DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కన్నా అక్రమ అరెస్ట్ సిగ్గుచేటు:.బిజెపి నేత ఈడిగ ..

బీజేపీ అధ్యక్షుని అరెస్ట్ పై పత్తికొండ బీజేపీ à°–à°‚à°¡à°¨ 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). . . 

అనంతపురం, సెప్టెంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజా

సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై సామరస్యంగా పోరాటానికి దిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో పాటు మరికొంతమంది  à°¨à°¾à°¯à°•à±à°²à°¨à± గృహనిర్బంధం

తోపాటు అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వానికి సిగ్గుచేటని కర్నూల్ జిల్లా పత్తికొండ నియోజకవర్గ  à°¬à°¿à°œà±†à°ªà°¿ ఇన్చార్జి ఈడిగ à°°à°‚à°—à°¾ గౌడ్ విమర్శించారు .సోమవారం

ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగా గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో చేపడుతున్న భారీ బహిరంగ సభతో పాటు ధర్నా

కార్యక్రమానికి శాంతియుతంగా వెళ్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ను గుంటూరు లోని ఆయన స్వగృహంలో అరెస్టు చేసి అక్కడే గృహనిర్బంధం చేయడం

పోలీసులకు ఎంతవరకు సబబని ప్రశ్నించారు .ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అయితే తమ అవినీతి అక్రమ పాలన ఎక్కడ బయట పడుతుందోనని

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులను వాడుకుంటూ బీజేపీ నాయకుల పై కేసులు బనాయించి అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రే తెలపాలని ఆయన అన్నారు

.ప్రజా సమస్యల పరిష్కారంపై భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కర్షక కార్మిక రైతులకు అండగా ఉంటుందని రాబోవు రోజుల్లో కూడా వారి వారి సమస్యల పరిష్కారం కోసం బిజెపి

వారు వెంటనే ఉండి పోరాడుతుందని అన్నారు .గృహనిర్బంధం తోపాటు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిన బిజెపి నాయకులను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో

రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పూనా

మల్లికార్జున జిల్లా ఉపాధ్యక్షుడు దండి  à°®à°²à±à°²à°¿à°•à°¾à°°à±à°œà±à°¨ లీగల్ సెల్ జిల్లా కో కన్వీనర్ అడ్వకేట్ నగేష్ సీనియర్ నాయకులు గోరంట్ల సిసి రంగన్న పత్తికొండ తుగ్గలి

మండలాల అధ్యక్షులు లక్ష్మణ్ రావు లక్ష్మణ స్వామి నాయుడు ఆకుల శ్రీనివాసులు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కరణం నరేష్ నగర్ రు నాగరాజు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam