DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాధనతోనే క్రీడల్లో విజేతలుగా నిలుస్తారు:సభాపతి 

రాష్ట్ర స్ధాయి మాస్టర్స్ స్విమ్మింగు పోటీలు ప్రారంభం 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15, 2019

(డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళంలో 4à°µ రాష్ట్ర స్ధాయి ఆంధ్ర ప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగు చాంపియన్ షిప్ -2019 పోటీలు ఆది వారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర శాసన సభాపతి

తమ్మినేని సీతారాం,  à°°à°¾à°·à±à°Ÿà±à°° రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, జిల్లా కలెక్టర్ జె నివాస్ సమక్షంలో స్ధానిక శాంతినగర్ కాలనీలోగల శాప్ స్విమ్మింగు

పూల్ వద్ద స్విమ్మింగు పోటీలకు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడలు ప్రారంభం అయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ ఈత పోటీలు ఆనందాన్ని,

ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నారు. నీరు కనిపించగానే కేరింతలు ప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ వంద మీటర్ల ఈత పోటీల్లో జిల్లాకు చెందిన సత్యంరాజు 1974

సంవత్సరంలో రికార్డు నెలకొల్పారన్నారు. స్విమ్మింగు అసోసియేషన్లు యువత ఎక్కువ మంది ఈ క్రీడలో ప్రవేశించుటకు చర్యలు చేపట్టాలని కోరారు. స్విమ్మింగు క్రీడ

అద్భుతమైన క్రీడ అన్నారు. శ్రీకాకుళం స్విమ్మింగు పూల్ ను అభివృద్ధి చేయుటకు చక్కటి ప్రణాళికలు, డిజైన్లతో ప్రతిపాదనలు తయారు చేయాలని వాటిని మంజూరు చేయించుటకు

చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రాధాన్యతను ఇస్తోందని ఆయన అన్నారు. కుల,మత, జాతి తదితర తేడాలు లేకుండా అందిరిలోనూ ఒకే భావన

స్ఫురింపజేసేది క్రీడలు మాత్రమేనని అన్నారు. పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లేశ్వరి, పూజారి శైలజ వంటి ఎందరెందరో తెలుగు క్రీడాకారులు జాతి రత్నాలుగా

వెలుగొందారు, వెలుగొందుతున్నారని సభాపతి అన్నారు. క్రీడాకారునికి, కళాకారునికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని సీతారాం అన్నారు. స్వతహాగా

క్రీడాకారుడైన సభాపతి స్పోర్ట్స్ మెన్ స్పీకర్ – స్పీకర్ స్పోర్ట్సు మెన్ à°—à°¾ ఉండటానికి ఆనందిస్తానని పేర్కొన్నారు. క్రీడాకారుడను కావడం వలన శాసన సభను చక్కగా

నిర్వహించగలుగుతున్నానని తెలిపారు. క్రీడాకారులు జాతికే గర్వకారణమన్నారు.
            రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ

స్విమ్మింగు మహత్తరమైన క్రీడ అన్నారు. ఏ క్రీడాకారుడికి అయినా స్విమ్మింగు చేయడం తప్పనిసరి తద్వారా భౌతికంగా ధృడంగా ఉంటారన్నారు. యువత ఎక్కువ మంది

క్రీడల్లోకి రావాలని కోరారు. స్విమ్మింగు పూల్ ను చక్కగా అభివృద్ధి చేయుటకు సహకరిస్తామని వచ్చే ఏడాది రాష్ట్ర స్ధాయి టోర్నమెంటును నిర్వహించాలని సూచించారు.

క్రీడా ప్రోత్సాహకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
            జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ స్విమ్మింగు పూల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.

క్రీడల వలన మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. ప్రభుత్వం సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్ అండ్ వెన్ నెస్ కేంద్రాలుగా మార్చాలని బావిస్తుందని చెప్పారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, అనారోగ్యం భారీన పడకుండా ఉండటానికి తగిన వ్యాయామం అవసరమని బావిస్తుందని అందుకు క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు.
           

రాష్ట్ర స్విమ్మింగు సంఘం ఉపాధ్యక్షులు దుప్పల వెంకట రావు మాట్లాడుతూ 4వ రాష్ట్ర స్ధాయి ఆంధ్ర ప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగు ఛాంపియన్ షిప్ -2019 పోటీలలో 13 జిల్లాల

నుండి దాదాపు రెండు వందల మంది స్విమ్మర్స్ పాల్గొంటున్నారన్నారు. 2016లో జిల్లాలో స్విమ్మింగు సంఘం ప్రారంభం అయిందని చెప్పరు. శ్రీకాకుళంలోగల స్విమ్మింగు పూల్ 20

సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందని, 28 మీటర్ల పొడవు, 6 లైన్లు కలిగిన స్విమ్మింగు పూల్ ను కనీసం 50 అడుగుల స్విమ్మింగు పూల్ గా అభివృద్ధి చేయడం వలన జాతీయ స్ధాయి

పోటీలు నిర్వహించే అవకాశం ఉంటుందని తెలిపారు.
       à°µà°¿à°µà°¿à°§ వయస్సుల విభాగంలో పోటీలను ప్రారంభించి విజేతలకు పతకాలను, సర్టిఫికేట్లను అందించారు.
        à°ˆ

కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, ప్రముఖ వైద్యులు డా.దానేటి శ్రీధర్, జాతీయ, రాష్ట్ర మాస్టర్స్ స్విమ్మింగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి

జె.లక్ష్మీనారాయణ రెడ్డి, జాతీయ మాస్టర్స్ ఆక్వాటిక్ ఫెడరేషన్ కోశాధికారి కే.శ్రీనివాసగౌడ్, చిత్తూరు మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.సుమతి రెడ్డి, జిల్లా

ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందర రావు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్ కుమార్, జిల్లా స్విమ్మింగు అసోసియేషన్ అధ్యక్షులు బుక్కూరు

ఉమామహేశ్వర రావు, కార్యదర్శి ఎన్.రాజారావు, కార్యనిర్వాహక కార్యదర్శి గీతా శ్రీకాంత్, రెడ్ క్రాస్ అధ్యక్షులు పి.జగన్మోహన రావు, డా.నిక్కు అప్పన్న తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam