DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెండింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలి : కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌):  à°†à°°à± అండ్ ఆర్ కాలనీలకు మంజూరు చేయబడిన మౌళిక సౌకర్యాల

పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం వంశధార,

తోటపల్లి, మహేంద్రతనయ ఆఫ్ సోర్ రజర్వాయర్ ప్రోజెక్టు పనులుపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్.డి.సి యూనిట్ 4 పేకేజి 2లో

భూసేకరణకు సంబంధించి 23 ఎకరాలు పెండింగ్ లో ఉందని అన్నారు. దీనిని వెంటనే పరిశీలించి అవార్డు పాస్ చేయించాలని ఆదేశించారు. పేకేజీ 2 లో సింగిడి బేలెన్సింగ్

రిజర్వాయరుకు సంబంధించి 40.4 ఎకరాలు పెండింగ్ ఉందని వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. పరిసర గ్రామాల్లో 40 ఎకరాలు ముంపుకు గురౌతుందని గ్రీవెన్స్ లో ఫర్యాదు

వచ్చినదందున దీనిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. హైలెవెల్ కాలువ నిర్మాణంలో చాలా పనుసు అసంపూర్తిగా ఉన్నాయని,ముందుగా నారాయణపురం వద్ద పనులు

పూర్తిచేయాలని ఆదేశించారు. ఆదేవిధంగా గజలీ గెడ్డ కల్వర్టు పనులు పూర్తిచేయాలని చప్పారు. ఎస్.డి.సి యూనిట్ 3 పనులు చాలా వెనుకబడి ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

మహేంద్రతనయ ఎడమకాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలకు సంబంధించి ఆర్.కె.పురం, టెక్కలిపట్నం,గోపాలపురం,చీపురుపల్లి కాలనీలకు

మౌళికవసతులు కల్పన కింద మంజూరు చేయబడిన సిసి రోడ్లు, కాలువలు, స్కూలు బిల్డింగ్స్, అంగవాడి బిల్డింగ్స్, తాగునిడి పధకాలు, విధ్యుత్ దీపాలు ఏర్పాటు వంటి పనులు 10

రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు.
        à°ˆ సమావేశంలో జిల్లా జాయింట్ కలక్టర్ à°¡à°¾. శ్రీనివాసులు, à°¡à°¿.ఆర్.à°“ బి. దయానిధి, భూసేకరణ స్పెషల్ డిప్యూడీ కలెక్టర్లు,

శ్రీకాకుళం, ఆర్.డి.ఓ. యమ్.వి. రమణ, పాలకొండ ఆర్.డి.ఓ జి.ఎస్. కుమార్, టెక్కలి ఆర్.డి.ఓ వెంకటేశ్వరరావు, నీటిపారుదల శాఖ, ఆర్. డబ్ల్యూ ఎస్. పంచాయితీరాజ్ ఇంజనీరింగ్

అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam