DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టెన్త్ లో శతశాతం ఉత్తీర్ణత సాధించాల్సిందే : కలెక్టర్ జె.నివాస్

ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌):

జిల్లాలో గల అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఈ ఏడాది 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులందరూ శతశాతం ఉత్తీర్ణత సాధించాల్సిందేనని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రధాన

ఉపాధ్యాయులకు తేల్చిచెప్పారు. శుక్రవారం మునసబుపేటలోని గురజాడ కళాశాల ఆడిటోరియంలో జిల్లాలోని జిల్లా పరిషత్, కె.జి.బి.వి, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్ ,

మునిసిపల్ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది 10వ

తరగతి చదువుతున్న విద్యార్ధులందరూ శతశాతం ఉత్తీర్ణత కావాలని, ప్రతీ సబ్జెక్టులోనూ 10/10 (జి.పి.à°Ž)  à°°à°¾à°µà°¾à°²à°¨à°¿, à°† దిశగా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఉపాధ్యాయులే నిజమైన హీరోలని, మనసుపెట్టి విద్యార్ధులకు బోధిస్తే అదేమి అసాధ్యం కాదని ఆయన స్పష్టం చేసారు. ప్రతీ విద్యార్ధి చదువులో వెనుకబడి ఉండాలనిగాని,

ఫెయిల్ అవ్వాలనిగాని ఆశించడని, అయితే వారికి అర్ధమయ్యేరీతిలో బోధించడం ద్వారా విద్యార్ధులు అద్భుతాలు సాధించగలరని చెప్పారు. ఈ విషయాన్ని ప్రయోగాత్మకంగా చేసి

చూపామని కలెక్టర్ గుర్తుచేసారు. ముందుగా గతేడాది 10à°µ తరగతి ఫలితాల్లో  à°¤à°•à±à°•à±à°µ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించిన ఆయన  à°‰à°¤à±à°¤à±€à°°à±à°£à°¤ శాతం

తగ్గడానికి à°—à°² కారణాలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న పాఠశాలలు, ఉత్తీర్ణత కాని  à°ªà°¾à° à°¶à°¾à°²à°² ప్రధానోపాధ్యాయులు మరింత ప్రత్యేక దృష్టి

సారించాలన్నారు. విద్యార్ధులను తమ స్వంత పిల్లలుగా భావించి, వారికి అవసరమైన విద్యను అందించాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల ఉత్తీర్ణత

శాతాన్ని బట్టి గ్రేడులుగా విభజించాలన్నారు. సి మరియు డి గ్రేడు విద్యార్ధులకు ప్రత్యేక బోధన ఇవ్వాల్సి ఉంటుందని, అటువంటి వారికి ప్రతీ రోజూ కనీసం ఒక గంట సేపు

ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లీషు , సైన్స్ సబ్జెక్టులలో విద్యార్ధులు తరువుగా ఉండేవిధంగా తీర్చిదిద్దాలన్నారు.

తద్వారా శతశాతం ఉత్తీర్ణత సాధించవచ్చని స్పష్టం చేసారు.  à°‰à°ªà°¾à°§à±à°¯à°¾à°¯à±à°²à± పాఠశాలల్లో సక్రమంగా పనిచేయకపోతే                   à°† లోపం పాఠశాల ప్రధానోపాధ్యాయులదేనని

కలెక్టర్ తెలిపారు. విద్యార్ధులకు గుణాత్మక విద్యను అందించాలని, విద్యను అందించడంలో ఎటువంటి అలక్ష్యం వహించిన సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని

కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్ధులతో పనులు చేయిస్తున్నారనే వార్తలు పత్రికల్లో వెలువడుతున్నాయని, విద్యార్ధులతో ఎటువంటి పనినైనా చేయిస్తే క్షమించేదిలేదని,

à°ˆ విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని మరోమారు  à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు.

       2018-19 సం.లో 10à°µ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన వంగర, 99.64 %

ఉత్తీర్ణత సాధించిన బూర్జ, 98.46% వీరఘట్టం, 98.29% సంతకవిటి, 99.26% ఎచ్చెర్ల, 98.89% నరసన్నపేట, 99.31% సంతబొమ్మాళి మండలాల విద్యాశాఖాధికారులను ఈ సందర్భంగా అభినందించిన కలెక్టర్ మిగిలిన

మండలాలు ఉత్తీర్ణత సాధించకపోవడంపై అసహనం వ్యక్తం చేసారు. వీరు మరింత శ్రద్ధ పెట్టి ఈ ఏడాది శతశాతం ఉత్తీర్ణత పొందేలా చూడాలన్నారు. ఈ మండలాలు చేపట్టే విధానాలను

అనుసరించి మిగిలిన పాఠశాలలు కూడా శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.

       à°œà°¿à°²à±à°²à°¾ విద్యాశాఖాధికారి కుసుమ

చంద్రకళ మాట్లాడుతూ జిల్లాలో ఆగష్ట్ మాసాంతానికే 10వ తరగతి సిలబస్ పూర్తిచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కు వివరించారు. 10వ తరగతిలో ఫార్మెట్ టెస్ట్ -1 మరియు 2 కూడా

నిర్వహించామని, ఇందులో ఉత్తీర్ణత శాతాన్ని అనుసరించి ఏ,బి,సి,డి గ్రేడులుగా విద్యార్ధులను ఎంపికచేయడం జరిగిందని తెలిపారు. సి, డి గ్రేడ్ విద్యార్ధులపై మరింత

శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, ప్రతీ రోజూ ఉదయం,సాయంత్రం ఒక గంటసేపు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రతీ సబ్జెక్టులో జిపిఎ 10కి

10తో పాటు శతశాతం ఉత్తీర్ణత సాధించేదిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె వివరించారు.

       à°ˆ సమీక్షా సమావేశంలో శ్రీకాకుళం , టెక్కలి ఉప విద్యాశాఖాధికారులు

జి.పగడాలమ్మ, కె.వాసుదేవరావు, ఆర్.విజయ కుమారి, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.రాజేంద్రప్రసాద్, రాజీవ్ విద్యామిషన్ – సర్వశిక్షఅభియాన్ ఏ.à°Žà°‚.à°“

యం.సంజీవరావు, జిల్లా పరిషత్, కె.జి.బి.వి, ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్ , మునిసిపల్ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam