DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదివాసీ యువతులకు స్వయం ఉపాధిలో చేయూత

చింతపల్లి, విశాఖపట్నం, మే 31, 2018 (DNS Online) :  à°šà±‡à°¯à±‚à°¤ కార్యక్రమం లో భాగంగా గురువారం విశాఖ పట్నం జిల్లా చింతపల్లి ఏజన్సీ ప్రాంతం లోని ఆదివాసీ యువతులకు కుట్టు మిషన్లు వితరణ

చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన విశాఖ జిల్లా ఎస్ పీ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగం లో

శిక్షణ ఇవ్వడం ద్వారా స్వయంగా అభ్యున్నతి సాధించాలి అనే పట్టుదల లభిస్తుందన్నారు. à°ˆ కార్యక్రమం చింతపల్లి వై à°Ÿà°¿ సి నందు నిర్వహించారు. ఇప్పడికే  à°šà±‡à°¯à±‚à°¤

కార్యక్రమం లో భాగంగా చింతపల్లి, జికె వీధి మండలాల నుంచి వఛ్చిన 30 మంది ఆదివాసీ యువతులకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం జరిగిందని,  à°¦à±€à°¨à°¿ ద్వారా మహిళల వస్త్రాలు

కుట్టడం తో పాటు, ఆధునిక మోడళ్లలో వస్త్ర కటింగ్ లు కూడా నేర్పించడం మంచి ఫలితాన్నిస్తుందన్నారు. ఆదివాసీ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, అందుకే పోలీసు

విభాగం , ఆంధ్ర ప్రదేశ్ రాష్త్ర ప్రభుత్వ సహకారం తో చేయూత కార్యక్రామాలని నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పుడు యువత అసాంఘిక శక్తుల పట్ల వ్యామోహితులు కాకుండా

దేశాభివృద్ధిలో పాలు పంచుకునేలా అవగాహన పెంచుతున్నామన్నారు. ప్రస్తుతం ఉన్నతమైన ఆలోచనల్లో వెలుగొందుతున్న ఆదివాసీ యువత అసాంఘిక శక్తులు చెప్పే కల్లిబొల్లి

కబుర్లు వినే స్థితి లో లేవన్నారు. ఈ శిక్షణ లో పాల్గొన్న ప్రతి యువతికి ఒక్కొక్క కుట్టు మిషన్ ను ఉచితంగా అందించామన్నారు. యువత ముందుకు వస్తే ఇలాంటి

కార్యక్రమాలు మరియు వారి స్వయం అభివృద్ధికి ఉపయోగ పడే శిక్షణ లు కూడా అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ శిక్షణ లో పాల్గొన్న యువతులను, శిక్షణ ఇచ్చిన సిబ్బందిని

అభినందించారు. శిక్షణ లో భాగం గా యువతులు తయారు చేసిన వస్త్రాలను చూసి హర్షం వ్యక్తం చేశారు. వీరు ఏర్పరుచుకున్న మన్యం గ్రూప్ కి జిల్లా పోలీసు సహకారం ఎప్పుడూ

ఉంటాయని హామీ ఇచ్చారు. గత నెల 25 నుంచి జరుగుతున్న ఈ శిక్షణ గురువారం ముగిసింది.ఈ కార్యక్రమం లో చింతపల్లి ఎస్ డి పి ఓ అనిల్ పులిపాటి, డి ఎస్ పి రాజేంద్ర కుమార్, ఐ టి డి ఏ

ప్రత్యేక అధికారు రవీంద్ర, చింతపల్లి సి ఐ చంద్రశేఖర్, జి కె వీధి సి ఐ నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. 


 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam