DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పడవ ప్రయాణాల్లో ప్రమాణాలు పాటించాల్సిందే:  

బోటు ప్రయాణికులకు లైఫ్ జాకెట్, జీవిత బీమా తప్పనిసరి 

అన్ని పర్యాటక ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి

సముద్ర తీరాల్లో 'లైఫ్ గాడ్స్'

కొనసాగించాలి

పర్యాటక శాఖ మంత్రి ఎం శ్రీనివాసరావు

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌):

గోదావరి నది లో జరిగిన దుర్ఘటన ఇకమీదట జరగకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు అందరిపైనా ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు

పేర్కొన్నారు. గురువారం విశాఖనపట్నం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పర్యాటక ప్రాంతాలలో  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°²à± జరగకుండా అనుసరించవలసిన  à°µà°¿à°§à°¾à°¨à°¾à°² పై

సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ సముద్రము, నదులు, జలాశయాలు, జలపాతాలు వంటి పర్యాటక ప్రాంతాలలో ఖచ్చితంగా నిబంధనలను పాటించాలన్నారు. బోట్ల కు లైసెన్సులు, 'లైఫ్

గాడ్స్' నియామకానికి నిబంధనలను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలో రెవిన్యూ, నేవీ, మత్స్యశాఖ, ఇరిగేషన్, పర్యాటక, జీవీఎంసీ అధికారులతో

కూడిన ఈ కమిటీ జీవీఎంసీ కమిషనర్ అధ్యక్షతన పని చేస్తుందని చెప్పారు. పర్యాటక ప్రాంతాలలో ఎదురయ్యే ప్రమాదాల గురించి పర్యాటకులకు అవగాహన కల్పించాలని, వాతావరణ

పరిస్థితులను, ప్రమాదాలను గురించి హెచ్చరిస్తూ ఉండాలన్నారు. పర్యాటక ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టూరిస్ట్ లైసెన్స్ ఉన్న బోట్లను

మాత్రమే యాత్రీకులు తీసుకుని వెళ్ళేలా సంబంధిత శాఖలు నిఘా నిర్వహిస్తూ ఉండాలన్నారు. పర్యాటకులను తీసుకువెళ్లే బోట్లకు కావలసిన నియమాలు, కట్టుబాట్లు, అవసరమైన

పరీక్షలు మొదలైన  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿ కచ్చితంగా అమలు చేయవలసిందేనని ఆదేశించారు. బోట్లను నియమిత కాలాల్లో తప్పక తనిఖీ చేయవలసిందేనని, అదే క్రమంలో పర్యాటకులకుఅవగాహన

కల్పించాలని మంత్రి ఆదేశించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో గల సముద్ర తీరాలు, నదీ ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలను గూర్చి, అక్కడ అనుసరిస్తున్న

విధానాలను గురించి సంబంధిత అధికారులతో మంత్రి క్షుణ్ణంగా సమీక్షించారు. పర్యాటక శాఖ ఆధీనంలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని బోట్లు నడుస్తున్నాయి, వివిధ శాఖల

ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక ప్రాంతాల లో తీసుకున్న జాగ్రత్తలను గురించి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 

జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ గోదావరి

లో జరిగిన పడవ ప్రమాదం సమన్వయ లోపం కారణంగానే జరిగినట్లు తెలియ వచ్చిందన్నారు. మనం ఎంతటి మేధస్సును సాధించిన ప్రకృతి వ్యతిరేకతను ఎదుర్కోవడం ఎంతో కష్టమని

చెప్పారు. అధికారులు పోలీసులు పర్యాటకులను హెచ్చరిస్తూ ఉండాలని, ప్రజలు కూడా వారి ఆజ్ఞలను, సలహాలను పాటిస్తూ ఉండాలన్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా

చూసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నేవీ కమాండ్ ఏవియేషన్ అధికారి కెప్టెన్ పంకజ్ రాయ్ పర్యాటక బోట్ల

రకాలను గురించి, వాటి ప్రమాణాలను గురించి, నావికులకు సరంగులకు అవసరమైన శిక్షణ గురించి వివరించారు. నదీ మార్గాలకు సంబంధించి ఎంతటి శిక్షణ కలిగినవారయినను స్థానిక

ఈతగాళ్ళు సరంగుల నుండి అనుభవ పూర్వకముగా మెలుకువలు తెలుసుకోవలసిందే నని నేవీ అధికారులు చెప్పారు.
à°ˆ సమావేశంలో à°¡à°¿ ఐ జి  à°°à°‚గారావు, పోలీస్ కమిషనర్ ముఖేష్ కుమార్

మీనా, వి ఎం ఆర్ డి ఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, విశాఖ పోర్టు ట్రస్ట్ డిప్యూటీ చైర్మన్, మూడు జిల్లాల

పర్యాటక శాఖ అధికారులు. మత్స్యశాఖ, భారత నావికా దళ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam