DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రతినెలా 30 న పౌర హక్కుల రోజు గా జరపాలి: కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, సెప్టెంబర్ 18, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ªà±Œà°° హక్కుల దినోత్సవంను ప్రతి నెల 30à°µ తేదీన విధిగా

నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు.  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± కార్యాలయంలో ఎస్.సి, ఎస్.à°Ÿà°¿ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం బుధ వారం జిల్లా

కలెక్టర్ జిల్లా కలెక్టర్ జె నివాస్ అధ్యక్షతన జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవంను ప్రతీ నెల విధిగా నిర్వహించి ప్రజల్లో విస్తృత

అవగాహనకు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకుగాను ముందుగా షెడ్యూల్ తయారు చేసి కమిటీ సభ్యులకు తెలియజేయాలని ఆదేశించారు. అవగాహన కార్యక్రమాలు మండల స్థాయిలో

నిర్వహించాలని పేర్కొన్నారు. పౌర హక్కుల దినోత్సవం కు సంబంధించి, చట్టాలపై అవగాహనకు కరపత్రాలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. డి పట్టాలు కలిగిన ఎస్.సి, ఎస్.టీలకు

సహకార బ్యాంకులు రుణాల మంజూరుకు బ్యాంకర్స్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న కేసుల వివరాలు సమర్పించాలని

పేర్కొన్నారు.

 à°Žà°¸à±à°ªà±€ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం ఏ గ్రామంలో అయినా నిర్వహించవచ్చు. అందరికీ అవగాహన అవసరమన్నారు.

రాజాం శాసన

సభ్యులు కంబాల జోగులు మాట్లాడుతూ అత్యాచార కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 2019లో కూడా 59 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కేసులను తప్పుడు విధానాలతో నమోదు

 à°šà±‡à°¯à°•à±‚డదని పిలుపునిచ్చారు. అత్యాచార కేసులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని పేర్కొంటూ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కోరారు.

పలాస శాసన సభ్యులు

డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఎస్. సి, ఎస్.టి లకు రుణాలు మంజూరు చేయాలని కోరారు.

 à°¸à°¾à°‚ఘిక సంక్షేమ శాఖ à°¡à°¿à°¡à°¿ కె వి ఆదిత్య లక్ష్మి ఎల్.ఎన్. పేట భూమి ఆక్రమణలపై 20à°¨

అధికారుల సంయుక్త పరిశీలన ఉందని తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టుల నియామకాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్నామని చెప్పారు.  109 ట్రయల్ కేసులు పెండిగులో

ఉన్నాయని చెప్పారు. ఎస్.సి, ఎస్.టి(పి.ఓ.ఏ) కేలులు 2015లో ఒక కేసు నమోదు కాగా, 2018లో 12, 2019లో 48 కేసులు వెరశి 61 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.

కమీటీ సభ్యులు బేసి మోహన రావు

మాట్లాడుతూ ఎల్.ఎన్. పేట మండలంలో ఎస్.సి లకు కేటాయించిన 30 సెంట్ల భూమిని ఇతరులు ఆక్రమిస్తున్నారని చెప్పారు.

కమిటీ సభ్యులు బోసు మన్మధరావు మాట్లాడుతూ ఎస్.సి,

ఎస్.టీల పై జరుగుతున్న అత్యాచారాల కేసులు నిర్వీర్యం అవుతున్నాయని, బాధితులకు న్యాయం జరగటం లేదని తెలిపారు. 2017లో జరిగిన ఘటనలకు శ్రీకాకుళం మండలం పెద్దపాడు, భామిని

మండలం తాలాడా, ఘనసర గ్రామాలకు చెందిన బాధితులకు నష్టపరిహారం ఇంకా అందలేదని తెలిపారు. ఎచ్చెర్ల మండలంలో జాతీయ రహదారి విస్తరణలో ఎస్.సి కుటుంబాలకు నష్టపరిహారం

అందలేదని, ఎస్.సి కార్పొరేషన్ లో నియమ నిబంధనలను సక్రమంగా అమలు చేయడం లేదని తెలిపారు. ఎస్.సిలో లేని కులాలకు కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయరాదని అన్నారు.

బెంథోరియా, బేడజంగాలు వంటి కులాలు ఎస్.సిలో లేదని తెలిపారు. గుర్రం జాషువా విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు.

ఎచ్చెర్ల మండలానికి చెందిన లింగాల రామకృష్ణ

మాట్లాడుతూ మండల స్థాయిలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించుటకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి

బలివాడ దయానిధి, ఆర్డీఓ లు కుమార్, ఐ కిశోర్, డిఎస్పీలు ఏ.యస్.చక్రవర్తి,ఏ.సత్యనారాయణ, సి.హెచ్.జి.వి.ప్రసాద్, డి.ఎస్.ఆర్.వి.సత్యన్నారాయణ మూర్తి, ప్రసాద్, యం.శివరామ కృష్ణ,

గిరిజన సంక్షేమ శాఖ డిడి కమల, ఎల్.డి.ఎం హరి ప్రసాద్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశ్వర రావు, స్వీప్ సంస్థ డైరెక్టర్ రమణ మూర్తి, ఎస్.సి, ఎస్.టి సంఘం

ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam