DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పిల్లలకు బాల్యం నుండే హిందీ నేర్పాలి : డిపిఆర్ఓ రమేష్. 

దేశ భాష హిందీని అందరూ గౌరవించాలి

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌): దేశ రాజభాష

హిందీని అందరూ గౌరవించాలని, పిల్లలకు బాల్యం నుండే హిందీ ని తప్పనిసరిగా నేర్పించాలని డిపిఆర్ఓ ఎల్. రమేష్ అన్నారు. హిందీ మంచ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 15

రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో జరగనున్న హిందీ పక్షోత్సవాల లో భాగంగా రెండవ రోజు కార్యక్రమం ఆదివారం ఉదయం శ్రీకాకుళంలోని పి ఎస్ ఎన్ ఎమ్ హై స్కూల్ లో

జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డి పి ఆర్ ఓ రమేష్ మాట్లాడుతూ -హిందీ నేర్చుకోవడం ద్వారా దేశంలో ఎక్కడైనా ఉపాధి అవకాశాలు పొందవచ్చునని అన్నారు. ఉత్తర దక్షిణ

ప్రాంతాల మధ్య హిందీ వారధి లాంటిదని ఆయన అన్నారు.
 à°ªà°¿ ఎస్ ఎన్‌ ఎమ్ హైస్కూల్ ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు సదాశివుని శంకరరావు సభకు అధ్యక్షత వహించగా, హిందీ మంచ్

ఉత్తరాంధ్ర కన్వీనర్ ‌కోనే శ్రీధర్ మాట్లాడుతూ మంచ్ ఆధ్వర్యంలో à°—à°¤ పదేళ్లుగా మూడు జిల్లాలలో హిందీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని ,à°ˆ నెల 29 వరకు

పక్షోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.
  మంచ్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు సూరంపల్లి బ్రహ్మాజీ, రొక్కం వెంకటేశ్వరరావు, కోష్ఠ జడ్పీ హైస్కూల్ హెచ్ à°Žà°‚

 à°šà°¿à°•à±à°•à°¾à°² జగన్నాధరావు, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు జోగినాయుడు, పండిత పరిషత్ (RUPP)రాష్ట్ర ఉపాధ్యక్షులు పూడి జనార్ధనరావు, తెరవే ప్రధాన కార్యదర్శి  à°†à°°à± .వి .రమణ మూర్తి,

మంచ్ ప్రతినిధులు కనుగుల సత్యం, వి .భగవతి రావు ,వి.పద్మనాభరాజు, టి. శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
  ప్రముఖ హిందీ కవి, హిందీ సాహితీవేత్త అయిన కేంద్ర విద్యా శాఖా

మంత్రి డాక్టర్ ఆర్. రమేష్ ప్రోఖ్రియాల్ ను  à°…భినందిస్తూ సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది.

శంకరరావుకు కు సత్కారం : :
  ఉత్తమ హిందీ  à°¸à°¹à°¯à±‹à°—à±€ అధికారిగా

ఎంపికైన పి. ఎస్.ఎన్. à°Žà°‚. హెచ్. స్కూల్ ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయులు సదాశివుని శంకరరావును డిపిఆర్ఓ రమేష్ , జోగినాయుడు, కోనే శ్రీధర్ లు ‌దుశ్శాలువ, జ్ఞాపిక, ప్రశంసా

పత్రాలతో సన్మానించారు.

 à°‰à°¤à±à°¤à°® హిందీ సేవా కార్యకర్తగా తమ్మన శ్రీనివాస్ ను జ్ఞాపికతో అభినందించారు.

కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు షేక్ షరీఫ్, ఆర్.

రాంబాబు, ఆర్. మురళీకృష్ణ, నరేంద్ర బాబు ,అనంతలక్ష్మి, సులోచన, శారదా మణి, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam