాధన చేయడంతోనే పరిమితి కాకుండా, పెద్దలు అందించిన సాహిత్యాన్ని వెలికి తీయడం అనే యజ్ఞానికి శ్రీకారం చుట్టాలన్నారు. 

అనంతరం

పలువురు విద్యార్థులతో మాటామంతీ జరిపి, వారికీ ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. à°ˆ సందర్బంగా ముందు తరం సంగీత విద్వాన్సుల గురించి తెలియచేస్తూ, వారు à°šà±‡à°¸à°¿à°¨

రచనలు, నూతన ప్రయోగాలను వివరించారు.  

à°ˆ శిక్షణ శిబిరంలో విశాఖ జిల్లా తో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా విచ్చేసిన యువతీ  à°¯à±à°µà°•à±à°²à±, ఇంజనీర్లు, పరిశోధకులు,

వైద్గ్యులు, సంగీత శిక్షణ సంస్థల అధ్యాపకులు పెద్ద  à°¸à°‚ఖ్యలో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam