DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలికలకు ఆరోగ్యంపై అవగాహన అవసరం 

మహిళా కళాశాల విద్యార్ధులు రక్తదానం

ఉత్సాహంతో రక్తదానానికి వచ్చిన విద్యార్ధినులు

500 మందిలో 25 మంది మాత్రమే రక్తదానంకు అర్హులు

(DNS రిపోర్ట్ : SV

 à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌): బాలికలకు ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన అవసరం అని రెడ్ క్రాస్ చైర్మన్

పి.జగన్మోహన రావు, విశ్రాంత డిప్యూటి కలెక్టర్ పి.రజనీకాంత రావు అన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని శుక్రవారం కళాశాల

ఎన్.ఎస్.ఎస్ యూనిట్లు ఏర్పాటు చేసాయి. రక్తదాన శిబిరంలో  à°•à°³à°¾à°¶à°¾à°² విద్యార్ధులు రక్తదానం చేయుటకు ఉత్సాహంతో ముందుకు వచ్చారు. 500 మంది బాలికలు పాల్గొంటే కేవలం 25 మంది

మాత్రమే రక్తదానానికి అర్హత సాధించారు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువ కారణంగా ఎక్కువ మంది బాలికలు రక్తదానానికి అనర్హులయ్యారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం

అనారోగ్యానికి బాటలు వేయడమేనని రజనీకాంతారావు అన్నారు. ఆరోగ్యం పై శ్రద్ద వహించాలని కోరారు. అందం కంటే ఆరోగ్యం ముఖ్యంమని హితవు పలికారు. బాలికలకు ఆరోగ్యంపై

సంపూర్ణ అవగాహన అవసరం అన్నారు. బాలికలకు రక్తం అవసరమని, భవిష్యత్తులో ఆరోగ్యం దృష్ట్యా అవగాహన పెంచుకోవాలని కోరారు. మహిళల ఆరోగ్యంపై సమాజ ఆరోగ్యం ఆధారపడి

ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఆరోగ్యం పట్ల బాలికలు ఆదర్శంగా ఉండాలని కోరారు.

మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డా కె. శ్రీరాములు మాట్లాడుతూ బాలికల్లో

ఆరోగ్య అవగాహనకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసామన్నారు. సైన్సు విద్యను అభ్యశిస్తున్న విద్యార్ధులతోపాటు ఆర్ట్స్, కామర్స్ విద్యార్ధులు క్రియాశీలక పాత్ర

తీసుకున్నారని తెలిపారు. సైన్సేతర విద్యార్ధులకు అవగాహన కల్పించుటలో భాగంగా రక్తదానంపై చార్టుల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేసామని చెప్పారు. ఎన్.ఎస్.ఎస్ యూనిట్ల

ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

à°ˆ కార్యక్రమంలో  à°•à°³à°¾à°¶à°¾à°² అధ్యాపకులు జ్యోతి ఫ్రెడ్రిక్, ఎన్.ఎస్.ఎస్ సమన్వయ అధికారులు మాధవి లత,

పి.కనక దుర్గ, నెహ్రూ యువ కేంద్రం సమన్వయ అధికారి శివ ప్రసాద్ రెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధి  à°ªà±†à°‚à°•à°¿ చైతన్య కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు à°Žà°‚.ప్రసాద రావు, రమణ

మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam