DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధాని కి ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పిస్తాం : కన్నా లక్ష్మీనారాయణ.  

రాష్ట్ర అభివృద్ధి కే బీజేపీ కట్టుబడి ఉంది

చంద్రబాబు ని ప్రజల ముందు దోషిగా నిలబెడతాం

పార్టీలను తిట్టేందుకే కోట్లాది ప్రజాధనం వృధా.  

మాయనాడు పేరిట

డబ్బా కొట్టుకోవడం చంద్రబాబు 

ఏటీఎం ల్లో డబ్బుల్లేక పోవడానికి కారణం చంద్రబాబు అవినీతే. 

బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు కన్నా

లక్ష్మీనారాయణ

తిరుపతి, మే 31  2018 (DNS Online) : రాజధాని à°•à°¿ తీసుకున్న భూముల్లో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్రం కోట్లాదిగా మంజూరు చేసిన నిధులకు చంద్రబాబు నాయుడు లెక్క

చెప్పి తీరాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు

చేపట్టిన అనంతరం తొలిసారి తిరుమల శ్రీనివాసుని దర్శించుకొన్న అనంతరం దిగువ తిరుపతిలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. చంద్రబాబు అవినీతి,

అసమర్థతతో రాష్ట్రం వెనుకబాటుకు గురవుతోందని.. దీన్ని కప్పిపుచ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై బురదచల్లే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు.

మొత్తం రాజధాని à°•à°¿ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంచనా రూ. 3500  à°•à±‹à°Ÿà±à°²à±. వీటిలో ఇప్పడికే 2500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇచ్చేసిందన్నారు. ఇదంతా ప్రజాధనమని,

విదేశాల్లో విలాసాలు చేసుకోడానికి, సదస్సుల పేరిట సొంత ఈవెంట్ మేనేజర్ల ను మేపడానికి, స్టార్ హోటళ్ల లో కుటుంబ సభ్యులతో సహా నెలలకి నెలలు విలాసాలు జరుపుకోడానికి

ఇది చంద్రబాబు సొంత ఖజానా కాదన్నారు. 

మహానాడు కాదు మాయనాడే....  

కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి, ప్రభుత్వ సిబ్బంది ని వాడుకోడానికి వాళ్లంటే తెలుగుదేశం

పార్టీ కార్యకర్తలా అని మండిపడ్డారు. చంద్రబాబు నిర్వహించేది మహానాడు కాదని, అదంతా à°’à°• మాయ నాదని, à°—à°¤ మూడు ఏళ్లుగా నిర్వహించిన మాయ నాడు  à°²à±à°²à±‹ వై ఎస్ ఆర్ కాంగ్రెస్

ను తిట్టడానికీ, ఈ సారి మాయనాడు లో బీజేపీ ని తిట్టడానికీ భారీ సెట్టింగులతో వేదికలను ఏర్పాటు చేసి, కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసాడని చంద్రబాబు పై

మండిపడ్డారు. ప్రస్తుత కాలం లో కాలం చెల్లిపోవడం తో అత్యంత నీచ స్థాయికి దిగజారి, తమ పార్టీ à°•à°¿ బద్ద శత్రువైన  à°•à°¾à°‚గ్రెస్ పార్టీకి అద్దె మైకు లా తయారయ్యావు అని

ఎద్దేవా చేశారు. 

నాలుగు ఏళ్ళు పాటు ఎన్డీఏ కూటమి లో కలిసి ఉంది, ఆంధ్రాకి కావాల్సిన నిధులన్నీ దోచుకుని, ప్రజలకి వాటి లెక్కలు చెప్పకుండా సొంత ఖాతాల్లో

వేసుకుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేంద్రం ఇచ్చిన ప్రతీ పైసా à°•à°¿ లెక్క చెప్పి తీరాలన్నారు. అతని చేతే చెప్పిస్తామన్నారు.  

ఆంధ్ర ప్రదేశ్ కి

ఇచ్చిన ప్రతీ రూపాయికే కేంద్రం వద్ద లెక్కలున్నాయని, అయితే వాటినే ఎలా ఖర్చు చేశారో చెప్పవలసిన భాద్యత చంద్రబాబుదే నన్నారు. విభజన చట్టం లో ఉన్న 11 జాతీయ విద్య

సంస్తల తో పాటు హామీలు ఇవ్వని సంస్తలను కూడా చాలా వాటిని ఆంధ్ర కే కేటాయించామన్నారు. చంద్రబాబు, ఇవన్నీ తీసుకుని, ప్రత్యేక హోదా స్థానం లో ప్రత్యేక ప్యాకెజీ  à°•à°¿

అంగీకరించి, తనకి దుర్భుద్ధి పుట్టి, కాంగ్రెస్ పార్టీ ఇఛ్చిన ఆఫర్లకు లొంగి, ఎన్నికల్లో గెలవడానికి సహకరించిన బీజేపీ ని, పవన్ కళ్యాణ్ ని కూడా అత్యంత నీచంగా

విమర్శించడం కేవలం చంద్రబాబుకే చెల్లిందని, అతనొక రాజకీయ విష కీటకమన్నారు. అతను పూర్తిగా అవకాశవాదిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ని భూస్థాపితం

 à°šà±‡à°¸à±‡à°‚దుకే ఎన్ à°Ÿà±€ ఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అలాంటి పార్టీని అదే కాంగ్రెస్ కు తాకట్టు పెట్టడం అంటే ఎన్ à°Ÿà±€ ఆర్ కు తీరని ద్రోహం

చేసినట్టేనన్నారు. 

విశాఖ లో సదస్సులన్నీ  à°®à±‹à°³à±€à°¯à±‡, నిధులన్నీ హుళ్లక్కే. 

వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, విశాఖ సాగర తీరం లో నెలకో సదస్సు నిర్వహించి,

కోట్లాది రూపాయలు స్టార్ హోటళ్ల పాలు చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడేనన్నారు. తన అనుయాయులకు లెక్క పత్రం లేకుండా ఇతను చేసిన సాయం, కాంట్రాక్టుల పై కూడా విచారణ

చేయాలన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, నోవాటెల్ హోటల్ కు సమర్పించుకున్న మొత్తం భారీగానే ఉంటుందన్నారు. నాలుగేళ్లు కాలం లో నిర్వహించిన ఉత్తుత్తి

సదస్సుల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఒప్పందాలు సైతం డమ్మీ లెక్కలు చూపించిన ఘనతే కేవలం చంద్రబాబు కే సొంతమన్నారు. 

చంద్రబాబు చేసిన

ప్రతీ మోళీకీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి పరిస్థితి వచ్చిందన్నారు. రానున్న కాలం లో ప్రజల ముంగిట అసలు విషయాలు, నిజాలు బయట పెడతామని, చంద్రబాబుని ప్రజల ముందు

దోషిగా నిలబెట్టి, ఇఛ్చిన నిధులను లెక్కలు చెప్పిస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశం లో సీనియర్ నేత, టిటిడి బోర్డు మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి,

తదితరులు పాల్గొన్నారు.

 

pix: Courtesy... to whom so ever.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam